ETV Bharat / business

Hyundai Exter SUV Launch : స్టన్నింగ్​ ఫీచర్లతో హ్యుందాయ్​ ఎక్స్​టర్​ లాంఛ్​.. ధర ఎంతంటే? - latest automobile launch india

Hyundai Exter SUV Launch : ఇండియన్​ మార్కెట్​లో సోమవారం హ్యూందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ లాంఛ్ అయ్యింది. స్టన్నింగ్​ ఫీచర్లతో, స్టైలిష్​ లుక్​తో ఈ మిడ్​ సెగ్మెంట్ ఎస్​యూవీ కారును మార్కెట్లోకి తేవడం జరిగింది. మరి దీని స్పెసిఫికేషన్స్​, ఫీచర్స్​, ధర మొదలైన పూర్తి వివరాలు చూద్దాం రండి.

Hyundai Exter SUV specs and features
Hyundai Exter SUV launch
author img

By

Published : Jul 10, 2023, 1:41 PM IST

Updated : Jul 10, 2023, 2:30 PM IST

Hyundai Exter SUV Launch : కొరియన్​ కంపెనీ హ్యుందాయ్​ సోమవారం ఇండియన్ మార్కెట్​లో హ్యూందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీని లాంఛ్​ చేసింది. అదిరే ఫీచర్లతో, స్పెసిఫికేషన్స్​తో మిడ్​ సెగ్మెంట్​ ఎస్​యూవీగా దీనిని తీసుకొచ్చింది. ఇది నేరుగా టాటా పంచ్​, సిట్రోయెన్​ సీ3తో పోటీ పడనుందని మార్కెట్​ నిపుణులు అంచనా వేస్తున్నారు. హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ బుకింగ్స్​ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. కేవలం రూ.11,000 టోకెన్ అమౌంట్​తో ఈ కారును బుక్​ చేసుకునే వీలుంది.

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ స్పెసిఫికేషన్స్
Hyundai Exter Specifications : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ డిజైన్ యూనిక్​గా ఉంది. దీనిలో 1.2 లీటర్​ VTVT NA పెట్రోల్​ ఇంజిన్​ ఉంది. వాస్తవానికి ఈ ఇంజిన్​ను హ్యుందాయ్​ కంపెనీకి చెందిన వెన్యూ, ఐ20, ఐ10, నియోస్​ కార్లలో ఉన్నదే. ఈ ఇంజిన్ 81.86 పీహెచ్​పీ పవర్​, 113.8 ఎన్​ఎం టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇందులో 5 స్పీడ్​ మాన్యువల్​, ఏఏంటీ ట్రాన్స్​ మిషన్ ఉంది.

Hyundai Exter SUV specs
హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ స్పెసిఫికేషన్స్​

Hyundai Exter SUV Mileage : హ్యూందాయ్​ ఎక్స్​టర్​ లీటర్​కు 19.4 కి.మీ మైలేజ్​ ఇస్తుంది. రూ.7.96 లక్షలు ధర కలిగిన హ్యుందాయ్​ ఎక్స్​టర్​ కారు 19.2 కి.మీ/లీటర్​ మైలేజ్​ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఫీచర్స్​
Hyundai Exter Features : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ EX, S, SX, SX(O), Spec SX(O) అనే ఐదు వేరియంట్లలో లభిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ మిడ్​ సెగ్మెంట్​ ఎస్​యూవీలో తొలి​ సన్​రూఫ్ కారు ఇదే. ఇది వాయిస్​ ఎనేబుల్డ్​ స్మార్ట్​ ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​ కావడం విశేషం. ఇంకా ఈ కారులో 4.2 అంగుళాల డిజిటల్​ డిస్​ప్లే, 8 అంగుళాల ఫ్లోటింగ్​ ఇన్ఫొటైన్​మెంట్​ సిస్టమ్​, వైర్​లెస్​ ఛార్జర్​, వైర్​లెస్​ యాపిల్ కార్​ప్లే, ఆండ్రాయిండ్ ఆటో, సెమీ డిజిటల్​ క్లస్టర్​ ఉన్నాయి. దీనిలోని బుట్​ స్పేస్​ 391 లీటర్లు ఉంది. అంటే ఇది ఎంతో విశాలంగా లగేజ్​ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.

Hyundai Exter SUV features
హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ ఫీచర్స్

సెఫ్టీ ఫీచర్స్​:
Hyundai Exter Safety Features : హ్యుందాయ్​ ఎక్స్​టర్​లో సేఫ్టీ కోసం 8 ఎయిర్​ బ్యాగులు ఇచ్చారు. అలాగే ఎలక్ట్రికల్​ స్టెబిలిటీ కంట్రోల్​, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్​, హిల్ అసిస్ట్​ కంట్రోల్​, సీట్​బెల్ట్​ రిమైండర్​, థెఫ్ట్​ అలారం, కీలెస్​ ఎంట్రీ, ఈఎస్ఎస్​, పార్కింగ్​ సెన్సార్​, ఏబీఎస్​ విత్​ ఊబీడీ .. అలాగే ఫ్రంట్​, రియర్ కెమెరాలతో కూడిన డాష్​కామ్​ కూడా దీనిలో ఉన్నాయి.

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ వీల్​బేస్​ 2,450mm, ఎత్తు 1,631mmగా ఉంది. అందువల్ల మంచి ఎత్తుతో, డ్రైవింగ్​ కంఫర్ట్, లెగ్​ స్పేస్​తో ఈ ఎస్​యూవీ చాలా సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ హ్యుందాయ్​ ఎక్స్​టర్​ అవుట్​డోర్​, ట్రావెల్​ డ్రైవ్​లకు చాలా అనుకూలంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

Hyundai Exter SUV interior and  price
హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ ఇంటీరియర్​

హ్యుందాయ్​ ఎక్స్​టర్ ఎస్​యూవీ ధర ఎంత?
Hyundai Exter Price : హ్యుందాయ్​ ఎక్స్​టర్ ప్రారంభ ధర రూ.5,99,900 (ఎక్స్​-షోరూం ధర)గా నిర్ణయించారు. దీనిలోని హై-ఎండ్​ మోడల్​ ధర రూ.9.31 లక్షలు (ఎక్స్​-షోరూం ధర). హ్యుందాయ్​ ఎక్స్​టర్​ సీఎన్​జీ ట్రిమ్ కారు​ ధర రూ.8.23 లక్షలుగా ఉంది.

Last Updated : Jul 10, 2023, 2:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.