ETV Bharat / business

మీ డిపాజిట్లకు అధిక వడ్డీ కావాలా?.. అయితే ఇలా చేయండి! - బ్యాంకు డిపాజిట్లకు అధిక వడ్డీ లేటెస్ట్ న్యూస్

ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు ఆర్‌బీఐ రెపో రేటును పెంచింది. ఫలితంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ) వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. అనేక బ్యాంకులు ఇప్పుడు 7 శాతానికి మించే వార్షిక వడ్డీని ఇస్తున్నాయి. కొన్ని బ్యాంకులు 8 శాతాన్నీ దాటాయి. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీలను ఎంచుకునే వారు ఏం చేయాలో చూద్దాం.

RBI Interest is more than 8 percent for to beat inflation
నగదు
author img

By

Published : Nov 25, 2022, 4:06 PM IST

ధిక రాబడి ఆశించేవారు అధిక నష్టభయానికి సిద్ధంగా ఉండాలి. హామీతో కూడిన రాబడిని అందించే వాటిలో ఎఫ్‌డీలు ముందుంటాయి. కొన్ని బ్యాంకులు అత్యంత సురక్షితం అనే భావన ఉంటుంది. చాలామంది వీటిలో నగదును డిపాజిట్‌ చేసేందుకే ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి, ఇవి సహజంగానే తక్కువ వడ్డీనిస్తాయి. ప్రభుత్వ, పెద్ద ప్రైవేటు బ్యాంకులను గమనించినప్పుడు ఈ విషయం మనకు స్పష్టమవుతుంది. చిన్న బ్యాంకులు నగదు సమీకరణ కోసం కష్టపడుతుంటాయి. కాబట్టి, అధిక వడ్డీ రేటును అందించేందుకు ప్రయత్నిస్తాయి. ద్రవ్యోల్బణ ఒత్తిడి కొనసాగుతూ ఉంటే.. వడ్డీ మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోవద్దు.. ఆర్‌బీఐ గుర్తింపు పొందిన అన్ని షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల్లో రూ.5లక్షల వరకూ చేసిన డిపాజిట్లకు బీమా వర్తిస్తుంది. కాబట్టి, ఈ పరిమితి వరకూ వాణిజ్య బ్యాంకులన్నీ సురక్షితమే అని చెప్పుకోవచ్చు.

స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల్లో..
ప్రస్తుతం చాలా కొత్తతరం స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు (ఎస్‌ఎఫ్‌బీ) విపణిలో పోటీ పడుతూ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. దాదాపు అన్ని ఎస్‌ఎఫ్‌బీలు వివిధ కాల వ్యవధుల డిపాజిట్లపై 7.25శాతానికి మించే వడ్డీనిస్తున్నాయి. సూర్యోదయ ఎస్‌ఎఫ్‌బీ 999 రోజుల వ్యవధికి 8.01 శాతం వడ్డీనిస్తోంది. ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ 560 రోజుల డిపాజిట్‌పై 8.00శాతం ఇస్తుండగా, సీనియర్‌ సిటిజన్లకు 8.75 శాతం వడ్డీని చెల్లిస్తోంది. ప్రస్తుతం ఎఫ్‌డీ వడ్డీ రేట్లలో ఇది అత్యధికం అని చెప్పొచ్చు.

