ETV Bharat / business

మస్క్​ కొత్త స్కెచ్.. ట్విట్టర్​కు పోటీగా కొత్త సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్​! - ఎలాన్​ మస్క్​

ట్విట్టర్​ డీల్​ రద్దు చేసుకుంటున్నట్లు ఇటీవలే ప్రకటించిన బిలియనీర్ ఎలాన్​ మస్క్.. త్వరలోనే ఓ కొత్త సోషల్​ మీడియా ప్లాట్​ఫారమ్​ను ప్రారంభించనున్నారనే ఓ చర్చ నెట్టింట జరుగుతోంది. అయితే మస్క్​ చేసిన ఓ ట్వీట్​ వల్లే ఇది మొదలైంది. అసలేమైందంటే?

Elon Musk coming up with new social meda site X

author img

By

Published : Aug 12, 2022, 11:37 AM IST

Elon Musk New Social Media: సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్​లో యాక్టివ్‌గా ఉంటారు ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌. తన పోస్టులతో యూజర్లను అప్పుడప్పుడూ తికమక పెడుతుంటారు. కొన్నిసార్లు ఆయన పెట్టే ట్వీట్లు అర్ధం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంటుంది. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్‌ అలాంటి పరిస్థితికే దారి తీసింది.

ట్విట్టర్​ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్ల ఎలాన్​ మస్క్​ ఇటీవలే ప్రకటించగా.. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో ఓ యూజర్​ మస్క్​కు ఓ ప్రశ్న వేశాడు. "ఒకవేళ ట్విట్టర్​ డీల్‌ పూర్తిగా రద్దు అయిపోతే .. మరో కొత్త సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఏమైనా ఏర్పాటు చేస్తారా?" అని ప్రశ్నించాడు. దీనికి మస్క్​ సమాధానంగా ఎక్స్.కామ్​(X.com) అంటూ ట్వీట్ చేశారు. దీంతో మస్క్‌ ఈ పేరుతో కొత్త సామాజిక మాధ్యమాన్ని ప్రారంభించనున్నారంటూ నెటిజన్ల మధ్య చర్చ మొదలైంది.

Elon Musk coming up with new social meda site X
మస్క్​ ట్వీట్​

అయితే ఎక్స్​.కామ్​ అనేది కొత్తదేం కాదు. ఇది గతంలో మస్క్​ నిర్వహించి తర్వాత పేపాల్​లో విలీనం చేశారు. అనంతరం 2017లో మళ్లీ సొంతం చేసుకున్నారు​. ప్రస్తుతం ఎక్స్.డామ్​ డొమైన్​ యాక్టివ్​లోనే ఉంది కానీ అందులో ఎటువంటి సమాచారం లేదు.

ఇవీ చదవండి: పర్సనల్ లోన్ తీసుకున్నారా? ఇవి మర్చిపోవద్దు!

10 రోజుల్లో రూ.12 వేల కోట్ల పెట్టుబడులు.. మార్కెట్లలో సరికొత్త జోష్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.