ETV Bharat / business

Top 7 Safest Cars In India (Test Proven) : క్రాష్ టెస్టులో సూపర్ విక్టరీ.. 5 స్టార్‌ రేటింగ్ సాధించిన కార్లు ఇవే!

Top 7 Safest Cars In India : కారు ప్రయాణం ఎంత సౌఖ్యంగా సాగుతుందో.. తేడా వస్తే అంత ఘోరంగా జీవిత ప్రయాణమే ముగిసిపోగలదు! అందుకే.. ఇప్పుడు జనాలు సేఫ్టీ ఎక్కువ ఉన్న కార్లనే కొనుగోలు చేస్తున్నారు. మరి, ప్రస్తుతం ఇండియాలో అత్యధిక భద్రతా ప్రమాణాలు పాటించి, 5 స్టార్ రేటింగ్ సాధించిన కార్లు ఏవో మీకు తెలుసా..?

Top 7 Safest Cars In India
Top 7 Safest Cars In India
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2023, 3:39 PM IST

Top 7 Safest Cars In India : "కారు" సగటు మనిషికి అదొక చిరకాల కోరిక కోరికైతే.. సంపన్నులకు అదొక హోదా! అందుకే.. కారు అంటే ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టం. ఆయా వర్గాలకు తగ్గట్టే తయారీ సంస్థలు కూడా.. కార్లను తయారు చేస్తూ, వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అయితే.. ఇటీవల సేఫ్టీ ఎక్కువ ఉన్న కార్లకు ప్రాధాన్యం ఇచ్చేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. వీరిని దృష్టిలో పెట్టుకుని అత్యుత్తమమైన భద్రతా ఫీచర్లతో వాహనాలను తయారు చేస్తున్నాయి సంస్థలు.

మరి, కార్లలో ఏవి సురక్షితమైనవో తెలుసుకోవాలంటే.. Global New Car Assessment Programme (NCP) క్రాష్ టెస్టులో అర్హత సాధించినవాటిని ఎంచుకోవచ్చు. ఐక్యరాజ్యమితి (యూఎన్‌ఓ) నిర్దేశించిన భద్రతా ప్రమాణాలను అందుకున్న కార్లకు.. 5 స్టార్స్ రేటింగ్‌ ఇస్తోంది ఎన్‌సీఎపీ. తాజాగా మార్కెట్లోకి విడుదలైన వాహనాల్లో కొన్ని NCP రేటింగ్‌లో అత్యుత్తమ స్థాయిని అందుకున్నాయి. వాటిలో టాప్‌ -7లో కార్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలో అత్యంత సురక్షితమైన కార్లు.. (5 Star Rated Cars in India) :

1.టాటా కార్లు (TATA Cars) : NCAP నిర్వహించిన క్రాష్‌ టెస్ట్‌ ప్రకారం.. 2023లో భారతదేశంలో తయారు చేసిన అత్యంత సురక్షితమైన కార్లలో.. టాటా హారియర్, టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్‌ అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ కార్లు అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP), చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP) రెండింటిలోనూ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్స్​ పొందాయి. ఈ టాటా SUV కార్లు.. సేఫెస్ట్‌ కార్ల జాబితాలోని అన్ని ఇతర మోడళ్ల కంటే అత్యధిక స్కోర్‌ను కలిగి ఉన్నాయి. ఈ కార్లలో గరిష్ఠంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు ప్రామాణికంగా ఉన్నాయి. ఈ వేరియంట్లలో హిల్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లను కూడా ఉన్నాయి.

టాటా హారియర్ (TATA Harrier) ధర : రూ. 15.49 లక్షల నుంచి ప్రారంభం

టాటా సఫారీ (TATA Safari) ధర : రూ. 16.19 లక్షల నుంచి ప్రారంభం

Most Affordable Automatic Cars In 2023 : రూ.8 లక్షల బడ్జెట్లో.. మంచి ఆటోమేటిక్ కార్ కొనాలా?.. మార్కెట్​లోని బెస్ట్ ఆప్షన్స్​ ఇవే!

2. వోక్స్‌వ్యాగన్ వర్టస్ (Volkswagen Virtus) : వోక్స్‌వ్యాగన్ కంపెనీకి చెందిన వర్టస్ కారు రెండో స్థానంలో ఉంది. ఈ సెడాన్ అత్యంత సురక్షితంగా ఉందని తెలింది. AOP, COP రెండింటిలోనూ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ స్కోర్‌ చేసింది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ హోల్డ్ అసిస్ట్, 3-పాయింట్ సీట్‌బెల్ట్​, ప్రయాణికులందరికీ సీట్‌బెల్ట్ రిమైండర్, ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజెస్ ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ వర్టస్ (Volkswagen Virtus) ధర : రూ. 11.48 లక్షల నుంచి రూ. 19.29 లక్షల మధ్య ఉంది.

