ETV Bharat / business

How to become Rich : డబ్బు గురించి మీ పిల్లలకు కచ్చితంగా చెప్పాల్సిన ఐదు పాఠాలివి! - డబ్బులు పిల్లలు

How to become Rich : మీరు మీ పిల్లల భవిష్యత్​ కోసం బంగారు కలలు కంటున్నారా? అయితే వెంటనే వారికి ఆర్థిక పాఠాలు నేర్చించండి. వారికి డబ్బు గురించి, సంపద సృష్టించడం గురించి చెప్పండి. డబ్బు లేకపోతే జీవించడం ఎంత కష్టమో వివరించండి. అంతా బాగానే ఉంది కానీ.. మరి పిల్లలకు ఏ విధంగా అవగాహన కల్పించాలని అనుకుంటున్నారా? అయితే ఈ పూర్తి కథనం చదవండి.

Five money lessons parents must teach their children
how to become rich
author img

By

Published : Jun 13, 2023, 4:45 PM IST

How to become Rich : ధనవంతులు కావడం ఎలా? మీరు ఎప్పుడైనా మీ పిల్లలకు ఈ విషయం చెప్పారా? మనలో చాలా మంది 'పిల్లలకు డబ్బు విషయాలు చెప్పడం మంచిది కాదు' అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది ఏమాత్రం సరికాదు. కచ్చితంగా పిల్లలకు డబ్బు విలువ గురించి చెప్పాలి.

పిల్లలకు ఎంత తొందరగా డబ్బు గురించి తెలియజేస్తే అంత మంచిది. మన భారత దేశంలో సాధారణంగా పెద్ద వారిలో కూడా ఆర్థిక అక్షరాస్యత తక్కువనే చెప్పాలి. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ మారిన నేటి పరిస్థితుల్లో ఇది ఏమాత్రం మంచిది కాదు. పిల్లలకు కచ్చితంగా ఆర్థిక విషయాలు గురించి, డబ్బు సంపాదించే మార్గాల గురించి, మనీ మేనేజ్​మెంట్​ గురించి తెలియజేయాలి. పర్సనల్​ ఫైనాన్సిస్​ విషయాలపై తల్లిదండ్రులు కచ్చితంగా తమ పిల్లలతో చర్చించాలని ఈడెల్​వైస్​ మ్యూచువల్ ఫండ్​ ఎండీ, సీఈఓ రాధికా గుప్తా సూచిస్తున్నారు.

పిల్లలకు చెప్పాల్సిన 5 ముఖ్యమైన ఆర్థిక పాఠాలు
రాధికా గుప్తా ట్విట్టర్​ వేదికగా మనీ గురించి 5 ముఖ్యమైన విషయాలను షేర్ చేశారు. డబ్బుకు ఉన్న పరిమితులు చెబుతూనే, దానికున్న ప్రాముఖ్యాన్ని ఆమె చాలా స్పష్టంగా వివరించారు. అవి ఆమె మాటల్లోనే..

1. ముఖ్యమైన అవసరాల కోసం మాత్రమే ఖర్చు చేయాలి
డబ్బు చాలా విలువైనది. మీ కలలు, ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి వీలును కల్పిస్తుంది. అది మీ జీవితానికి కావల్సిన చిన్నా, పెద్దా విషయాలను సులభతరం చేస్తుంది. కష్టసమయంలో మీకు ధైర్యాన్ని, ఓదార్పును అందిస్తుంది. మీ ప్రియమైన వారిని ఆనందపరచడానికి ఉపయోగపడుతుంది. కనుక డబ్బు సంపాదించడం, దానిని ఆదా చేయడం ముఖ్యం. మీరు కూడా అనవసరైన ఖర్చులు తగ్గించుకుని, మన నిత్యావసరాలకు, ముఖ్యమైన అవసరాలకు వాటికి మాత్రమే ఖర్చు పెట్టండి.

  • 1. Money does have a real purpose. It enables you to fulfil your dreams, it makes the little and big things in life easier. It adds comfort, it enables moments of joy, for you and people who care for you. So earning money and saving money is important.