ప్రభుత్వ బ్యాంకుల్లో..
ప్రభుత్వ బ్యాంకులు ఎఫ్‌డీల రేట్లను నెమ్మదిగానే పెంచుతాయి. ఇప్పుడిప్పుడే కొన్ని ప్రభుత్వ బ్యాంకులు వడ్డీ రేటును వివిధ కాల వ్యవధులకు 7 శాతం వరకూ తీసుకొచ్చాయి. 599 రోజుల నుంచి 777 రోజుల ప్రత్యేక డిపాజిట్లను అందిస్తున్నాయి. 60 ఏళ్లు పైబడిన వారికి 50 బేసిస్‌ పాయింట్లను ప్రీమియంగా అందిస్తున్నాయి. రెండేళ్లకు మించిన డిపాజిట్లపై కొన్ని బ్యాంకులు 6.25శాతం వడ్డీనిస్తున్నాయి. 12 ప్రభుత్వ బ్యాంకులలో పది ఎంపిక చేసిన కాలపరిమితిపై 6.00 శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఈ ఏడాది డిపాజిట్ల వడ్డీ రేట్లు మరింత పెరగనున్న నేపథ్యంలో అన్ని బ్యాంకులూ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. పోస్టాఫీసు అయిదేళ్ల డిపాజిట్‌పైనా 6.70 శాతం వడ్డీ లభిస్తోంది. బ్యాంకుల వడ్డీ రేట్లు పెరుగుతున్నా, పోస్టాఫీసు డిపాజిట్‌ రేటు పెరగడం లేదు.

కార్పొరేట్లలో..
బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, గృహరుణ సంస్థలు కార్పొరేట్‌ ఎఫ్‌డీల రూపంలో మార్కెట్‌ నుంచి నగదును సమీకరిస్తాయి. వీటికి డిపాజిట్‌ బీమా వర్తించదన్న సంగతి ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం. సాధారణంగా బ్యాంకులతో పోలిస్తే కార్పొరేట్లు అధిక వడ్డీని చెల్లిస్తాయి. క్రెడిట్‌ రేటింగుల ఆధారంగా వీటిలో డిపాజిట్‌ చేయాలా? వద్దా? అనేది నిర్ణయించుకోవాలి. ఏఏఏ రేటింగ్‌ ఉన్న సంస్థలు 7.50శాతం వరకూ వడ్డీనిస్తున్నాయి. ఏఏ రేటింగ్‌ ఉన్నవి 8.00శాతం వరకూ చెల్లిస్తున్నాయి. వయోధికులకు 25 నుంచి 50 బేసిస్‌ పాయింట్ల వరకూ అధిక వడ్డీ లభిస్తుంది.

చిన్న ప్రైవేటు బ్యాంకుల్లో..
ప్రైవేటు బ్యాంకుల డిపాజిట్‌ రేట్లు వివిధ కాల వ్యవధులకు 6.00 శాతానికి మించే ఉన్నాయి. కొన్ని బ్యాంకులు సీనియర్‌ సిటిజన్లకు 8.25 శాతం వరకూ చెల్లిస్తున్నాయి. పెద్ద ప్రైవేటు బ్యాంకులూ ఇటీవల కాలంలో వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇప్పుడు వీటిలో చాలా వరకూ 6.50 శాతం వరకూ ప్రతిఫలాన్ని ఇస్తున్నాయి. ఇవి సాధారణంగా ప్రభుత్వ బ్యాంకులను అనుసరిస్తున్నట్లు మనం చూడొచ్చు. కొన్ని విదేశీ బ్యాంకులూ 7.25శాతం వరకూ వడ్డీనిస్తామని చెబుతున్నాయి.

డిపాజిటర్లు ఏమి చేయాలి?
ప్రస్తుతం వడ్డీ రేట్లు పెరుగుతున్న దశలో ఉన్నాం. ఇప్పుడే ఎఫ్‌డీ చేయాలా? మరికొంత కాలం వేచి చూడాలా అనేది చాలామందికి వస్తున్న సందేహం. కొన్నిసార్లు 7.50-8.00 శాతం వడ్డీ అంటే మంచి రాబడి కిందే చూడొచ్చు. ఈ వడ్డీ రేటుతో మీరు సంతృప్తి చెందితే.. డిపాజిట్‌ చేయొచ్చు. మీ దగ్గరున్న మొత్తాన్ని కొన్ని భాగాలుగా విభజించండి. దీర్ఘకాలిక వ్యవధికి కొంత మొత్తం డిపాజిట్‌ చేసి, రేట్లు పెరిగినప్పుడల్లా.. క్రమానుగుతంగా ఎఫ్‌డీలను చేయొచ్చు. ఈ వ్యూహం వల్ల భవిష్యత్‌లో వడ్డీ రేట్లు పెరిగినా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

- అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.