ETV Bharat / business

How to Check GST Payment Status in Online : ఆన్​లైన్​లో మీ జీఎస్టీ పేమెంట్ స్టేటస్.. ఇలా తెలుసుకోండి! - ఆన్​లైన్​లో జీఎస్టీ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి

How to Check GST Payment Status in Online : మీరు తరచుగా వ్యాపారానికి సంబంధించిన జీఎస్టీ చెల్లిస్తున్నారా..? పన్ను చెల్లింపు సక్సెస్​ఫుల్​గా జరిగిందో.. లేదో? అనే సందేహంలో ఉంటున్నారా..? ఇప్పుడు ఆ టెన్షన్ అవసరం లేదు. చాలా సింపుల్​గా ఆన్​లైన్​లో చెక్ చేసుకోవచ్చు!

GST Payment Status in Online
How to Check GST Payment Status in Online
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 2:25 PM IST

How to Check GST Payment Status Online in Telugu : దేశంలోని పరోక్ష పన్నుల విధానంలో వస్తుసేవల పన్ను (Goods and Service Tax) అతిపెద్ద సంస్కరణగా చెప్పవచ్చు. పలు రకాల పన్నులను విలీనం చేసి GSTని అమల్లోకి తెచ్చారు. ఈ జీఎస్టీ విధానం 2017 జూలై నుంచి దేశంలో అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.

Goods and Service Tax Slabs : వస్తుసేవలపై శ్లాబుల వారీగా సున్నా శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా పన్నులను విధిస్తున్నారు. కొన్ని పన్నులు మినహా దాదాపు అన్ని రకాల పన్నులను కలిపి సమగ్రమైన GSTని తెచ్చారు. అలాగే.. కొన్ని రకాల ఉత్పత్తులపై జీఎస్టీతో పాటు సెస్​ను కూడా విధిస్తున్నారు. అయితే.. అన్ని రకాల ఉత్పత్తులపై వస్తుసేవల పన్ను ఒకే విధంగా ఉండదు. నిత్యం మనం వాడే వస్తుసేవలపై ఈ పన్ను వేర్వేరుగా ఉంటుంది. జీఎస్టీ(GST)లోనూ సీజీఎస్టీ(సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్), ఎస్​జీఎస్టీ (స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్), ఐజీఎస్టీ(ఇంటర్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్) అనే మూడు రకాలున్నాయి.

Check GST Payment Status Online Process : ఈ క్రమంలో వ్యాపారస్తులు, పన్ను చెల్లింపుదారులు ప్రతినెలా.. లేదా త్రైమాసికానికి కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లిస్తారు. కానీ.. చాలామంది పన్ను చెల్లించాక తమ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోరు. దాంతో తర్వాత ఏదైనా పొరపాటు జరిగితే నానా ఇబ్బందులు పడతారు. అయితే.. చాలామందికి తమ నెలవారీ లేదా త్రైమాసిక జీఎస్టీ పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియక ఆగిపోతుంటారు. ఇప్పుడు చింతించాల్సిన పని లేదు. సింపుల్​గా ఆన్​లైన్​లో కింద పేర్కొన్న విధంగా మీ జీఎస్టీ చెల్లింపు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

GST On Diesel Vehicles : డీజిల్ వాహనదారులకు షాక్​!.. పొల్యూషన్ టాక్స్​గా.. 10% జీఎస్టీ పెంపు!

How to Track GST Payment Status in Online :

ఆన్​లైన్​లో మీ జీఎస్టీ పేమెంట్ స్టేటస్ రెండు పద్ధతుల్లో తెలుసుకోండి..

  • మొదట మీరు GST పోర్టల్‌ని సందర్శించాలి.
  • ఇక్కడ మీరు చెల్లింపులను ట్రాక్ చేయడానికి ప్రత్యేకంగా లాగిన్ కావాల్సిన అవసరం లేదు.
  • GST పోర్టల్ హోమ్‌పేజీలో Services విభాగానికి వెళ్లాలి.
  • అక్కడ 'Payments'అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • అనంతరం 'Track Payment Status' క్లిక్ చేయాలి.
  • ఇక్కడ GST నంబర్ వివరాలను నమోదు చేయాలి.
  • అలాగే మీ Common PIN(CPIN అనేది చెల్లింపునకు ముందు రూపొందించబడిన 14-అంకెల సంఖ్య) నమోదు చేయాలి.
  • ఇప్పుడు Track Status ఆప్షన్​పై క్లిక్ చేస్తే.. మీ జీఎస్టీ పేమెంట్ స్టేటస్ స్క్రీన్​పై కనిపిస్తుంది.
  • మీరు పేమెంట్ చేస్తే.. చెల్లించినట్లు స్టేటస్ కనిపిస్తుంది.
  • ఆ తర్వాత మీరు రశీదుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Online Games Tax : ఆన్​లైన్​ గేమింగ్​పై 28 శాతం జీఎస్​టీ.. అక్టోబర్ నుంచే అమలు.. 6 నెలల తర్వాత సమీక్ష

Fake GST Registrations : నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లపై ఉక్కుపాదం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.