ETV Bharat / business

Post Office Monthly Income Scheme Details : ఒక్కసారి ఈ పోస్టాఫీస్ స్కీంలో పెట్టుబడితో.. నెలనెలా చేతికి డబ్బులు! - పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం

Post Office Monthly Income Scheme Details : దేశంలో పేద, మధ్య తరగతి ప్రజలలో పొదుపు అలవాటు పెంచేందుకు భారతీయ తపాలా శాఖ వివిధ పథకాలను ప్రవేశపెడుతుంటుంది. ముఖ్యంగా ఎటువంటి రిస్క్‌ లేకుండా తమ డబ్బులను భద్రంగా దాచుకోవాలనుకునే వారి కోసం తపాలా శాఖ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ఏంటీ ? దీనిలో ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు ? పెట్టుబడి ఎంత వరకు ఉంటుంది ? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Post Office Monthly Income Scheme Details
Post Office
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 24, 2023, 12:50 PM IST

Post Office Monthly Income Scheme Details : సంపాదించే ప్రతి ఒక్కరూ తమ డబ్బులను సురక్షితంగా పెట్టుబడి పెట్టాలనుకుంటారు. ఇందుకోసం ఎక్కువ మంది భారతీయ తపాలా శాఖలో పెట్టుబడి పెడుతుంటారు. ఖాతాదారుల ఆలోచన, పెట్టుబడి సామర్థ్యం దృష్టిలోకి తీసుకొని పోస్టాఫీసు కూడా మంచి పథకాలను ప్రవేశపెడుతూ ఉంటుంది. ఒక్కసారి పెట్టుబడి పెట్టి.. నెలనెలా మంచి ఆదాయం పొందాలనుకుంటున్నారా ? అయితే ఈ స్టోరీ మీ కోసమే. పోస్ట్‌ ఆఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా నెల నెల మంచి ఆదాయం పొందటం ఎలాగో ఇప్పుడు తెలసుకుందాం.

Post Office Monthly Income Scheme : సురక్షితంగా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పోస్ట్‌ ఆఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌(POMIS) మంచి ఎంపిక. ఈ స్కీమ్‌లో చేరిన వారు ఐదు సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టి ప్రతి నెల వడ్డీ రూపంలో ఆదాయం పొందవచ్చు. ఈ స్కీమ్‌లో సింగిల్‌, జాయింట్‌ ఖాతాలను తెరవవచ్చు. దీని కోసం రూ.1,000లతో సేవింగ్‌ ఖాతాను తెరవాలి. సింగిల్‌ ఖాతాలో గరిష్ఠంగా రూ.4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అదే ఉమ్మడి ఖాతా అయితే రూ.9 లక్షల వరకు జమ చేయవచ్చు. ఈ స్కీమ్‌లో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉమ్మడి ఖాతాలో ముగ్గురు పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టిన పెట్టుబడిపై ఖాతాదారులందరికీ సమానమైన వాటాను తపాలా శాఖ అందిస్తుంది.

Kisan Vikas Patra : ఈ పోస్ట్ ఆఫీస్​ స్కీమ్​లో ఇన్వెస్ట్ చేస్తే.. మీ డబ్బులు డబుల్​!

Post Office Monthly Income Scheme 2023 : అంతేకాదు.. మీరు ఎప్పుడైనా ఉమ్మడి ఖాతాను సింగిల్‌ ఖాతాగా మార్చుకునేందుకు కూడా వీలవుతుంది. అలాగే.. సింగిల్‌ ఖాతాను ఉమ్మడి ఖాతాగా కూడా మార్చుకోవచ్చు. ఖాతాలో ఎలాంటి మార్పులను చేయడానికైనా సభ్యులందరూ దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ తరవాత పెట్టుబడిని మరో ఐదు సంవత్సరాలు పొడిగించుకోవచ్చు. ఖాతాదారులు తమ అకౌంట్‌కు నామినీ వివరాలు అందించవచ్చు.

పోస్టాఫీసు ఇండియా వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ స్కీమ్‌ ద్వారా వార్షికంగా 6.6% వడ్డీని ప్రతి నెలా పొందుతారు. మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో భారతీయ పౌరులెవరైనా పెట్టుబడి పెట్టవచ్చు.

తపాలా శాఖ అందించే ఈ స్కీమ్ మెచ్యూరిటీ ఐదు సంవత్సరాలు. అనుకోని కారణాల వల్ల ఖాతాదారులు స్కీమ్‌ను మూసివేయాలనుకుంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి.

  • ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన సంవత్సరం తరవాత మాత్రమే పెట్టుబడిదారు డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.
  • సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల మధ్య డబ్బును విత్‌డ్రా చేస్తే డిపాజిట్‌ చేసిన నగదు నుంచి 2 శాతం తీసివేసిన తరవాత మిగిలిన మొత్తం రీఫండ్‌ చేస్తారు.
  • అదే మీరు ఖాతా తెరిచిన 3 సంవత్సరాల తరవాత మెచ్యూరిటీకి ముందు డబ్బును విత్‌డ్రా ఒక శాతం నగదును తీసివేసి మిగతాది ఇస్తారు. మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌ (MIS) ఖాతాను ఎలా తెరవాలి?
  • మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో నమోదు కావడానికి మీకు పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా ఉండాలి.
  • ఇందుకోసం ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్‌లలో ఏదో ఒకటి రుజువుగా అందించాల్సి ఉంటుంది.
  • 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు.
  • అడ్రస్ ఫ్రూఫ్ కోసం ప్రభుత్వం జారీ చేసిన ఐడీ కార్డ్ లేదా యుటిలిటీ బిల్లు అందించాలి.
  • ఈ పత్రాలను తీసుకెళ్లి మీ సమీపంలోని పోస్ట్‌ ఆఫీసులో మంత్లీ ఇన్‌కమ్‌ అకౌంట్‌ స్కీమ్‌ అకౌంట్‌ను తెరవండి.
  • ఫారమ్‌ను నింపే సమయంలో నామినీ పేరు తప్పక రాయండి.
  • సేవింగ్స్‌ ఖాతా తెరిచేందుకు ప్రారంభంలో రూ. 1,000లను నగదు లేదా చెక్కు ద్వారా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

Best Post Office Insurance Schemes : 299 రూపాయలకే.. రూ.10లక్షల జీవిత బీమా!

Post Office Schemes Interest Rates : పోస్టాఫీస్​ పథకాల్లో మదుపు చేస్తున్నారా?.. లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.