ETV Bharat / business

How to Become Millionaire With Daily Savings of Rs.500: 15*15*15 ఫార్ములా తెలుసా? కోటీశ్వరులు ఫాలో అయ్యే సూత్రం ఇదే..!

How to Become Millionaire: ప్రస్తుతం దేశంలో ఈక్విటీలపై కంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై ఇన్వెస్టర్లు మక్కువ చూపుతున్నారు. అయితే చాలా మందికి దీని ద్వారా కోటీశ్వరులుగా మారే అసలైన ఫార్ములా తెలియదు. ఇంతకీ ఆ ఫార్ములా ఏంటి..? దాని ద్వారా కోటీశ్వరులు అవ్వడం ఎలానో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 11:29 AM IST

How to Become Millionaire With Daily Savings of Rs.500: కోటీశ్వరులు కావాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది..? అయితే.. కొందరు కేవలం కోరికతో వదిలిపెట్టకుండా.. దాన్ని సాధించుకోవడానికి కష్టపడతారు. కానీ.. ఎక్కడో సమస్య ఉంటుంది. దీనికి కారణం.. సరైన ఆర్థిక అవగాహన లేకపోవడమే అని చెబుతున్నారు నిపుణులు. సరైన ఆర్థిక సూత్రాలు తెలియకపోవడం వల్లనే డబ్బును వృద్ధి చేసుకోలేక పోతున్నారని.. కానీ దానికో సూత్రం ఉందంటున్నారు. మరి అది ఏంటి..? దానిని ఎలా ఉపయోగించాలి..? వంటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం...

అపోహ వీడాలి..

కోటీశ్వరుడు కావాలంటే.. చాలా డబ్బు పెట్టుబడిగా పెట్టాలని అందరూ అనుకుంటారు. అయితే.. ఇది పూర్తి నిజం కాదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. తక్కువ డబ్బుతో.. సరైన పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్ చేయటం వల్ల త్వరగా ధనవంతులు కావచ్చంటున్నారు. ఇందుకోసం ముందుగా 15*15*15 సూత్రం గురించి తెలుసుకోవాలట!

Mutual Funds Investment Guide For Beginners : మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్​ చేయాలా?.. ఈ 5 సూత్రాలు కచ్చితంగా పాటించండి!

15*15*15 నియమం ఏమిటి..?: భవిష్యత్తు అవసరాల కోసం ఎక్కువ మంది రిస్క్ లేకుండా రిటర్న్స్ కావాలని అనుకుని.. ఎస్ఐపీలను ఎంచుకుంటున్నారు. పైగా దీర్ఘకాలం కోసం పెట్టుబడి పెట్టే వారు దీని నుంచి ఖచ్చితంగా మెరుగైన రాబడులను అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పైగా వీటిని అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్లు నిర్వహించటం వల్ల ఎలాంటి ఆందోళన లేకుండా మెరుగైన రాబడులను పొందొచ్చు.

సిస్టమేటిక్ ఇన్వెస్మెంట్ ప్లాన్(SIP) రూపంలో చాలా మంది పెట్టుబడులు పెడుతూనే ఉంటారు. అయితే కోటి రూపాయల టార్గెట్ అందుకోవటానికి ఒక ఫార్ములా ఉంది. అదే చాలా ఫేమస్ అయిన 15*15*15 స్ట్రాటజీ. దీనికి అర్థం ఏమిటంటే ఎవరైనా పెట్టుబడిదారుడు నెలకు 15వేల రూపాయల చొప్పున.. 15 ఏళ్ల పాటు.. 15 శాతం రాబడి అందించే ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేస్తే వారు ఖచ్చితంగా కోటీశ్వరులుగా మారతారు. దీని వెనుక కాంపౌండింగ్ ఫార్మాలా అతి పెద్ద మ్యాజిక్ చేస్తోంది. సామాన్యులను సైతం కోటీశ్వరులుగా మారేందుకు ఈ ఫార్ములా కింద రోజుకు రూ.500 మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెడితే సరిపోంతుందన్న మాట.

DMF Vs FD.. రెండింటిలో పెట్టుబడికి ఏది బెస్ట్?.. రాబడి ఎందులో ఎక్కువంటే?

ఎవరైనా కోటీశ్వరుడిగా మారాలనుకునే ఇన్వెస్టర్ క్రమం తప్పకుండా ఈ ప్రణాళిక ప్రకారం 15 ఏళ్ల పెట్టుబడిని కొనసాగిస్తే వారు అక్షరాలా కోటి రూపాయల కంటే ఎక్కువ రాబడిని పొందుతారు. ఈ కాలంలో పెట్టుబడిపై 15 శాతం చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ వేసుకుంటే 75 లక్షలు అవుతుంది. ఇదే సమయంలో ఇన్వెస్టర్ పెట్టుబడి రూపంలో మెుత్తంగా రూ.27 లక్షలు పెడతారు. కాబట్టి ఈ రెండింటిని కలిపితే మెుత్తం 15 ఏళ్ల తర్వాత రాబడి రూ.1.02 కోట్లకు చేరుకుంటుంది. అంటే క్రమపద్ధతిలో పెట్టుబడి పెడితే కోటీశ్వరులుగా మారాలనుకునే కల నిజం కావటం తథ్యం అని ఈ ఫార్ములా నిరూపిస్తోంది.

గమనిక: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టేముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి.

ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? క్రమం తప్పని ఆదాయం కావాలా? ఇలా చేయండి!

గోల్డ్ ఈటీఎఫ్​తో మీ పెట్టుబడులు సేఫ్​.. కొనుగోలు, అమ్మకాలు చాలా ఈజీ గురూ

రూ.1000 పెట్టుబడితో కోటీశ్వరులు కావచ్చు! కానీ.. ఓ ట్విస్ట్!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.