ETV Bharat / business

అదరగొట్టిన ఐసీఐసీఐ, యెస్‌ బ్యాంక్‌.. లాభాలు 50శాతం జంప్‌ - ఐసీఐసీఐ త్రైమాసిక ఫలితాలు

ICICI BANK Q1 result: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ.. త్రైమాసిక ఫలితాల్లో సత్తా చాటింది. నికర లాభం 50 శాతం వృద్ధి చెందినట్లు ప్రకటించింది. యెస్ బ్యాంక్ సైతం లాభాల్లో 50 శాతం వృద్ధి సాధించింది. మరో ప్రైవేట్ బ్యాంక్ కోటక్ మహీంద్రా సైతం ఫలితాల్లో రాణించింది.

ICICI BANK
ICICI BANK
author img

By

Published : Jul 23, 2022, 5:46 PM IST

ICICI Q1 results: దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న మూడు ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంకుల త్రైమాసిక ఫలితాలు శనివారం వెలువడ్డాయి. ఐసీఐసీఐ, యెస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను వెలువరించాయి. ఐసీఐసీఐ, యెస్‌ బ్యాంకులు 50 శాతం చొప్పున లాభాలతో అదరగొట్టగా.. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 26 శాతం లాభంతో ఫర్వాలేదనిపించింది.

యెస్‌ బ్యాంక్‌ లాభం రూ.311 కోట్లు
Yes Bank Q1 profit: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో యెస్‌ బ్యాంక్‌ నికర లాభం రూ.311 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో బ్యాంక్‌ లాభం రూ.207 కోట్లు ఉండగా.. ఈ సారి లాభం 50 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం సైతం రూ.5,394 కోట్లు నుంచి రూ.5,916 కోట్లకు పెరిగింది. నికర నిరర్థక ఆస్తులు 5.78 శాతం నుంచి 4.17 శాతానికి తగ్గినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బ్యాంక్‌ తెలిపింది.

ఐసీఐసీఐ లాభం రూ.6905 కోట్లు
ప్రైవేటు రంగ అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్‌ స్టాండలోన్‌ పద్ధతిన రూ.6,905 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.4,616 కోట్లు కాగా.. ఈ ఏడాది లాభం 50 శాతం వృద్ధి చెందింది. బ్యాంక్‌ ఆదాయం సైతం గతేడాది రూ.24,379.27 కోట్ల నుంచి రూ.28,336.74 కోట్లకు పెరిగింది. వడ్డీపై వచ్చే ఆదాయం గతేడాదితో పోల్చినప్పుడు రూ.20,383.41 కోట్ల నుంచి 23,671.54 కోట్లుకు చేరింది. స్థూల నిరర్థక ఆస్తుల విలువ 5.15 శాతం నుంచి 3.41 శాతానికి చేరినట్లు బ్యాంక్‌ తెలిపింది. బ్యాడ్‌లోన్స్‌ తగ్గడం కంపెనీ లాభాలకు దోహదపడింది.

ఫర్వాలేదనిపించిన కోటక్‌..
కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సైతం మంచి ఫలితాలనే ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 1,641.92 కోట్ల లాభాన్ని ప్రకటించిన ఈ బ్యాంక్‌.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,071.15 కోట్ల లాభాన్ని ఆర్జించింది. లాభంలో 26 శాతం వృద్ధిని కనబరిచింది. బ్యాంక్‌ ఆదాయం సైతం రూ.8,062.81 కోట్ల నుంచి రూ.8,582.25 కోట్లకు పెరిగింది. బ్యాంక్‌ ఎన్‌పీఏలు 3.56 శాతం నుంచి 2.24 శాతానికి తగ్గినట్టు కోటక్‌ బ్యాంక్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.