    — Radhika Gupta (@iRadhikaGupta) June 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

2. డబ్బుల వర్సెస్​ విలువ
డబ్బు మీ విలువను సరితూచలేదు. జీవించడానికి డబ్బు అవసరమే కానీ డబ్బే జీవితం కాదు. డబ్బు లేనంత మాత్రాన మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. డబ్బు లేకపోయినంత మాత్రాన మీకు సమాజంలో విలువలేదు అని భ్రమపడవద్దు. ఎందుకంటే డబ్బుకు ఆ సామర్థ్యం ఉంది.

వాస్తవానికి ప్రజలు చూడడానికి చాలా భిన్నంగా మనకు కనిపిస్తారు. వారి బ్యాంకు బ్యాలెన్స్​ వారి జీవనశైలి ప్రతిబింబించదు. ఉదాహరణకు.. బాగా డబ్బు ఉన్నవారు కూడా సాధారణంగా కనిపించవచ్చు. సామాన్యులు కూడా పది మందిలో గొప్ప కోసం అప్పులు చేసి, దర్జాగా కనిపిస్తూ ఉంటారు.

  • 2. But money cannot define you. Never let it affect your sense of self worth or your confidence, because it has the power to do that. Never let it affect how you are and behave with others either, because people are more than their bank balance.

3. డబ్బుపై కృతజ్ఞత కలిగి ఉండాలి!
డబ్బుపై మనకు కృతజ్ఞత భావం ఉండాలి. ముఖ్యంగా వంశపారంపర్యంగా వచ్చిన, తల్లిదండ్రులు మనకు ఇచ్చిన ఆస్తులపై, సంపదపై మనకు చాలా కృతజ్ఞత ఉండాలి. ఎందుకంటే తరతరాలుగా మీ వంశ భవిష్యత్​ కోసం వారు ఎంతో కృషి చేసి, ఆ సంపదను పోగుచేశారు. మీరు కూడా ఆ సంపదను మరింత వృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకోసం మీరు మరిన్ని అవకాశాలను సృష్టించుకోండి. రిస్క్​ తీసుకోండి.

  • 3. Gratitude is the most important money attitude. You have more than I did, and I have more than my parents did, because each generation has worked hard. Use what you have to take another leap, to take risks, to create opportunities that we never had.

4. డబ్బు కోసం అత్యాశ పడకండి
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఆదాయం ఇచ్చేది ఫైనాన్స్​ బిజినెస్​. కానీ అనేక మంది ఇక్కడే ఎక్కువగా నష్టపోతుంటారు. ఎందుకంటే వారిలోని అత్యాశే వారిని ఆ స్థితికి దిగజారుస్తుంది.

  • 4. Greed takes you down. Finance is one of the best paid industries in the world, yet the biggest and best fall hard because of greed. Know the value of “enough” and never take a shortcut to earn money. It can never be worth it.

'అత్యాశ మిమ్మల్ని దిగజారుస్తుంది. డబ్బు సంపాదించడానికి మీరు షార్ట్​కట్స్​ వెతకవద్దు. ఎందుకంటే దాని వల్ల మీకు ఎలాంటి విలువ చేకూరదు.'
- రాధికా గుప్తా, ఎండీ అండ్​ సీఈఓ, ఈడెల్​వైస్​ మ్యూచువల్ ఫండ్​

5. మీలోని ప్రతిభయే మీ ఆస్తి!
మీలోని ప్రతిభను ఉపయోగించుకుని సంపద సృష్టించుకోండి. మీ తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితులను మేనేజ్​ చేస్తూ గడిపేశారు. కానీ మీరు ప్రపంచంలోనే అత్యంత గొప్ప అవకాశాలు ఉన్న భారతదేశంలో ఉన్నారు. అందువల్ల మీరు మీ టాలెంట్​ను ఉపయోగించండి. అదే మీకు పెద్ద ఆస్తి.

  • 5. Your parents have earned a living managing money. But first focus on managing your biggest asset - your talent, and you are playing in one of the best markets in the world - India. Learn to read, write, think, fall, rise, dream, create and build.

'చదవడం, రాయడం, ప్రతిబింబించడం, కష్టపడడం, ఎదగడం, కలలు కనడం, సృష్టించడం, నిర్మించడం నేర్చుకోండి.'

వాస్తవానికి ఈ సూచనలు పిల్లలకు మాత్రమే కాదు. పెద్దలకు కూడా ఇవి చాలా ఉపయోగకరమైనవి అని రాధికా గుప్తా పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.