Mukesh Ambani salary per annum : దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వరుసగా రెండో ఏడాది ఎలాంటి వేతనమూ తీసుకోలేదు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అంబానీ వేతనం 'సున్నా' అని వార్షిక నివేదికలో పేర్కొంది రిలయన్స్. 2021-22లోనూ ఆయన అదే పంథాను కొనసాగించినట్లు తెలిసింది. ఈ రెండేళ్లు.. రిలయన్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్‌గా అంబానీ ఎలాంటి భత్యాలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు, కమీషన్, స్టాక్ ఆప్షన్స్, ఇతర ప్రయోజనాలేవీ పొందలేదు.
Mukesh Ambani salary in Indian Rupees : ముకేశ్ అంబానీ 2020 జూన్‌లో తన వేతనాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు. కరోనా విజృంభణ.. దేశంలో సామాజికంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా ప్రతికూల ప్రభావం చూపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు.. 2019-20లో అంబానీ రూ.15కోట్ల వార్షిక వేతనం పొందారు. ఏటా రూ.24కోట్లు తీసుకునే అవకాశమున్నా.. మేనేజర్ స్థాయి జీతాలు తక్కువగా ఉండాలన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచేందుకు 2008-09 నుంచి ఆయన 11 సంవత్సరాల పాటు రూ.15కోట్ల వార్షిక వేతనం మాత్రమే తీసుకోవడం గమనార్హం.
రిలయన్స్‌లోని ఇతర ముఖ్యుల వేతనాల వివరాలు చూస్తే..
- అంబానీ బంధువులు, రిలయన్స్ హోల్‌టైమ్ డైరక్టర్లు అయిన నిఖిల్ మేస్వాని, హితల్ మేస్వాని.. 2021-22లో ఒక్కొక్కరు రూ.24కోట్ల వార్షిక వేతనం తీసుకున్నారు. ఇందులో రూ.17.28కోట్లు కమీషన్.
- ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు పీఎంఎస్ ప్రసాద్, పవన్ కుమార్ కపిల్ వేతనం స్వల్పంగా తగ్గింది. 2020-21లో రూ.11.99కోట్లు అందుకున్న ప్రసాద్ 2021-22లో రూ.11.89కోట్లు వేతనం తీసుకున్నారు. కపిల్ విషయంలో ఆ మొత్తం రూ.4.24కోట్ల నుంచి రూ.4.22కోట్లకు తగ్గింది.
- Nita Ambani income : రిలయన్స్ బోర్డ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, అంబానీ భార్య నీతా అంబానీ 2021-22లో రూ.5లక్షలు సిట్టింగ్ ఫీజు, రూ.2కోట్లు కమీషన్ అందుకున్నారు. అంతకుముందు ఏడాది రూ.8లక్షలు సిట్టింగ్ ఫీజు, రూ.1.65కోట్లు కమీషన్ పొందారు నీతా అంబానీ.
దుమ్మురేపిన రిలయన్స్.. ఫార్చ్యూన్-500 లిస్ట్‌లో ఒకేసారి 51 ర్యాంకులు జంప్