Retirement Planning : ఎన్నో సంవత్సరాల పాటు నిరంతరంగా పని చేసిన చాలా మంది ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా జీవితం గడపాలని అనుకుంటారు. అయితే రిటైర్మెంట్ తర్వాత ఆదాయం ఎలా అనే దానిపై కొంతమందికి బెంగగా ఉంటుంది. రిటైర్మెంట్ సమయంలో కొన్ని పనులు చేస్తే రిటైర్ అయ్యాక నెలకు రూ.50వేల వరకు సంపాదించడానికి అవకాశం ఉంటుంది.
Best Pension Schemes In India : నెలకు రూ.50వేల వరకు ఆదాయం రావాలంటే అందుకు తగ్గట్టుగా పెట్టుబడి, రిస్కు కూడా ఉంటుందని గమనించాలి. రిటైర్మెంట్ సమయంలో వచ్చే ఆదాయంలో నెలకు కొంత మొత్తాన్ని సరైన పద్ధతిలో పెట్టుబడిగా పెడితే, ఆ పెట్టుబడి మనకు తిరిగి ఆదాయాన్ని సమకూరుస్తుంది. మరి ఇలా ఆదాయాన్ని ఇచ్చే మార్గాలు ఏంటో చూద్దాం.
నెలకు రూ.50వేల వరకు ఆదాయాన్ని సమకూర్చే మార్గాల్లో మొదటిది నేషనల్ పెన్షన్ స్కీమ్. ఇది భారత ప్రభుత్వానికి సంబంధించినది కనుక ఎవరైనా దీనిలో నిర్భయంగా పెట్టుబడి పెట్టవచ్చు. ఇక రెండోది మ్యూచువల్ ఫండ్స్. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందే మార్గాల్లో మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. కాగా ఇందులో రిస్క్ కూడా ఉంటుంది. సమయానికి తగ్గట్టుగా, క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టుకుంటూపోతే మంచి ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మరో మార్గం అన్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు. ఈ మార్గాల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం.
నేషనల్ పెన్షన్ స్కీమ్ లేదా ఎన్పీఎస్ (NPS):
NPS Investment Benefits : నేషనల్ పెన్షన్ స్కీమ్ లేదా ఎన్పీఎస్ అనేది ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత వారికి ఆర్థిక భద్రత కల్పించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన పెన్షన్ కార్యక్రమం. ఇందులో చేరిన వారికి క్రమం తప్పకుండా ఖచ్చితమైన రాబడి వస్తుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. పైగా ఇది భారత ప్రభుత్వ కార్యక్రమం కనుక ఎలాంటి అనుమానాలు కూడా అక్కర్లేదు.
అన్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు (ULIP):
ULIP Investment Benefits : మీరు పెట్టుబడిగా పెట్టే మీ డబ్బులను పెట్టుబడి కాలం ముగిసిన తర్వాత ఆదాయంగా మీకు ఇస్తారు. ఇందులో మీ డబ్బును ఈక్విటీలు మరియు డెట్ ఫండ్స్‌లలో ఉంచుతారు. దీని వల్ల మీకు ఎక్కువ రాబడులు రావడానికి అవకాశం ఉంటుంది. పైగా మీకు జీవిత బీమా సౌకర్యం కూడా ఉంటుంది. అంటే మీరు పెట్టిన పెట్టుబడి మీద ఆదాయం రావడంతో పాటు మీ జీవితానికి భద్రత కూడా ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్స్ :
Mutual Fund Investment Benefits : ఎక్కువ ఆదాయాన్ని రాబట్టాలని అనుకునే వాళ్లకు కాస్త రిస్క్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అనేవి మంచి ఎంపిక. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే వాళ్లకు రిస్క్ ఉన్నా మంచి లాభాలు వస్తాయి. అయితే రిటైర్మెంట్ తర్వాత మంచి ఆదాయం కోసం చూసే వాళ్లు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్‌ని ఉపయోగించడం ఉత్తమమైన పద్ధతి.