ETV Bharat / business

'ఉబర్' లీక్స్​.. బిజినెస్ ప్రయాణంలో చీకటి రహస్యాలు - uber in european union files leaked

ఉబర్ ఫైల్స్ లీకులు.. ఇప్పుడు బిజినెస్​ ప్రపంచాన్ని విస్తుగొలుపుతున్నాయి. కార్యకలాపాల విస్తరణ సమయంలో ఉబర్​ అవకతవకలకు పాల్పడ్డట్లు లీకుల్లో బయటపడింది. ఫ్రాన్స్​ అధ్యక్షుడు మేక్రాన్​తోపాటు యూరోపియన్ కమిషన్.. ఉబర్‌కు నిబంధనలకు విరుద్ధంగా సాయం చేసినట్లు కీలక పత్రాల ద్వారా తెలుస్తోంది. ఇంతకీ లీకైన ఫైల్స్​లో ఏమున్నాయి? ఎలా జరిగింది? ఉబర్​ ఏం చెబుతోంది?

UBER
ఉబర్​
author img

By

Published : Jul 11, 2022, 3:26 PM IST

ఉబర్‌.. బహుశా ఈ పేరు వినని నగరవాసులు ఉండరంటే అతిశయోక్తి కాదు. రైడ్‌ షేరింగ్‌ మార్కెట్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకొని అనతికాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందింది. అయితే, కార్యకలాపాల విస్తరణ సమయంలో ఎన్నో అవకతవకలకు పాల్పడ్డట్లు తాజాగా బయటకొచ్చిన కొన్ని కీలక పత్రాల ద్వారా తెలుస్తోంది. వ్యాపార విస్తరణ కాంక్షతో దేశాధినేతలను సైతం తమ ఆఫర్లతో ప్రభావితం చేయడం ఇప్పుడు బిజినెస్‌ ప్రపంచాన్ని విస్తుగొలుపుతోంది.

అవకతవకలకు పాల్పడ్డట్లు ఉబర్‌ సైతం అంగీకరించింది. అయితే, అప్పటి తమ నిర్ణయాలు ప్రస్తుత విలువలతో ఏమాత్రం సరిపోలవని ప్రకటించింది. అప్పటితో పోలిస్తే కంపెనీ ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని చెప్పుకొచ్చింది. 2013-17 మధ్య ఈ-మెయిళ్లు, ఇతర పత్రాలు సహా మొత్తం లక్షకు పైగా రికార్డులను పరిశీలించడం ద్వారా అవకతవకలకు పాల్పడిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 'ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌' సహా ప్రపంచవ్యాప్తంగా పలు మీడియా సంస్థలకు ఈ వివరాలు అందుబాటులోకి వచ్చాయి. ఐరోపా ట్యాక్సీ మార్కెట్‌కు హస్తగతం చేసుకునేందుకు ఏటా 90 మిలియన్‌ డాలర్ల వరకు లాబీయింగ్‌ కోసం ఖర్చు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో అనేక మంది ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులను సైతం ఉపయోగించుకొన్నట్లు స్పష్టమవుతోంది.

మేక్రాన్‌ తలపెట్టిన మేలు..: 2014లో ఆర్థికమంత్రిగా ఉన్న ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ (ప్రస్తుతం ఫ్రాన్స్‌ అధ్యక్షుడు), ఐరోపా సమాఖ్య మాజీ డిజిటల్‌ కమిషనర్‌ నీలీ క్రోస్‌.. వంటి పెద్దతలకాయలు ఉబర్‌కు అనుకూల నిర్ణయాలు తీసుకున్నట్లు లీకైన పత్రాల ద్వారా తెలుస్తోంది. దీనంతటికీ అప్పటి ఉబర్‌ బాస్‌ ట్రావిస్‌ కలనిక్‌ నిర్ణయాలే కారణమని సమాచారం. 2017లో ఆయనకు ఉద్వాసన పలికారు. తర్వాత వచ్చిన దారా ఖోస్రోషాహికి సంస్థ ప్రక్షాళన బాధ్యతలు అప్పగించినట్లు తాజాగా ఉబర్‌ పేర్కొంది. ఓ చట్టబద్ధమైన పబ్లిక్‌ కంపెనీ వలే నడిపేందుకు ఆయన అనేక మార్పులు చేసినట్లు వెల్లడించింది.

