ETV Bharat / business

ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్​​.. 33 గంటలకు 10 లక్షల మంది నిరుపేదలు! - దావోస్​ 2022

Oxfam davos report 2022: కరోనా సమయంలో ప్రతి 30 గంటలకు ఒక కొత్త బిలియనీర్​​ అవతరిస్తున్నారని ఆక్స్​ఫామ్​ నివేదిక తెలిపింది. మరోవైపు ప్రతి 33 గంటలకు 10 లక్షల మంది దారిద్ర్య రేఖ దిగువకు పడిపోతున్నట్లు పేర్కొంది. దావోస్​లో జరుగుతున్న వరల్డ్​ ఎకనమిక్​ ఫోరమ్​లో ఆక్స్​ఫామ్​ ఈ నివేదికను బయటపెట్టింది.

oxfam davos report 2022
oxfam davos report 2022
author img

By

Published : May 23, 2022, 12:32 PM IST

Oxfam davos report 2022: దావోస్​లో జరుగుతున్న వరల్డ్​ ఎకనమిక్​ ఫోరమ్​లో ఆక్స్​ఫామ్​ ఆసక్తికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. కొవిడ్​ 19 సమయంలో ప్రతి 30 గంటలకు ఒకరు బిలియనీర్​​గా మారుతున్నారని పేర్కొంది. అదే సమయంలో ప్రతి 33 గంటలకు 10 లక్షల మంది దారిద్ర్యంలోకి వెళుతున్నట్లు నివేదిక తెలిపింది. 'ప్రాఫిటింగ్​ ఫ్రమ్​ పెయిన్​' అనే శీర్షికతో నివేదికను ప్రచురించింది. కరోనా కాలంలో నిత్యావసర సరకుల ధరలు దశాబ్దంలోనే అత్యధిక స్థాయికి చేరుకుందన్నారు. ఆహారం, ఇంధన రంగాల్లోని బిలియనీర్లు తమ సంపదను ప్రతి రెండు రోజులకు ఒక బిలియన్ డాలర్లు పెంచుకున్నట్లు తెలిపింది. కరోనాతో వాయిదా పడిన దావోస్​ సమావేశం రెండేళ్ల తర్వాత తిరిగి ఆరంభమైంది.

ఆక్స్​ఫామ్​ నివేదిక ప్రకారం.. కరోనా కాలంలో 573 మంది బిలియనీర్ల జాబితాలో చేరారని తెలిపింది. కొవిడ్​ తొలి 24 నెలల్లో వీరి సంపద 23 సంవత్సరాల గరిష్ఠానికి చేరింది. ప్రపంచంలోని బిలియనీర్ల సంపద 2000లో 4.4 శాతం ఉండగా.. ప్రస్తుతం 13.9శాతం జీడీపీకి చేరుకుంది. ఈ నివేదిక ప్రకారం ఇంధన రంగ సంస్థలైన బీపీ, షేల్​, టోటల్​ ఎనర్జీస్​, ఎక్సాన్​, చెవ్రోన్​లు ప్రతి సెకన్​కు 2,600 డాలర్ల లాభాన్ని పొందారు. ఆహార రంగంలో 62 మంది బిలియనీర్లు​ కొత్తగా తయారయ్యారు.

మరోవైపు మధ్యతరగతి, పేద ప్రజలు సైతం దారిద్ర్య రేఖకు దిగువకు పడిపోతున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రతి 33 గంటలకు పది లక్షల మంది దారిద్ర్య రేఖకు దిగువకు పడిపోతున్నారని.. దీని ప్రకారం ఈ ఏడాది 26.3 కోట్ల మంది పేదలుగా మారుతారని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం పడిపోతున్న నేపథ్యంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని.. దీంతో పేదల జీవితాలు మరింత దయనీయంగా మారినట్లు తెలిపింది. పేద దేశాల్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలు.. సంపన్న దేశాల్లోని ప్రజల కన్నా రెండు శాతం అధికంగా ఆహారానికి ఖర్చు చేస్తున్నారని స్పష్టం చేసింది. సంపన్నుడు ఒక సంవత్సర సంపాదనను చేరుకోవడానికి.. దిగువ మధ్యతరగతి ప్రజలు 112 సంవత్సరాలు కష్టపడాలని నివేదిక తెలిపింది.

ఇదీ చదవండి: భారత్​పై దృష్టి సారించిన యాపిల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.