Tata Punch CNG Launch in India : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్.. శుక్రవారం తన మైక్రో ఎస్యూవీ మోడల్ 'పంచ్ సీఎన్జీ' (Tata Punch CNG) వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.
ఈ టాటా పంచ్ సీఎన్జీ.. ప్యూర్, అడ్వెంచర్, అడ్వెంచర్ రిథమ్, అకంప్లిష్డ్, అకంప్లిష్డ్ డాజిల్ అనే 5 ట్రిమ్స్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ALFA ఆర్కిటెక్చర్‌ను ఆదర్శంగా తీసుకొని తయారు చేసిన టాటా పంచ్ సీఎన్జీకి.. 5 స్టార్ గ్లోబల్ ఎన్సీఏపీ అడల్ట్ సేఫ్టీ రేటింగ్ కూడా వచ్చింది.
టాటా పంచ్ స్పెసిఫికేషన్స్
Tata Punch CNG Specifications : టాటా మోటార్స్.. ఈ మైక్రో ఎస్యూవీ కారులో ట్విన్ సిలిండర్ టెక్నాలజీని పొందుపరిచింది. దీనిలో ఫ్యూయెల్ నింపే సమయంలో ఇంజిన్ కటాఫ్ అయ్యే విధంగా మైక్రో స్విచ్ ఫెసిలిటీ కల్పించింది. దీనితోపాటు థర్మల్ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్ అందిస్తున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించి గ్యాస్ లీకైతే.. ఈ థర్మల్ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్.. ఇంజిన్‌కు సీఎన్జీ సరఫరాను నిలిపివేస్తుంది. ఫలితంగా లీకైన గ్యాస్ గాల్లోకి వెళ్లిపోతుంది. కనుక తీవ్రమైన అగ్ని ప్రమాదం సంభవించకుండా ఈ టెక్నాలజీ కాపాడుతుందని టాటా మోటార్స్ చెబుతోంది.
టాటా పంచ్ ఫీచర్స్
Tata Punch CNG Features : టాటా పంచ్ సీఎన్జీలో ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అందిస్తున్నారు. దీనిని వాయిస్ కమాండ్‌తో కంట్రోల్ చేయవచ్చు. ఈ కారులో 7 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సపోర్ట్ ఉన్నాయి.
టాటా పంచ్ సీఎన్జీలో.. రైయిన్ సెన్సింగ్ వైపర్స్, అడ్జెస్టబుల్ డ్రైవర్ సీట్ ఉన్నాయి. అలాగే దీనిలో ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.
టాటా పంచ్ ఇంజిన్ స్పెక్స్
Tata Punch CNG Engine Specs : టాటా పంచ్‌లో 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 72 బీహెచ్పీ పవర్, 103 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
టాటా పంచ్ సీఎన్జీ ధర
Tata Punch CNG Price : టాటా పంచ్ సీఎన్జీ ప్రారంభ ధర దిల్లీలో రూ.7.10 లక్షలుగా (ఎక్స్‌షోరూం ధర) ఉంది. దీని హై-ఎండ్ వేరియంట్ ధర దిల్లీలో రూ.9.68 లక్షలు (ఎక్స్‌షోరూం ధర)గా ఉంది.
టాటా.. మోడల్స్!
Tata latest car models : టాటా పంచ్‌లో తీసుకొచ్చిన ట్విన్ సిలిండర్ టెక్నాలజీని.. టియాగో, టిగోర్ మోడల్ కార్లలోనూ వినియోగించినట్లు టాటా మోటార్స్ తెలిపింది. టియాగో సీఎన్జీ ధర రూ.6.55 లక్షల నుంచి రూ.8.1 లక్షలుగా ఉంది. టిగోర్ సీఎన్జీ ధర రూ.7.8 లక్షల నుంచి రూ.8.95 లక్షల మధ్య ఉంటుంది. వీటి వల్ల తమ కంపెనీ సీఎన్జీ లైనప్ మరింత బలోపేతం అవుతుందని టాటా కంపెనీ పాసింజర్ వెహికల్ మార్కెటింగ్ హెడ్ వినయ్పంత్ ఆశాభావం వ్యక్తం చేశారు.