Stock Markets Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలను నమోదు చేశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, టెక్నాలజీ, ఆర్థిక రంగాల షేర్ల వృద్ధితో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలతో గురువారం భారీ లాభాలతో ముగిశాయి. డాలర్‌తో రూపాయి విలువ పెరగడం, విదేశీ పెట్టుబడి సంస్థలు కొనుగోలుకు మొగ్గుచూపడం వల్ల రెండు దేశీయ స్టాక్ మార్కెట్లు 1శాతానికి పైగా లాభాలను నమోదు చేశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 1041 పాయింట్లు పెరిగి 56,857 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 287 పాయింట్ల లాభంతో 16,929 వద్ద సెషన్‌ను ముగించింది.
లాభనష్టాల్లో ఇవే..: బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, కొటాక్ మహీంద్ర, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. శ్రీ సిమెంట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా షేర్లు నష్టపోయాయి.
బలపడిన రూపాయి: అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే.. 14 పైసల లాభపడి రూ. 79.77 వద్ద స్థిరపడింది.
ఇవీ చదవండి: మహిళా సంపన్నురాలిగా రోష్ని నాడార్.. అపోలో నుంచి నలుగురు!
రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం.. మరోసారి 'ఫెడ్' వడ్డీ రేట్లు పెంపు