ఐరోపాలో తొలిసారి 2014లో ప్యారిస్‌ నగరం నుంచి ఉబర్‌ కార్యకలాపాల్ని ప్రారంభించింది. దీన్ని ఒక గొప్ప ఉద్యోగ కల్పన అవకాశంగా భావించిన మేక్రాన్‌ కంపెనీ ఎదుగుదలకు తన పరిధిని దాటి నిర్ణయాలు తీసుకున్నారు. చివరికి లైసెన్స్‌ లేని డ్రైవర్లు కూడా తక్కువ ధరతో రైడ్‌ సేవల్ని అందించే 'ఉబర్‌ప్రాప్‌' కార్యకలాపాలకు అనుమతించారు. కోర్టు, పార్లమెంటు దాన్ని రద్దు చేసింది. అయినా, ఆ నిర్ణయంపై అప్పీల్‌కు వెళ్లి ఉబర్‌ప్రాప్‌ సేవల్ని కొనసాగించారు. దీనికి మేక్రాన్ మద్దతు ఉన్నట్లు తాజా పత్రాల ద్వారా వెల్లడవుతోంది. ఉబర్‌ప్రాప్‌పై ఫ్రాన్స్‌ ట్యాక్సీ ఇండస్ట్రీ పెద్దఎత్తున నిరసనలు చేపట్టింది. చివరకు అవి హింసాత్మకంగా మారడంతో ఉబరే వెనక్కి తగ్గింది. ఉబర్‌ప్రాప్‌ అనుమతికి ముందు మేక్రాన్‌, ట్రావిస్‌ కలనిక్‌ పలుసార్లు కలవడం అప్పల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే, మేక్రాన్‌ తన విధుల్లో భాగంగానే ఉబర్‌ బాస్‌ను కలిశారని తర్వాత ఆయన అధికార ప్రతినిధి వెల్లడించారు.

ఉబర్‌, నెదర్లాండ్స్‌కు వారధిగా..: తమ అధికార పరిధిని దాటి ఉబర్‌కు సహరికరించిన పెద్ద తలకాయల్లో ఐరోపా సమాఖ్య డిజిటల్‌ కమిషనర్ నీలీ క్రోస్‌ ఒకరు. మైక్రోసాఫ్ట్‌, ఇంటెల్‌ వంటి బడా సంస్థలకు భారీ జరిమానాలు విధించిన బ్యూరోక్రాట్‌గా ఆమెకు పేరుంది. తన సొంతదేశమైన నెదర్లాండ్స్‌లో ఉబర్‌ప్రాప్‌ కార్యకలాపాల కొనసాగింపునకు ఆమె పరోక్షంగా సహకరించారు. అప్పటి ఆ దేశ ప్రభుత్వ పెద్దలను ఒప్పంచి నియమ, నిబంధనలను అందుకనుగుణంగా మార్పించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ, నెదర్లాండ్స్‌ కోర్టులు సైతం ఉబర్‌ప్రాప్‌ను రద్దు చేయాలని ఆదేశించాయి. పైగా ఉబర్‌తో తనకున్న అనధికార సంబంధాల్ని బయటకు వెల్లడించొద్దని క్రోస్‌ తమ సిబ్బందిని కోరుతూ రాసిన ఈ-మెయిల్‌ ఒకటి వెలుగులోకి వచ్చింది. నెదర్లాండ్స్‌ ప్రభుత్వానికి, ఉబర్‌కు మధ్య క్రోస్‌ వారధిగా పనిచేశారు. అందుకు ప్రతిఫలంగా ఆమె తన పదవీకాలం ముగిసిన తర్వాత ఉబర్‌లో సలహాదారుగా చేరేలా ఒప్పందం కుదుర్చుకొన్నారు. కానీ, ఇది ఈయూ నిబంధనలకు విరుద్ధం. అయినప్పటికీ.. అనధికారికంగా ఆమె ఆ బాధ్యతల్లో కొనసాగారు.

కిల్‌ స్విచ్‌..: ఒకవేళ పోలీసులు లేదా ఇతర దర్యాప్తు సంస్థలు ఉబర్‌పై విచారణ చేపడితే వీలైనంత తర్వాత 'కిల్‌ స్విచ్‌' వ్యవస్థను యాక్టివేట్‌ చేయాలని తమ సిబ్బందిని ట్రావిస్‌ స్వయంగా ఆదేశించినట్లు ఈ-మెయిళ్ల ద్వారా తెలిపింది. ఫలితంగా కంపెనీ కేంద్ర కార్యాలయంలో ఉండే కీలక సమాచారాన్ని యాక్సెస్‌ చేసేందుకు దర్యాప్తు సంస్థలకు సాధ్యంకాదు. ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉన్న తమ ఉబర్‌ సర్వర్ల నుంచి డ్రైవర్ల జాబితా వంటి కీలక సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు యాక్సెస్‌ చేసుకోలేవు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. ఏ కార్పొరేట్‌ కంపెనీ అయినా ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు విచారణలో సహకరించాలి. కానీ, ఉబర్‌ దీన్ని తమ వృద్ధికి అవరోధంగా భావించింది.

ఇదీ చదవండి: కారులోకి వరద నీరు చేరిందా.. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.