3. స్కోడా స్లావియా (Skoda Slavia) : భారతదేశంలో తయారు చేసిన అత్యంత సురక్షితమైన కార్లలో స్కోడా స్లావియా కూడా ఉంది. ఈ కారు కూడా AOP, COP రెండు విభాగాల్లోను 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, 3-పాయింట్ సీట్‌బెల్ట్​, ప్రయాణించే వారందరికీ సీట్‌బెల్ట్ రిమైండర్, ISOFIX చైల్డ్ సీట్ కూడా ఉన్నాయి.
స్కోడా స్లావియా (Skoda Slavia) ధర : రూ. 10.89 లక్షల నుంచి రూ. 19.12 లక్షల మధ్య ఉంది.

4. వోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun) : వోక్స్‌వ్యాగన్ టైగన్ SUV కూడా అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP), చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP) రెండింటిలోనూ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ స్కోర్‌ చేసింది. ఈ కారు సేఫ్టీ కిట్‌లో.. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), EBDతో కూడిన ABS, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, ప్రయాణీకులందరికీ సీట్‌బెల్ట్ రిమైండర్, ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజెస్ ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun) ధర : రూ. 11.62 లక్షల నుంచి రూ. 19.76 లక్షల మధ్య ఉంది.

5. స్కోడా కుషాక్ (Skoda Kushaq): భద్రతా ప్రమాణాల్లో స్కోడా కుషాక్ SUV టాప్-5లో నిలిచింది. ఈ కారు సైతం.. AOP, COP విభాగాల్లో 5 స్టార్ రేటింగ్‌ పొందింది. ఈ కారు రక్షణ విభాగాల్లో.. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), EBDతో కూడిన ABS, 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, ప్రయాణీకులందరికీ సీట్‌బెల్ట్ రిమైండర్, ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజెస్ ఉన్నాయి.

స్కోడా కుషాక్ ధర : రూ.10.89 లక్షల నుంచి రూ.20.01 లక్షల మధ్య ఉంది.

6. హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna) : గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో హ్యుందాయ్ వెర్నా 5 స్టార్ రేటింగ్ దక్కించుకుంది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP), చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP)లో.. పూర్తి Five Star సేఫ్టీ రేటింగ్‌ సాధించింది. దీనిలో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), EBDతో కూడిన ABS, ప్రయాణీకులందరికీ 3-పాయింట్ సీట్‌బెల్టులు ఉన్నాయి.

హ్యుందాయ్ వెర్నా (Hyundai Verna) ధర : రూ. 10.90 లక్షల నుంచి రూ. 17.38 లక్షల మధ్య ఉంటుంది.

Upcoming Electric Cars In India : సింగిల్​​ ఛార్జ్​తో 550 కి.మీ జర్నీ​​.. ఫీచర్స్​ అదుర్స్​! టాప్​ 5 అప్​కమింగ్​ ఈవీ కార్స్​ ఇవే

7. మహీంద్రా స్కార్పియో ఎన్ (Mahindra Scorpio n) : గ్లోబల్ NCAP నిర్వహించిన అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP) క్రాష్ టెస్ట్‌లో.. మహీంద్రా స్కార్పియో ఎన్​.. ఫైవ్​ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (COP) క్రాష్ టెస్ట్‌లో మాత్రం.. 3 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఈ SUVకి డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్​, హిల్ అసిస్ట్‌తో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, EBDతో కూడిన ABS, ISOFIX చైల్డ్ సీట్ ఎంకరేజ్‌లు ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో ఎన్ (Mahindra Scorpio n) ధర : రూ.13.26 లక్షల నుంచి రూ.24.54 లక్షల మధ్య ఉంది.

TATA Safari Harrier Facelift Price and Features : టాటా నుంచి సఫారీ, హారియర్ ఫేస్​లిఫ్ట్ కార్లు.. ధర, ఫీచర్స్ చూస్తారా..?

Best Cars Under 10 Lakhs : దసరాకు కారు కొనాలా?.. రూ.10 లక్షల బడ్జెట్లో బెస్ట్ కార్లు ఇవే!.. ఫీచర్స్​ అదుర్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.