Health Insurance Fitness Benefits : కొవిడ్ తర్వాత ప్రజల జీవన విధానాల్లో పెను మార్పులు వచ్చాయి. ఆరోగ్య సంబంధిత విషయాలపై చాలా మంది దృష్టి సారించడం మొదలుపెట్టారు. దీనిలో భాగంగా వ్యాయామం చేయడం, రెగ్యులర్‌గా చెకప్‌లు చేయించుకోవడం, హెల్త్ ఇన్సూరెన్స్‌లు తీసుకోవడం వంటివి చాలా వరకు పెరిగాయి.
హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు.. వయసు, జీవన విధానం, ఆరోగ్య పరిస్థితులు లాంటివి చూసి ప్రీమియం ఇస్తాయి. శారీరకంగా ఫిట్‌గా ఉన్నవాళ్లకు ప్రీమియం ఇవ్వడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఎందుకంటే వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే వారికి ఖరీదైన వైద్య చికిత్సలు అవసరమయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఫలితంగా ఆ బీమా కంపెనీకి రిస్కు తక్కువగా ఉంటుంది. అందుకే అవి లోరిస్కు ఉన్న వారికి బీమా ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తాయి. ఆరోగ్య బీమా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఇది మనల్ని మెడికల్ ఎమర్జెన్సీల నుంచి కాపాడుతుంది. ప్రమాదాలు జరిగినప్పుడు, ఊహించని ఆరోగ్య దుష్పరిణామాలు ఎదురైనప్పుడు ఆర్థిక భరోసా కల్పించడం సహా ఖర్చులనూ తగ్గిస్తుంది. అయితే.. ఈ హెల్త్ ఇన్సూరెన్స్‌కు, ఫిట్‌గా ఉండటానికి ఒక సంబంధం ఉంది. దీని వల్ల ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి.
1. వెల్ నెస్ బెనిఫిట్
Health insurance Fitness benefits : వెల్ నెస్ బెనిఫిట్ అనేది పాలసీదారుల ఆరోగ్య సంరక్షణ కార్యకలాపాలను ప్రోత్సహించడానికి బీమా కంపెనీలు రూపొందించిన ఒక ప్రోగ్రామ్. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆదేశాల ప్రకారం.. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఫిజికల్ ఆక్టివిటీ మంచిగా ఉన్నవారికి రివార్డు పాయింట్లు ఇవ్వాలి. ఈ పాయింట్లు ప్రీమియం పునరుద్ధరించుకోవడం, డయాగ్నోస్టిక్, ఔట్ పేషంట్ ఫీజులు ఇతరత్రాల ఖర్చులను ఆదా చేసుకోవడానికి ఉపయోగపడతాయి. మార్కెట్లో చాలా రకాల ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉన్నాయి. వాటిలో పాలసీదారుడు ఇన్సూరెన్స్ తీసుకున్న ఏడాదిలో రోజుకి 10 వేల అడుగులు నడిస్తే 100 శాతం డిస్కౌంట్‌తో యాన్యువల్ ప్రీమియం సైతం ఉన్నాయి. ఈ యాక్టివిటీని స్మార్ట్ డివైజ్‌ల ద్వారా మొబైల్ ఫోన్లలో యాప్స్ ఇన్స్టాల్ చేసి మానిటరింగ్ చేస్తారు. ఇది కాకుండా.. జిమ్‌లో మెంబర్ షిప్ తీసుకోవడం లాంటివి ఇతర పారామీటర్లుగా పరిగణిస్తారు. పాలసీ నిబంధన ప్రకారం.. ఆరోగ్య లక్ష్యాలను సాధించే స్థాయిని అనుసరించి డిస్కౌంట్లు ఉంటాయి. ఈ కార్యక్రమం వల్ల పాలసీదారులతో పాటు బీమా కంపెనీలకూ లబ్ది చేకూరుతుంది.
2. ఆరోగ్యంగా ఉండటంలో సాయం చేస్తుంది
healthy habits : లక్ష్యాలను చేరుకోవడంలో, విజయం సాధించడంలో ఫిట్నెస్ కీలక పాత్ర పోషిస్తుంది. డాన్సింగ్, స్విమ్మింగ్, ఇతర యాక్టివిటీలు చేయడం వల్ల ఫిట్‌గా ఉండవచ్చు. వీటితో పాటు మీ ఆహారపు అలవాట్లలో తగిన మార్పులు చేర్పులు చేసుకోవడం, సరైన డైట్‌ని అనుసరించడం సైతం ముఖ్యమే.
ఇవీ చదవండి :