ETV Bharat / business

ఇన్​కం టాక్స్ తగ్గాలా? ఈ టాప్​-5 టిప్స్ మీ కోసమే! - investment strategy in telugu

Income Tax Saving Tips In Telugu : మనం సంపాదించే ఆదాయం ఆధారంగా ప్రభుత్వానికి ఇన్​కం టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే సరైన ఆర్థిక వ్యూహాన్ని పాటించడం ద్వారా మనం ఈ ఆదాయ పన్ను భారాన్ని కొంత మేరకు తగ్గించుకోవచ్చు. అందుకే ఈ ఆర్టికల్​లో టాప్​-5 ఇన్​కం టాక్స్​ సేవింగ్ టిప్స్ గురించి తెలుసుకుందాం.

Best Ways To Save Income Tax
Income Tax Saving Tips
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 1:48 PM IST

Income Tax Saving Tips : సంవత్సరానికి రూ.7 లక్షలకు పైగా ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ ఆదాయపన్ను చెల్లించాల్సిందే. అయితే సరిగ్గా ప్లాన్ చేస్తే, ఈ ఇన్​కం టాక్స్​ను భారీ మొత్తంలో తగ్గించుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని పలు సెక్షన్లు కొన్ని రకాల పొదుపులు,పెట్టుబడులపై పన్ను మినహాయింపులు కల్పిస్తాయి. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో చేసిన ఖర్చులపై కూడా పన్ను తగ్గింపులను అందిస్తాయి. ఈ మార్గాలను సక్రమంగా ఉపయోగించుకుంటే, కచ్చితంగా చాలా వరకు ఆదాయ పన్నును తగ్గించుకోవచ్చు. అందుకే ఈ ఆర్టికల్​లో ఇన్​కం టాక్స్​ను తగ్గించే టాప్​-5 మార్గాల గురించి తెలుసుకుందాం.

1. ఇంటి రుణం తీసుకోవాలి
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80(C), 24(b) ప్రకారం, గృహ రుణం చెల్లింపులకు ప్రత్యేకమైన పన్ను మినహాయింపులు లభిస్తాయి. 80(C) ప్రకారం ప్రిన్సిపల్ మెుత్తం చెల్లింపులో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అదే విధంగా 24(b) ప్రకారం వడ్డీ చెల్లింపుపై రూ.2 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది.

2. హెల్త్ ఇన్సూరెన్స్
సెక్షన్ 80(D) ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్​కు కోసం చేసే ప్రీమియం చెల్లింపులపై పన్ను మినహాయింపులు ఉంటాయి. బీమా తీసుకున్న వారి వయస్సు ఆధారంగా పన్ను మినహాయింపులు వర్తిస్తాయి.

3. కేంద్ర ప్రభుత్వ పథకాలపై పెట్టుబడి
సెక్షన్ 80( C) ప్రకారం కేంద్ర ప్రభుత్వ పథకాలలో పొదుపు చేయటం ద్వారా రూ.1.5 లక్షల వరకూ ఇన్​కం టాక్స్​ను సేవ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ సేవింగ్స్​ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ పెన్షన్ స్కీమ్, పబ్లిక్ ప్రావిండెంట్ ఫండ్​లలో పెట్టిన పెట్టుబడులకు ఈ ఆదాయ పన్ను మినహాయింపులు లభిస్తాయి. పైగా వీటికి పెద్ద మొత్తంలో వడ్డీ కూడా లభిస్తుంది.

4. ఇన్సూరెన్స్ ప్లాన్స్
జీవిత బీమా ప్రీమియం చెల్లింపులకు సెక్షన్ 80C ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తుంది. ముఖ్యంగా బీమా వార్షిక ప్రీమియంలో రూ.1.5 లక్షల వరకూ పన్ను సడలింపు ఉంటుంది.

5.వివిధ రకాల పెట్టుబడులపై
సెక్షన్ 80(C) ప్రకారం, వివిధ రకాల పెట్టుబడులు, వ్యక్తిగత లేదా కుటుంబ ఖర్చులపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు.

పైన చెప్పిన పద్దతులు ఉపయోగించుకుని, మీ డబ్బును ఆదా చేసుకోండి. ఈ విషయంలో మీకు సరైన అవగాహన లేకపోతే, సర్టిఫైడ్ ఫైనాన్సియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం మంచిది.

FDపై అధిక వడ్డీ రావాలా? SBI 'గ్రీన్​ డిపాజిట్​' స్కీమ్​తో ఫుల్ లాభాలు!

జోరు పెంచుతున్న మారుతి సుజుకి - వరుసగా 8 కార్ల లాంఛింగ్​కు సన్నాహాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.