ETV Bharat / business

ఆన్‌లైన్‌ గేమర్స్​కు షాక్!.. బెట్టింగ్​ మొత్తంపై 28 శాతం GST? - జీఎస్​టీ ఆర్థిక మంత్రుల సమావేశం నివేదిక

GOM Meeting On GST : క్యాసినో, గుర్రపు పందేలు, ఆన్​లైన్ గేమింగ్​పై 28 శాతం జీఎస్​టీ విధించాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. త్వరలో పూర్తి నివేదికను సిద్ధం చేసి జీఎస్​టీ మండలికి సమర్పించనుంది. ఈ అంశంపై తుది నిర్ణయం జులై 11 జరిగే సమావేశంలో జీఎస్​టీ మండలి తీసుకునే అవకాశం ఉంది.

GOM Meeting On GST
GOM Meeting On GST
author img

By

Published : Jul 6, 2023, 5:21 PM IST

GOM Meeting On GST : క్యాసినో, గుర్రపు పందేలు, ఆన్​లైన్ గేమింగ్​పై 28 శాతం జీఎస్​టీ విధించాలని మంత్రుల కమిటీ నిర్ణయానికి వచ్చింది. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్​ సంగ్మా నేతృత్వంలో బంగాల్, ఉత్తర్​ప్రదేశ్, గోవా, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర ఆర్థిక మంత్రులు సమావేశమై గురువారం ఈమేరకు ఏకాభ్రిప్రాయానికి వచ్చారు. ఈ సమావేశంలో చర్చించిన విషయాలపై పూర్తి నివేదిక సిద్ధం చేసి త్వరలో జీఎస్​టీ మండలికి సమర్పించనున్నారు.

GST on betting and Gambling : పన్నుల రేటును పరిశీలించడం.. దాంతో పాటు ఈ పన్నును గ్రాస్​ గేమింగ్​ రెవెన్యూ (సీజీఆర్​)పై విధించాలా, ప్లాట్​ఫామ్​ వసూలు చేసే ఫీజుపై విధించాలా లేదా క్యాసినో, గుర్రపు పందేలు, ఆన్​లైన్​ గేమింగ్​ ఆడేవారు పెట్టే పూర్తి ముఖ విలువ (ఫేస్​ వాల్యూ)పై విధించాలా అనే అంశాలపై మంత్రుల కమిటీ సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ అంశాలపై జులై 11న జరిగే జీఎస్​టీ మండలి​ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. క్యాసినో, గుర్రపు పందేలు, ఆన్​లైన్​ గేమింగ్​లు.. బెట్టింగ్​, జూదం యాక్షనబుల్​ క్లెయిమ్​(actionable claim)​ పరిధిలోకి వస్తాయా లేదా అన్న విషయంలో కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఈ సమావేశంలో.. బెట్టింగ్​ల పూర్తి ముఖ విలువపై 28 శాతం పన్ను విధించాలని బంగాల్​, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాలు అభిప్రాయపడ్డాయి. అయితే, ఫ్లాట్​ఫామ్​ ఫీజుపై 28 శాతం పన్ను విధించాలని గుజరాత్​ సూచించింది. కానీ గోవా మాత్రం క్యాసినోల గ్రాస్​ గేమింగ్​ రెవెన్యూ (సీజీఆర్​)పై 28 శాతం విధించి.. ఫ్లాట్​ఫామ్​ ఫీజుపై 18 శాతం జీఎస్​టీ వసూలు చేయాలని కోరింది. ఈ మూడింటిలో ఏదో ఒక దానిపై 28 శాతం పన్ను విధించాలని మేఘాలయ అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో పాటు జూదం, బెట్టింగ్​ల్లోని విజేతలకు చెల్లింపు చేయడానికి ప్రైజ్​మనీ పూలింగ్ చేసేలా 'ఎస్క్రో ఖాతా' (Escrow Account) కోసం ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలని.. దాని వల్ల పన్ను నిర్వహణ సులభతరం అవుతుందని అభిప్రాయపడింది.

క్యాసినో, గుర్రపు పందేలు, ఆన్​లైన్​ గేమింగ్​లు.. బెట్టింగ్​, జూదం యాక్షనబుల్​ క్లెయిమ్​ పరిధిలోకి వస్తాయని జీఎస్​టీ మండలి నిర్ణయం తీసుకుంటే.. సీజీఆర్​పై 28 శాతం పన్ను విధించాలని తమిళనాడు, తెలంగాణ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అయితే, ఈ విషయంలో సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం వల్ల.. తుది నిర్ణయాన్ని జీఎస్​టీ మండలికి వదిలేసింది మంత్రుల కమిటీ.

బెట్టింగ్‌ల పూర్తి విలువపై 28 శాతం జీఎస్​టీ విధించాలని గతేడాది జూన్​లో జీఎస్​టీ మండలికి సమర్పించిన నివేదికలో మంత్రుల కమిటీ సూచించింది. ఆ తర్వాత జరిగిన 47వ జీఎస్‌టీ మండలి విడుదల చేసిన నివేదికపై గోవా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మరికొన్ని రాష్ట్రాలు కూడా నివేదికను పునఃసమీక్షించాలని డిమాండ్ చేశాయి. దీంతో మంత్రుల కమిటీ సమర్పించిన నివేదికను మళ్లీ పరిశీలించాలని జీఎస్​టీ మండలి ఆదేశించింది. అనంతరం మంత్రుల కమిటీ మూడు సార్లు సమావేశమైంది. క్షేత్ర సందర్శనలు నిర్వహించి పరిశ్రమ సభ్యులతో చర్చలు జరిపింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.