ETV Bharat / business

టాప్​ అప్​ హెల్త్ ఇన్సూరెన్స్​ వల్ల లభించే బెస్ట్​ బెనిఫిట్స్ ఇవే! - Family Floater Plan

Top Up Health Insurance Benefits In Telugu : మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా? దాని కవరేజ్ సరిపోదని అనుకుటున్నారా? అయితే ఇది మీ కోసమే. పెరుగుతున్న వైద్య ఖర్చులకు ప్రస్తుత పాలసీ సరిపోదని భావించేవారు టాప్-అప్ పాలసీ తీసుకోవడం మంచిది. ఎందుకంటే దీని వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Top Up Plan benefits
Top up Health Insurance benefits
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 5:27 PM IST

Top Up Health Insurance Benefits : జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో, ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలియదు. అందుకే ముందు జాగ్రత్తగా ఆరోగ్య బీమా తీసుకోవడం మంచిది. అయితే సాధారణ ఆరోగ్య బీమా వల్ల, ఎంచుకున్న పరిమితి మేరకు మాత్రమే వైద్య ఖర్చులు లభిస్తాయి. ఒక వేళ ఏదైనా అనారోగ్యం కార‌ణంగా, ప్ర‌స్తుతం ఉన్న‌ ఆరోగ్య బీమా పాలసీ అందించే కవరేజీ సరిపోకపోతే, మిగతా సొమ్మును మనం స్వయంగా చెల్లించాల్సి వస్తుంది. అలాగ‌ని ఎక్కువ మొత్తానికి బీమా తీసుకోవాలంటే, చాలా పెద్దమొత్తంలో ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని రూపొందించినవే టాప్‌ అప్ పాలసీలు. ఇవి అవసరం అయినప్పుడు అధిక మొత్తంలో బీమా చెల్లించి, పెద్ద మొత్తంలో పరిహారం పొందడానికి వీలు కల్పిస్తాయి. పెరుగుతున్న వైద్య ఖర్చులకు ప్రస్తుత పాలసీ సరిపోదని భావించేవారు టాప్-అప్ పాలసీ తీసుకోవడం మంచిది.

ఉదాహరణకు ఓ వ్యక్తి రూ.5 లక్షలకు ఆరోగ్య బీమా చేయించుకున్నాడు అని అనుకుందాం. అతను అనారోగ్యానికి గురై వైద్యఖర్చులు రూ.6.5 లక్షలు ఖర్చు అయితే, బీమా కంపెనీ హామీ ఇచ్చిన రూ.5 లక్షలే చెల్లిస్తుంది. మిగతా రూ.1.5 లక్షలు, పాలసీదారుడే స్వయంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే రూ.5లక్షల త్రెషోల్డ్ లిమిట్ కలిగిన టాప్-అప్ పాలసీ తీసుకున్నట్టయితే, ఖర్చు అయిన అదనపు సొమ్మును కూడా టాప్-అప్ పాలసీ ద్వారా క్లెయిం చేసుకునే అవకాశం ఉంటుంది.

