ETV Bharat / business

వాహన బీమా పాలసీలో కొత్త టెక్నాలజీ.. తక్కువ ప్రీమియంతోనే.. - పీఏవైసీ విధానంలో టెలిమాటిక్స్‌

'అందరికీ ఒకే పాలసీ' అనేది ఒకప్పటి మాట. పాలసీదారుల విస్తృత అవసరాలను దృష్టిలో పెట్టుకొని, వారికోసం ప్రత్యేకంగా పాలసీలను అందించడానికి ఇప్పుడు సాధారణ బీమా సంస్థలు పోటీ పడుతున్నాయి. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా.. తమ వినియోగదారులకు పాలసీలను అందించేందుకు కృషి చేస్తున్నాయి. మెరుగైన ఉత్పత్తులు, సేవలను అందించేందుకు ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగిస్తున్నాయి.

motor insurance
మోటారు వాహన బీమా
author img

By

Published : Sep 27, 2022, 5:43 PM IST

పాలసీదారులు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అదే సమయంలో తమపై సాధ్యమైనంత మేరకు తక్కువ భారం ఉండాలని అనుకుంటున్నారు. దీంతో బీమా సంస్థలూ అందుకు తగ్గట్టుగా పాలసీలను ఆవిష్కరిస్తున్నాయి. ఇటీవల కాలంలో మోటారు వాహన బీమా విషయంలో వచ్చిన విప్లవాత్మక మార్పుగా 'వినియోగించిన మేరకే చెల్లించండి' (పీఏవైసీ)ని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ విధానం అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో విస్తృతంగా వినియోగంలో ఉంది. మన దేశంలో భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఇటీవలే ఈ తరహా పాలసీలకు అనుమతినిచ్చింది.

పీఏవైసీ అనేది మీ పూర్తిస్థాయి మోటారు బీమా పాలసీలో సొంత డ్యామేజీ విభాగం కింద వచ్చే ఒక యాడ్‌-ఆన్‌ కవర్‌. ఇది పాలసీదారుడు తన వాహనం వినియోగం ఆధారంగా కవరేజీని ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తుంది. ఎంత దూరం ప్రయాణిస్తారు, ఎంచుకున్న కవరేజీ ఆధారంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. బీమా సంస్థ అందించే వివిధ శ్లాబుల నుంచి దీన్ని ఎంచుకోవచ్చు. ఇవి బీమా సంస్థలను బట్టి మారుతూ ఉంటాయి.

ముందుగా నిర్ణయించుకున్న వినియోగ పరిమితిని మించిపోతే ఎలా? అనే సందేహం అవసరం లేదు. ఈ సమయంలో మీరు మరో అదనపు శ్లాబుకు మారి, పాలసీని టాపప్‌ చేయడం ద్వారా బీమా రక్షణను కొనసాగించుకోవచ్చు. సాధారణంగా వాహన బీమా ప్రీమియం కారు మోడల్‌, వయసును బట్టి నిర్ణయిస్తారు. పీఏవైసీలో వీటితోపాటు, ఎంత దూరం ప్రయాణిస్తారు అనేదాన్నీ చూసి, ప్రీమియం నిర్ణయిస్తారు. మీ వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టుగా పాలసీని రూపొందించుకోవడానికి ఇది మీకు తోడ్పడుతుందని చెప్పొచ్చు.

సాంకేతికతతో..
పీఏవైసీ విధానంలో టెలిమాటిక్స్‌ అనే పరికరం ఎంతో కీలకంగా ఉంటుంది. బీమాదారుల వాహనంలో ఈ పరికరాన్ని అమరుస్తారు. ఇది కారు తిరిగిన దూరాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. మిగిలిన దూరాన్నీ తెలియజేస్తుంది. ఇటువంటి పరికరాలు డ్రైవరు పరివర్తననూ గమనిస్తూ ఉంటాయి. వేగం, విరామాలు, డ్రైవింగ్‌ సమాచారాన్ని సేకరించేందుకు, విశ్లేషించేందుకు బీమా సంస్థలు ప్రత్యేక యాప్‌లనూ వినియోగిస్తుంటాయి. మంచి డ్రైవింగ్‌ ప్రవర్తన ఉన్నవారికి ప్రీమియంలో రాయితీలనూ అందిస్తాయి.

ఎవరికి అనుకూలం..
'వినియోగించిన మేరకే చెల్లించండి' (పీఏవైసీ) రైడర్‌ వాహనాలను ఎప్పుడో ఒకసారి దూర ప్రయాణాలకు వినియోగించే వారికి అనుకూలంగా చెప్పొచ్చు. ఒకటికంటే ఎక్కువ వాహనాలు ఉన్నవారూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. సొంత వాహనాన్ని తక్కువగా వినియోగించే వారూ ఈ తరహా పాలసీని పరిశీలించవచ్చు. మీరు వాహనాన్ని ఎలా వినియోగిస్తారు అనే అంశాలను ఒకసారి విశ్లేషించుకోండి. ఆ తర్వాతే ఈ కొత్త రైడర్‌ను ఎంచుకునేందుకు ప్రయత్నించండి.

- ఆదిత్య శర్మ, చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌, బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌

ఇవీ చదవండి: 2023లోనూ డబుల్ ధమాకా.. సాలరీలు ఎంత పెరుగుతాయంటే..

రెంట్​కు బాయ్​ఫ్రెండ్​.. స్టార్టప్​ బంపర్​ ఆఫర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.