ETV Bharat / business

మహిళా సంపన్నురాలిగా రోష్ని నాడార్​.. అపోలో నుంచి నలుగురు! - మహిళా సంపన్నులు

Richest Women in India: దేశంలో అత్యంత సంపన్న మహిళల జాబితాను కోటక్‌ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌-హురున్‌ సంస్థ విడుదల చేసింది. ఆ జాబితాలో హెచ్​సీఎల్ టెక్నాలజీస్ ఛైర్​పర్సన్ రోష్ని నాడార్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. పదేళ్ల కిందట నైకా బ్రాండ్‌ను ప్రారంభించిన ఫల్గుణి నాయర్‌ సొంతంగా ఎదిగిన మహిళల్లో అగ్రపీఠాన్ని అధిరోహించారు. హైదరాబాద్‌కు చెందిన దివీస్‌ లేబొరేటరీస్‌ శాశ్వత డైరెక్టర్‌ నీలిమ ప్రసాద్‌ నాలుగో స్థానంలో నిలిచారు. టాప్-100లో అపోలో నుంచి నలుగురు మహిళలు ఉన్నారు.

richest Indian woman
అత్యంత సంపన్న మహిళలు
author img

By

Published : Jul 28, 2022, 10:51 AM IST

Richest Women in India: దేశంలో అత్యంత సంపన్న మహిళగా హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఛైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌ మల్హోత్రా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. 2021లో ఆమె నికర సంపద 54 శాతం పెరిగి రూ.84,330 కోట్లకు చేరుకుందని కోటక్‌ ప్రైవేట్‌ బ్యాంకింగ్‌-హురున్‌ విడుదల చేసిన జాబితా తెలిపింది. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ వృత్తిజీవితాన్ని వదులుకుని, పదేళ్ల కిందట నైకా బ్రాండ్‌ను ప్రారంభించిన ఫల్గుణి నాయర్‌ సొంతంగా ఎదిగిన మహిళల్లో అగ్రపీఠాన్ని అధిరోహించారు. ఒక్క ఏడాదిలో నాయర్‌(59) సంపద ఏకంగా 963 శాతం పెరిగి రూ.57,520 కోట్లకు చేరుకుంది. మహిళా సంపన్నుల మొత్తం జాబితాలో రెండో స్థానం ఈమెదే. 'బయోకాన్‌' కిరణ్‌ మజుందార్‌ షా నికర సంపద 21 శాతం తగ్గి రూ.29,030 కోట్లకు చేరుకోవడంతో ఒక స్థానం తగ్గి మూడో ర్యాంకుకు పరిమితం అయ్యారు. నాలుగో స్థానంలో హైదరాబాద్‌కు చెందిన దివీస్‌ లేబొరేటరీస్‌ శాశ్వత డైరెక్టర్‌ (కమర్షియల్‌) నీలిమ ప్రసాద్‌(రూ.28,180 కోట్లు) నిలిచారు.

  • భారత్‌లో పుట్టి లేదా పెరిగిన 100 మంది మహిళా సంపన్నులతో ఈ జాబితా సిద్ధం చేశారు. వీరి మొత్తం సంపద 2020లో రూ.2.72 లక్షల కోట్లు ఉండగా.. 2021 నాటికి 53 శాతం వృద్ధితో రూ.4.16 లక్షల కోట్లకు చేరుకుంది. భారత జీడీపీలో ఇది 2 శాతానికి సమానం.
  • జాబితా టాప్‌-100లో చేరడానికి కనీస సంపద పరిమితి రూ.100 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పెరిగింది. అగ్రగామి-10 మందిలో చేరేందుకు, పరిమితి 10 శాతం పెరిగి రూ.6620 కోట్లకు చేరుకుంది.
  • దిల్లీ ఎన్‌సీఆర్‌ నుంచి అత్యధికంగా 25 మంది సంపన్నురాళ్లు జాబితాలో చోటు చేసుకోగా.. ముంబయి(21), హైదరాబాద్‌(12)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అపోలో హాస్పిటల్స్‌ నుంచే నలుగురు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
  • తొలి 100 మందిలో ఔషధ రంగం నుంచి 12 మంది; ఆరోగ్య సంరక్షణ విభాగంలో 11 మంది; వినియోగదారు వస్తువుల రంగం నుంచి 11 మంది ఉన్నారు.

.
.

ఇవీ చదవండి: 'ఏదేమైనా పెట్టుబడుల్లో తగ్గేదేలే.. త్వరలోనే విదేశాల్లో కూడా'

BSNLకు భారీ ప్యాకేజీ.. ఆదుకునేందుకు కేంద్రం నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.