ETV Bharat / business

మార్కెట్లలో మళ్లీ జోష్​.. సెన్సెక్స్​ 900 ప్లస్​.. కారణాలు ఇవే.. - GLOBAL STOCK MARKETS

Stock Market Live Updates
Stock Market Live Updates
author img

By

Published : Jun 21, 2022, 10:15 AM IST

Updated : Jun 21, 2022, 12:59 PM IST

12:50 June 21

భారీ లాభాల్లో: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు ముందుకు పయనిస్తున్నాయి. సెన్సెక్స్​ ఏకంగా 950 పాయింట్లకుపైగా పెరిగి.. 52 వేల 560 ఎగువన కొనసాగుతోంది. నిఫ్టీ దాదాపు 300 పాయింట్ల లాభంతో.. 15 వేల 650 వద్ద ఉంది. లాభాలకు కారణాలను ఓసారి చూస్తే..

  • అంతర్జాతీయ సానుకూలతలకు తోడు.. విశ్లేషకుల సానుకూల వ్యాఖ్యానాల నేపథ్యంలో మార్కెట్లు ఇటీవలి వరుస పతనాల నుంచి బయటపడుతున్నట్లు తెలుస్తోంది.
  • కొద్ది రోజులుగా వరుస నష్టాల నేపథ్యంలో.. చాలా వరకు షేర్లు కనిష్ఠాలకు చేరాయి. తక్కువ ధరల వద్ద షేర్ల కొనుగోలుకు మదుపరులు మొగ్గుచూపుతున్నారు.
  • ఆసియా, ఐరోపా మార్కెట్లు మంచి లాభాలను నమోదు చేయడం దేశీయ సూచీలపైనా ప్రభావం చూపిస్తోంది.
  • ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్​ ధరలు కొద్దిరోజులుగా భారీగా తగ్గుతుండటం బుల్లిష్​ మార్కెట్​కు మరో ప్రధాన కారణమని వ్యాపార నిపుణులు విశ్లేషిస్తున్నారు.

10:07 June 21

మార్కెట్లలో మళ్లీ జోష్​.. సెన్సెక్స్​ 900 ప్లస్​.. కారణాలు ఇవే..

Stock Market Live Updates: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు.. మంగళవారం సెషన్​లో జోరుమీదున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 650 పాయింట్లకుపైగా పెరిగి.. 52 వేల 250 ఎగువన ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 200 పాయింట్లకుపైగా లాభంతో 15 వేల 560 ఎగువన కొనసాగుతోంది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూలతలతో లాభాలు నమోదుచేస్తున్నట్లు వ్యాపార నిపుణులు చెబుతున్నారు.

సెన్సెక్స్​ 30 ప్యాక్​లో అన్నీ లాభాల్లోనే ఉన్నాయి. టైటాన్​ కంపెనీ 5 శాతానికిపైగా పెరిగింది. టాటా మోటార్స్​, జేఎస్​డబ్ల్యూ స్టీల్​, అదానీ పోర్ట్స్​, హిందాల్కో రాణిస్తున్నాయి. గత సెషన్​లోనూ స్టాక్​ మార్కెట్లు లాభాలు నమోదుచేశాయి. సెన్సెక్స్​ 237 పాయింట్లు పెరిగింది. నిప్టీ 57 పాయింట్లు లాభపడింది.

Last Updated : Jun 21, 2022, 12:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.