దేశంలో 2022లో నిరుద్యోగం రేటు భారీగా పెరిగిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ-సీఎంఐఈ వెల్లడించింది. దేశంలో డిసెంబరులో నిరుద్యోగిత రేటు 8.3 శాతానికి చేరిందని, 2022లో ఇదే అత్యధికమని తెలిపింది. దేశంలో అత్యధికంగా హరియాణాలో నిరుద్యోగం(2022 డిసెంబరులో 37.4%) ఉందని సీఎంఐఈ ఓ నివేదికలో పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో..
- రాజస్థాన్- 28.5 శాతం
- దిల్లీ- 20.8 శాతం
- బిహార్- 19.1 శాతం
- జార్ఖండ్- 18 శాతం
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటా ప్రకారం
- నవంబర్‌లో నిరుద్యోగిత రేటు 8 శాతం
- సెప్టెంబర్‌లో ఇది అత్యల్పంగా 6.43 శాతం
- ఆగస్టులో 8.28 శాతం. 2022లో రెండో అత్యధిక నిరుద్యోగిత రేటు ఇదే.
- పట్టణ నిరుద్యోగిత రేటు 10 శాతం
- గ్రామీణ నిరుద్యోగం 7.5 శాతం
ఇవీ చదవండి:
'పెద్ద నోట్ల రద్దు సరైనదే'.. కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు
ఆకాశ్ అంబానీ ఫేక్ ఐడీతో ఆమెకు వల.. రూ.25 లక్షలు కాజేసి, న్యూడ్ ఫొటోస్తో బెదిరించి..