ETV Bharat / business

15వ విడత పీఎం కిసాన్ నిధులు మీ ఖాతాలో జమ అయ్యాయా? చెక్ చేసుకోండిలా! - పీఎం కిసాన్ ఈ కేవైసీ ప్రాసెస్​

How To Check PM Kisan Beneficiary Status In Telugu : ప్రధాని నరేంద్ర మోదీ 15వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేశారు. లబ్ధిదారుల అకౌంట్​లో సదరు డబ్బులను జమ చేస్తారు. మరి మీరు కూడా పీఎం కిసాన్ స్కీమ్ లబ్ధిదారులా? అయితే మీ ఖాతాలో సదరు డబ్బులు జమ అయ్యాయో? లేదో? చెక్​ చేసుకోండి ఇలా!

How To Check PM Kisan Beneficiary Status
PM Kisan 15th Installment 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 7:17 PM IST

How To Check PM Kisan Beneficiary Status : రైతులకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం "ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి" పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.6,000 రైతులకు అందజేస్తోంది. ఈ నగదు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. అయితే ఈ సొమ్ము ఒకేసారి కాకుండా మొత్తం 3 దఫాలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అంటే ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి ఈ నిధులు రైతుల అకౌంట్​లో జమ అవుతాయి.

పీఎం కిసాన్​ 15వ విడత నిధుల విడుదల
PM Kisan 15th Installment 2023 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఝార్ఖండ్​లో 15వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేశారు. ఈ-కేవైసీ చేయించుకున్న లబ్ధిదారుల ఖాతాల్లో ఈ నిధులు జమ అవుతాయి. అందుకే అర్హులైన రైతులు కచ్చితంగా.. పీఎం కిసాన్​ పథకం లబ్ధిదారుల జాబితాలో తమ పేరు ఉందో? లేదో? చెక్​ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ముందుగా మీరు www.pmkisan.gov.in వెబ్​సైట్​ ఓపెన్ చేయాలి.
  • వెబ్​సైట్​లోని "Beneficiary List" ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం వివరాలను ఎంచుకోవాలి.
  • లబ్ధిదారుల జాబితా కోసం ''Get Report" క్లిక్ చేయాలి. అంతే సింపుల్​!
  • మీ గ్రామంలోని లబ్ధిదారుల పేర్లు అక్కడ కనిపిస్తాయి. వాటిలో మీ పేరు ఉందో? లేదో? చూసుకోవాలి.

నోట్​ : మీకు కనుక ఏదైనా సందేహం ఉన్నా? లేక సాయం కావాలన్నా 155261 లేదా 011-24300606 నంబర్లకు ఫోన్ చేయవచ్చు.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం దరఖాస్తు చేయడం ఎలా?
How To Apply For PM Kisan Scheme : మీరు కనుక అర్హులైన రైతులైతే.. పీఎం కిసాన్​ సమ్మాన్ నిధి కోసం అప్లై చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ముందుగా మీరు pmkisan.gov.in వెబ్​సైట్​ ఓపెన్ చేయండి.
  • New Farmer Registration లింక్​పై క్లిక్ చేసి, మీ ఆధార్ నంబర్‌ నమోదు చేయండి. తరువాత క్యాప్చాను ఎంటర్​ చేయండి.
  • అవసరమైన వివరాలను నమోదు చేసి 'Yes'పై క్లిక్ చేయండి.
  • PM కిసాన్ దరఖాస్తు ఫారమ్-2023ని నింపిన తర్వాత Save బటన్​పై క్లిక్​ చేయండి.
  • భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్ తీసుకుని భద్రపరుచుకోండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.