ETV Bharat / business

గుడ్​న్యూస్.. బ్యాంకులో SO పోస్టులకు IBPS నోటిఫికేషన్.. పూర్తి​ వివరాలివే.. - బ్యాంకు ఎస్​ఓ నోటిఫికేషన్​ వివరాలు 2022 23

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఐబీపీఎస్​ గుడ్​ న్యూస్​ చెప్పింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 710 స్పెషలిస్టు ఆఫీసర్ల పోస్టులకు నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ఎలా చేయాలి? ఎంపిక విధానం ఎలా ఉంటుంది? విద్యా అర్హతలు ఏమిటి? అనే పూర్తి వివరాలు మీకోసం.

ibps-so-recruitment-2022
ఐబీపీఎస్ ఎస్​ఓ పోస్టులకు నోటిఫికేషన్​
author img

By

Published : Nov 1, 2022, 2:56 PM IST

నిరుద్యోగులకు గుడ్​ న్యూస్. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్టు ఆఫీసర్ల(ఎస్​ఓ) ​ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఐబీపీఎస్. ఔత్సాహికుల 1 నవంబర్ 2022 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది​. మొత్తం 710 పోస్టులకు గానూ ఈ నోటిఫికేషన్​ విడుదలైంది. 2022 నవంబర్ 21ని​ దరఖాస్తుకు చివరి తేదీగా పేర్కొంది. ఐబీపీఎస్​ స్పెషలిస్టు ఆఫీసర్ల ప్రిలిమ్స్,​ మెయిన్స్​ పరీక్షా తేదీ వివరాలు వెల్లడించింది.

ఐబీపీఎస్​ ఎస్​ఓ నియామకం 2022 ముఖ్యమైన తేదీలు

ఆన్​లైన్​ ధరఖాస్తు01.11.2022- 21.11.2022
ధరఖాస్తు రుసుం చెల్లింపు 01.11.2022- 21.11.2022
ప్రిలిమ్స్​ హాల్​ టికెట్ల డౌన్​లోడ్డిసెంబర్-22
ప్రిలిమ్స్ పరీక్ష 24.12.2022/ 31.12.2022
ప్రిలిమ్స్ రిజల్ట్ జనవరి-23
మెయిన్స్​​ హాల్​ టికెట్ల డౌన్​లోడ్ జనవరి-23
మెయిన్స్​ పరీక్ష29.01.2023
మెయిన్స్ రిజల్ట్ఫిబ్రవరి-23
ఇంటర్య్వూ తేదిఫిబ్రవరి/మార్చి 2023
ప్రొవిజనల్ అలాట్​మెంట్ఎప్రిల్ 23

వయో పరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 2022 సెప్టెంబర్ 11 నాటికి కనీసం 20 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠంగా వయో పరిమితి 30 ఏళ్లు. 2 నవంబర్​ 1992 ఉన్నవారు అర్హులు కాదు.

దరఖాస్తు ఇలా..

  1. ఐబీపీఎస్​ అధికారిక వెబ్​సైట్​ ibps.in కు వెళ్లాలి.
  2. సీఆర్​పీ స్పెషలిస్టు ఆఫీసర్​ సెక్షన్​లో క్లిక్​ చేయాలి.
  3. సీఆర్​పీ స్పెషలిస్టు ఆఫీసర్ 12 మీద క్లిక్ చేయాలి.
  4. దరఖాస్తు లింక్​పై క్లిక్​ చేసి.. ఫీజు చెల్లించి ఫామ్ సమర్పించాలి
  5. దరఖాస్తును డౌన్​లోడ్​ చేసుకుని ఓ కాపీ సేవ్ చేసుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.