ETV Bharat / business

Paytm Card Soundbox Launch : పేటీఎంలో ఇక కార్డ్​ పేమెంట్స్​కు ఛాన్స్.. కొత్త 'సౌండ్​బాక్స్' లాంఛ్​​​! - మేడిన్ ఇండియా పేటీఎం సౌండ్ బాక్స్​

Paytm Card Soundbox Launch In Telugu : ప్రముఖ పేమెంట్స్ యాప్​ పేటీఎం.. సరికొత్త కార్డ్​ సౌండ్​బాక్స్​ను ఆవిష్కరించింది. దీనితో అన్ని వీసా, మాస్టర్​ కార్డ్​, అమెరికన్​ ఎక్స్​ప్రెస్​, రూపే కార్డులను ఉపయోగించి సులువుగా నగదు లావాదేవీలు చేసుకోవడానికి వీలవుతుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Paytm Card Soundbox features
Paytm Card Soundbox Launch
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 5:09 PM IST

Updated : Sep 4, 2023, 5:50 PM IST

Paytm Card Soundbox Launch : పేటీఎం బ్రాండ్​ కంపెనీ One97 కమ్యూనికేషన్స్ సెప్టెంబర్​ 4న సరికొత్త కార్డ్​ సౌండ్​బాక్స్​ను ఆవిష్కరించింది. దీని ద్వారా అన్ని వీసా, మాస్టర్​ కార్డ్​, అమెరికన్​ ఎక్స్​ప్రెస్​, రూపే కార్డులతో.. సులువుగా నగదు చెల్లింపులు చేసుకోవడానికి వీలవుతుంది. దీనితో పాటు మొబైల్​ చెల్లింపులు కూడా యథావిధిగా చేసుకోవడానికి వీలు ఉంటుంది.

యూపీఐ పాపులారిటీ
UPI Payment Sound Box : భారతదేశంలో నేడు యూపీఐ చెల్లింపులు బాగా విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ చాలా సులువుగా యూపీఐ ద్వారా రిటైల్ డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. అందుకే దీనిని మరింత ముందుకు తీసుకుపోవడానికి పేటీఎం సరికొత్త సౌండ్​బాక్స్​ను ఆవిష్కరించింది.

కార్డ్ బేస్డ్​ పేమెంట్స్!
Paytm Card Soundbox Payments : ఇప్పటి వరకు చిరువ్యాపారులు.. మొబైల్ ఫోన్​ ద్వారా చేసే యూపీఐ పేమెంట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు. కానీ పేటీఎం తీసుకొచ్చిన ఈ లేటెస్ట్​ సౌండ్​బాక్స్​తో.. కార్డ్​ పేమెంట్స్​ కూడా పొందడానికి వీలవుతుంది. ముఖ్యంగా వినియోగదారులు 'టాప్​ అండ్ పే' విధానం ద్వారా తమ కార్డును ఉపయోగించి చాలా సులువుగా నగదు చెల్లించడానికి వీలవుతుంది. ఇది వ్యాపారులకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది.

ఆడియో అలర్ట్​
Paytm Card Based Sound Box Audio Alert : పేటీఎం సౌండ్​బాక్స్ ద్వారా కార్డ్ లేదా మొబైల్​​ ఉపయోగించి నగదు చెల్లింపులు చేసినప్పుడు.. వెంటనే ఆ విషయం ఆడియో ద్వారా వినబడుతుంది. దీనితో నగదు చెల్లింపు జరిగిందా? లేదా? అని డివైజ్​లో చెక్​ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వాస్తవానికి 2019లోనే పేటీఎం.. ఆడియో బేస్డ్​ పేమెంట్ కన్ఫర్మేషన్​ సౌండ్​ బాక్స్​ను తీసుకొచ్చింది. భారతదేశంలో ఈ విధానం తీసుకొచ్చిన తొలి కంపెనీ పేటీఎం. తరువాత మిగతా కంపెనీలు దీనిని అనుసరించాయి.

గరిష్ఠంగా రూ.5000 వరకు చెల్లింపు!
Paytm Sound Box Card Payment Limit : పేటీఎం తీసుకొచ్చిన ఈ నయా సౌండ్​బాక్స్​ ద్వారా.. గరిష్ఠంగా రూ.5000 వరకు కార్డ్ పేమెంట్స్ చేయవచ్చు. కస్టమర్ దగ్గర ఉన్న ఏటీఎం కార్డ్​ను కేవలం సౌండ్​బాక్స్​ ముందు ఉంచగానే.. పేమెంట్​ షురూ అయిపోతుంది. పేమెంట్ జరిగిన వెంటనే ఆడియో కన్ఫర్మేషన్​, ఎల్​సీడీ డిస్​ప్లేలో విజువల్ కన్ఫర్మేషన్ వస్తుంది.

మేడ్ ఇన్​ ఇండియా!
Made In India Payment Sound Box : భారతదేశంలో తయారు చేసిన ఈ సౌండ్​బాక్స్​.. 4జీ నెట్​వర్క్ కనెక్టివిటీతో పనిచేస్తుంది. దీనిలో 4W​ స్పీకర్​ ఉంటుంది. దీని బ్యాటరీ లైఫ్​ 5 రోజులు ఉంటుంది.

11 భాషల్లో!
Paytm Sound Box Support Languages : పేటీఎం న్యూ సౌండ్​బాక్స్​ 11 భాషలను సపోర్ట్ చేస్తుంది. ఇది వ్యాపారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. వ్యాపారులు 'పేటీఎం ఫర్ బిజినెస్'​ అనే యాప్​ను డౌన్​లోడ్​ చేసుకుని ఈ ఫీచర్​ను ఉపయోగించుకోవచ్చు.

NFC స్మార్ట్​ఫోన్స్​తో కూడా!
Paytm Sound Box Mobile Payments : ఎన్​ఎఫ్​సీ ఎనేబుల్డ్​ స్మార్ట్​ఫోన్​ యూజర్లు కూడా.. పేటీఎం సౌండ్​బాక్స్ ద్వారా పేమెంట్స్​ చేయవచ్చు. సింపుల్​గా పేటీఎం క్యూఆర్​ కోడ్​ను స్కాన్​ చేయడం ద్వారా వారు తమ పేమెంట్స్​ను పూర్తి చేయవచ్చు.

Last Updated : Sep 4, 2023, 5:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.