మారుతీ సుజుకీ సంస్థ.. కార్లపై సంవత్సరం పొడుగున డిస్కౌంట్లు ప్రకటిస్తూనే ఉంటుంది. అదే తరహాలో మరోసారి భారీ ఆఫర్లతో కంపెనీ.. కస్టమర్ల ముందుకు వచ్చింది. 2023 ఏప్రిల్‌లో జరిగే కార్ల కొనుగోలుపై.. భారీగా డిస్కౌంట్లు అందిస్తోంది. కంపెనీ మోడళ్లపై.. వివిధ రకాలుగా తగ్గింపులను ఇస్తోంది. కార్లపై కంపెనీ ఇచ్చే డిస్కౌంట్ గరిష్ఠంగా రూ.59,000 వరకు ఉంది. మరి ఏ కార్లపై ఎంత డిస్కౌంట్ ప్రకటించిందో చూద్దామా?
ఆల్టో K10..
ఈ కారుపై.. మిగతా వాటి కంటే ఎక్కువ డిస్కౌంట్‌ను ఇస్తోంది మారుతీ సుజుకీ. కస్టమర్ ఆఫర్ కింద రూ.40,000లను డిస్కౌంట్‌గా అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ బోనస్ కింద మరో రూ. 15,000ల తగ్గింపును ఇస్తోంది. రూ.4000లను కార్పొరేట్ డిస్కౌంట్‌గా పొందవచ్చు. మొత్తంగా ఈ ఆఫర్లపై రూ. 59,000 పొదుపు చేసుకోవచ్చు.
మారుతీ ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్ కార్లు..
మారుతీ ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, స్విఫ్ట్ కార్లుపై కూడా కంపెనీ భారీగానే డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ కార్లపై రూ.30,000ల వరకు కస్టమర్ ఆఫర్ కింద కంపెనీ డిస్కౌంట్ అందిస్తోంది. రూ. 15,000లను ఎక్స్ఛేంజ్ బోనస్ కింద, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.4000 తగ్గింపు ప్రకటించింది. మొత్తంగా ఒక్కో కారుపై రూ.49,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
మారుతీ సెలెరియో..
సెలెరియో కార్లపై కూడా సంస్థ డిస్కౌంట్లను బాాగానే ఇస్తోంది. సెలెరియోపై రూ.25,000లను.. కస్టమర్ డిస్కౌంట్ ఆఫర్‌గా పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.15,000ల తగ్గింపు ఉంటుంది. కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.4000ను.. సంస్థ అందిస్తోంది. ఈ కారు కొనుగోలుపై మొత్తంగా రూ.44,000ల డిస్కౌంట్‌ను కంపెనీ నుంచి పొందవచ్చు.
ఆల్టో 800..
ఈ కారుపై.. మారుతీ సంస్థ మొత్తంగా రూ.28,000 డిస్కౌంట్‌గా అందిస్తోంది. అందులో రూ.10,000 కస్టమర్ డిస్కౌంట్ కింద, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కింద, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్ కింద ఇస్తోంది.
మారుతి ఈకో..
ఈ కారుపై.. కంపెనీ రూ.28,000 మొత్తాన్ని డిస్కౌంట్‌గా ఇస్తోంది. దాంట్లో కస్టమర్ డిస్కౌంట్ కింద రూ.10,000, ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.15,000, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.3,000 ఉన్నాయి.
అదే విధంగా ఎర్టిగా టూర్ ఎమ్, వ్యాగన్ ఆర్ టూర్ ఎచ్3, డిజైర్ టూర్ ఎస్, ఆల్టో టూర్ వీ, సూపర్ క్యారీ వంటి కమర్షియల్ కార్లపైనా కంపెనీ డిస్కౌంట్లను అందిస్తోంది. వీటిపై ఇచ్చే డిస్కౌంట్లు.. వాటి కార్ల వేరియంట్లు, పవర్‌ట్రైయిన్ ఎంపికపై ఆధారపడి ఉంటాయి. మారుతీ సుజుకీ బ్రెజ్జా కాకుండా మిగతా సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలపై.. ఎటువంటి డిస్కౌంట్లు కంపెనీ ఇవ్వటం లేదు. అయితే ఈ డిస్కౌంట్లన్నీ కారు వేరియంట్, ఇంధన రకం, ఎంచుకునే పవర్‌ట్రెయిన్‌పై ఆధారపడి ఉంటాయి.