ETV Bharat / business

కాయిన్స్​తో కోట్ల మోసం, స్టేట్​ బ్యాంక్​లో భారీ స్కామ్​, రంగంలోకి సీబీఐ - sbi scam case

భారతీయ స్టేట్​ బ్యాంక్​లో నాణేలు మాయమైన వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టింది. వేర్వేరు రాష్ట్రాల్లో 25 చోట్ల సోదాలు జరిపింది.

sbi coins scam
కాయిన్స్​తో కోట్ల మోసం, స్టేట్​ బ్యాంక్​లో భారీ స్కామ్​, రంగంలోకి సీబీఐ
author img

By

Published : Aug 18, 2022, 6:16 PM IST

Updated : Aug 18, 2022, 6:26 PM IST

SBI coins scam : భారతీయ స్టేట్​ బ్యాంక్​లో 'కాయిన్స్​ స్కామ్​'పై దర్యాప్తు చేపడుతోంది సీబీఐ. వేర్వేరు రాష్ట్రాల్లోని 25 చోట్ల గురువారం విస్తృత సోదాలు నిర్వహించింది.
రాజస్థాన్​ కరౌలీలోని స్టేట్​ బ్యాంక్​ బ్రాంచ్​కు చెందిన వాల్ట్​ల నుంచి రూ.11కోట్లు విలువైన నాణేలు మాయమయ్యాయి. నగదు లెక్కల్లో తేడాలు ఉన్నాయన్న అనుమానంతో విచారణ చేపట్టగా 2021 ఆగస్టులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రూ.2కోట్లు విలువైన 3వేల కాయిన్ బ్యాగ్స్​ మాత్రమే వాల్ట్​లలో ఉండగా.. మిగిలినవన్నీ మాయమయ్యాయి. తర్వాత ఈ వ్యవహారం రాజస్థాన్​ హైకోర్టుకు చేరింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఈ ఏడాది ఏప్రల్​ 13న సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది.

ఇప్పటివరకు లభించిన ఆధారాలను ఆసరాగా చేసుకుని గురువారం ఒక్కసారిగా మెరుపు దాడులు చేపట్టింది సీబీఐ. దిల్లీ, జైపుర్, దౌసా, కరౌరీ, సవాయ్ మాధోపుర్, ఆళ్వార్, ఉదయ్​పుర్​, భీల్వాడాలో స్టేట్ బ్యాంక్ మాజీ అధికారులు, మరికొందరికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరిపింది.

Last Updated : Aug 18, 2022, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.