టాప్ అప్ పాలసీ బెనిఫిట్స్​

  1. సాధారణ ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం కంటే ఈ టాప్-అప్ పాలసీల ప్రీమియం తక్కువగా ఉంటుంది. అందువల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ కవరేజ్ ఇచ్చే బీమా పొందేందుకు ఈ పాలసీలు ఉపయోగపడతాయి.
  2. బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్​ లేక‌పోయిన‌ప్ప‌టికీ టాప్‌-అప్ పాల‌సీ తీసుకోవ‌చ్చు. అయితే త్రెషోల్డ్ లిమిట్ దాటిన తరువాత మాత్రమే టాప్-అప్‌ పాలసీ వర్తిస్తుంది.
  3. టాప్-అప్ పాలసీని, బేసిక్‌ ఆరోగ్య బీమా కొనుగోలు చేసిన సంస్థ నుంచి మాత్రమే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇతర కంపెనీల టాప్-అప్ పాలసీలు కూడా తీసుకోవచ్చు.
  4. వ్యక్తిగతంగా టాప్​-అప్ పాలసీ తీసుకోవచ్చు. లేదా కుటుంబం అంతటికీ కలిపి ఫ్యామిలీ ఫ్లోటర్‌గా తీసుకోవచ్చు.
  5. ముందు నుంచే ఉన్న ఆరోగ్య సమస్యల(ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్)కు వెయిటింగ్ పీరియ‌డ్ ఉంటుంది. అందువల్ల పాల‌సీ తీసుకునే ముందే ఈ వెయిటింగ్ పీరియ‌డ్‌ గురించి తెలుసుకోవాలి.
  6. ఆసుపత్రిలో చేరిన ప్రతీసారి ఖర్చులు అవుతాయి. వీటిని విడివిడిగానే పరిగణిస్తారు. అంతేతప్ప వీటన్నింటినీ కలపరు. ఉదాహరణకు టాప్-అప్ కనీస పరిమితి రూ.5 లక్షలు ఉన్నట్టయితే ఒకసారికి రూ.4 లక్షలు ఖర్చు అయ్యి, ఆ తర్వాత మరోసారి రూ.2.5 లక్షలు ఖర్చు అయితే, ఈ రెండింటినీ కలిపి రూ. 6.5 లక్షలుగా పరిగణించరు. వీటిని విడివిడిగానే పరిగణిస్తారు.
  7. బీమా సంస్థ‌లు 'సూపర్ టాప్-అప్' పాలసీలను కూడా అందిస్తాయి. వీటిలో ఒక ఏడాదిలో విడివిడిగా అయిన వైద్యఖర్చులను కలిపి లెక్కించి, కనీస పరిమితి దాటిందా? లేదా? చూస్తారు. ఈ సూపర్ టాప్-అప్ పాలసీలకు ప్రీమియం కాస్త అధికంగా ఉంటుంది.
  8. సాధారణంగా ఈ టాప్-అప్ పాలసీలు తీసుకునేవారి వయస్సు 45 ఏళ్లు దాటితే, వారికి ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి కాదు. ఒకవేళ ఆరోగ్య పరీక్షలు చేయిస్తే, అందుకైన ఖర్చులో 50% వరకు బీమా కంపెనీలే చెల్లిస్తాయి.
  9. ఈ టాప్​-అప్​ పాలసీలను తీసుకుంటే, ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80డీ కింద‌ ప్రీమియం చెల్లింపుల‌పై పన్ను మినహాయింపు ల‌భిస్తుంది.

వీటిని గుర్తించుకోండి!

  • ఈ టాప్-అప్ పాలసీలను ఆరోగ్య బీమా పాలసీలకు ప్రత్యామ్నాయంగా చూడకూడదు. కేవలం తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా క‌వ‌రేజ్ పొందేందుకు ఉపయోగపడే సాధనాలుగా మాత్రమే పరిగణించాలి.
  • ఆరోగ్య బీమా పాలసీలు చిన్న మొత్తాలకు సైతం పరిహారం అందిస్తాయి. అయితే, ఈ టాప్-అప్ పాలసీల్లో కనీస పరిమితి దాటాక మాత్రమే బీమా అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందువ‌ల్ల స‌మ‌గ్ర బీమా పాల‌సీ తీసుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలి.
  • ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీకి టాప్-అప్ ఎంచుకుంటే, మనం ఎంచుకున్న పాలసీ కుటుంబంలో అందరికీ వర్తిస్తుందా? లేదా? అనేది చూసుకోవాలి. ఎందుకంటే, కొన్ని పాలసీలు తల్లిదండ్రులకు బీమా అందించవు.

క్యారీ బ్యాగ్​పై డబ్బులు వసూలు చేశారా? ఇలా చేస్తే పరిహారం గ్యారెంటీ!

ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డ్​ బెనిఫిట్స్​లో కోత - ఇకపై వారికి మాత్రమే లాంజ్‌ యాక్సెస్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.