ETV Bharat / business

HDFC and ICICI Banks Starts UPI Now, Pay Later : 'యూపీఐ' వాడే వారికి గుడ్ న్యూస్.. అకౌంట్​లో డబ్బులు లేకున్నా చెల్లింపులకు ఓకే..! - యూపీఐ నౌ పే లేటర్ డబ్బులు లేకున్నా షాపింగ్

HDFC and ICICI Bank Starts UPI Now Pay Later Facility : మీరు ఎవరికైనా అర్జెంట్​గా డబ్బులు పంపించాలా? కానీ మీ బ్యాంక్​ అకౌంట్​లో సరిపడా డబ్బులు లేవని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే. మీ బ్యాంక్​ అకౌంట్​లో సరిపడా డబ్బులు లేకపోయినా.. ఇకపై సులువుగా యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. కానీ మీకు ఈ బ్యాంకులలో ఖాతా ఉండాలి. ఇంతకీ ఆ బ్యాంకులేంటి? డబ్బులు పంపే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

UPI Now Pay Later Facility
UPI Now Pay Later Facility
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 4:51 PM IST

HDFC and ICICI Banks Start UPI Credit Line Facility : సాధారణంగా మనం యూపీఐ (UPI) చెల్లింపులు చేయాలంటే కచ్చితంగా బ్యాంకు అకౌంట్​లో డబ్బు ఉండాల్సిందే. ఇకపై మీ ఖాతాలో తగినంత మనీ లేకపోయినా యూపీఐ యాప్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. అది ఎలా అని ఆలోచిస్తున్నారా? అవును నిజమే. ఇప్పటికే దేశవ్యాప్తంగా కొన్ని నెలల కిందట రూపే క్రెడిట్ కార్డు(RuPay Credit Cards) ద్వారా యూపీఐ చెల్లింపులను అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అలాగే దీని తర్వాత ఏటీఎం మెషిన్లలో డెబిట్ కార్డ్ లేకుండానే యూపీఐ ద్వారా డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు చర్యలు కూడా వేగవంతం అయ్యాయి. అయితే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన యూపీఐ నౌ పే లేటర్(UPI Now- Pay Later) సౌకర్యంతో.. కొన్ని బ్యాంకులు మీ అకౌంట్​లో డబ్బులు లేకున్నా యూపీఐ చెల్లింపులు చేసుకునే వీలును కల్పిస్తున్నాయి. ఇంతకీ ఏఏ బ్యాంకులు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి? యూపీఐ నౌ పే లేటర్ ద్వారా ఎలా డబ్బులు చెల్లించాలో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

HDFC and ICICI Banks Enabled Credit Facility on UPI : బ్యాంకులు తమ కస్టమర్లకు ఆఫర్ చేసేందుకు 'UPI Now Pay Later' సేవలకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల తన మద్ధతును ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే బ్యాంకులన్నీ యూపీఐ వినియోగదారులకు ముందస్తుగా క్రెడిట్​ లైన్స్​ జారీ చేసేందుకు అనుమతి కూడా ఇచ్చింది. దీంతో దేశంలో మొదటిసారిగా ప్రైవేటు రంగంలోని బ్యాంకింగ్ దిగ్గజాలైన హెచ్‌డీఎఫ్‌సీ(HDFC), ఐసీఐసీఐ(ICICI) బ్యాంకులు తమ ఖాతాదారులకు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. దీని ప్రకారం ఈ బ్యాంకుల కస్టమర్లు వారి బ్యాంక్ అకౌంట్​లో డబ్బు లేకున్నా యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వెసులుబాటును కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్​బీఐ తీసుకొచ్చిన 'యూపీఐ నౌ పే లేటర్' అనే కొత్త సదుపాయాన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి.

UPI ATM Cash Withdrawal Process : 'యూపీఐ ఏటీఎం'తో.. ఇకపై కార్డ్ లేకుండానే క్యాష్​ విత్​డ్రా!

UPI Now Pay Later Facility Available in HDFC and ICICI : యూపీఐ వినియోగదారులు ఇప్పటి వరకు తమ సేవింగ్స్ అకౌంట్, క్రెడిట్ కార్డ్ లేదా ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాను UPIకి లింక్ చేయడం ద్వారా మాత్రమే చెల్లింపులు చేసేవారు. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన సరికొత్త సౌకర్యం కింద కస్టమర్లకు నిర్దేశించిన పరిమితి వరకు వారు జీరో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ యూపీఐ చెల్లింపులు చేసుకునేందుకు హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంకులు అనుమతిస్తున్నాయి. అయితే దీనికోసం బ్యాంకులు తమ వినియోగదారులకు 'ముందస్తు ఆమోదం పొందిన క్రెడిట్ లైన్'ని అందిస్తాయి.

UPI Now Pay Later Latest Update : ప్రస్తుతం దేశంలో దీనిని అందుబాటులో ఉన్న పేమెంట్ యాప్స్ ద్వారా వారు లింక్ చేసిన బ్యాంక్ ఇచ్చిన సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. అదే విధంగా ఇలా వాడిన ఓవర్ డ్రాఫ్ట్ మెుత్తంపై ఎంత వడ్డీ వసూలు చేయాలనే నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI).. బ్యాంకులకే వదిలేసింది. ఈ నేపథ్యంలో మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్న ఖాతాదారులకు ఈ బ్యాంకులు ముందుగా UPI Now Pay Later సౌకర్యాన్ని అందించవచ్చని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన షరతులు బ్యాంకులను బట్టి మారే అవకాశం ఉందనే విషయం మీరు గమనించాలి.

How to be Safe from UPI Frauds: యూపీఐ మోసం.. తేడావస్తే అంతే.. ఇలా రక్షించుకోండి!

How to Use UPI Lite : మీరు 'యూపీఐ పిన్' ఎంటర్ చేయకుండానే.. డబ్బులు చెల్లించవచ్చు.!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.