IndiGo Airlines Holiday Packages 2023 : భారతీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్ తమ కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన వింటర్ హాలీడే ప్యాకేజీలను ప్రకటించింది. దేశీయ ప్రయాణాలకు మాత్రమే కాదు.. అంతర్జాతీయ పర్యటనలపై కూడా బంపర్ ఆఫర్లను ప్రకటించింది.
IndiGo Airlines All in one Travel Packages : ఇండిగో ఎయిర్‌లైన్స్ కేవలం రూ.5,999కే గోవా ఆల్-ఇన్-వన్ ట్రావెల్ ప్యాకేజీని అందిస్తోంది. దీనితో పాటు ఇతర దేశీయ పర్యటనలకు కూడా మంచి ప్యాకేజీలను అందిస్తోంది. వాటి వివరాలు..
హిమాచల్ | రూ.16,200 |
అండమాన్ | రూ.32,700 |
కశ్మీర్ | రూ.8,672 |
కేరళ | రూ.20,300 |
లద్ధాఖ్ | రూ.29,100 |
రాజస్థాన్ | రూ. 20,100 |
ఈశాన్య రాష్ట్రాలు | రూ.18,300 |
IndiGo Airlines International Travel Packages : ఇండిగో ఎయిర్‌లైన్స్ అంతర్జాతీయ పర్యటనలపై కూడా స్పెషల్ ప్యాకేజీలను అందిస్తోంది. ముఖ్యంగా రూ.62,000కే దుబాయి ఆల్-ఇన్-వన్ ట్రావెల్ ప్యాకేజ్ అందిస్తోంది. రూ.34,000కే మాల్దీవ్స్‌కు టూర్ ప్యాకేజ్ ఇస్తోంది.
స్వేచ్ఛగా విహరిస్తున్నారు!
దేశంలో నేడు పర్యాటకానికి విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా యువతీ, యువకులు తమకు నచ్చిన ప్రదేశాలను చుట్టి రావడానికి ఇష్టపడుతున్నారు. దీనికి తోడు త్వరలో క్రిస్టమస్, నూతన సంవత్సరం వేడుకలు ప్రారంభం కానున్నాయి. అందువల్ల హనీమూన్ జంటలు, యువతీ యువకులు, ఫ్యామిలీలు.. టూర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా గోవా, కశ్మీర్, కేరళ, రాజస్థాన్, హిమాచల్, అండమాన్ నికోబార్ దీవులు లాంటి సుందర ప్రకృతి దృశ్యాలు ఉండే ప్రాంతాలను వీక్షించడానికి ఇష్టపడుతున్నారు. మరికొందరు ఇతర దేశాలకు వెళ్లి, అక్కడి ప్రకృతి అందాలను, నగరాలు, పర్వతాలు, బీచ్‌లను సందర్శించాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీనిని క్యాష్ చేసుకునేందుకే ఇండిగో ఎయిర్‌లైన్స్ తాజాగా వింటర్ ట్రావెల్ ప్యాకేజ్‌లను ప్రకటించింది.
విదేశీ పర్యటనలు పెరిగాయి!
ఓ ట్రావెల్ కంపెనీ నివేదిక ప్రకారం, ఇటీవలి కాలంలో అండమాన్, గోవా, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, కశ్మీర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ లాంటి దేశీయ పర్యాటక ప్రదేశాల సందర్శనకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. అలాగే అబుదాబి, దుబాయ్, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, వియత్నాం లాంటి అంతర్జాతీయ పర్యటనలు కూడా ఊపందుకుంటున్నాయి. ఆయా దేశాల వీసాలు చాలా సులువుగా లభిస్తుండడమే ఇందుకు కారణం. అందుకే భారతీయులు ఈ దేశాలకు వెళ్లడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. వీటితోపాటు ఐరోపా, సింగపూర్‌ల్లో జరిగే ప్రఖ్యాత క్రిస్మస్ వేడుకలను చూడడానికి కూడా భారతీయులు ఇష్టపడుతున్నారని సదరు నివేదిక పేర్కొంది.
కాలేజ్ స్టూడెంట్స్ స్పెషల్ - రూ.2 లక్షల బడ్జెట్లోని టాప్-10 బైక్స్ ఇవే!
2024లో లాంఛ్ కానున్న టాప్-6 ఫ్యామిలీ కార్స్ ఇవే! ధర ఎంతంటే?