Gold Rate Today: దేశంలో బంగారం ధర పెరిగింది. పది గ్రాముల బంగారం ధర రూ.200పెరిగి.. ప్రస్తుతం రూ.57,500వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.500 తగ్గుముఖం పట్టి.. ప్రస్తుతం రూ.71,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.57,500గా ఉంది. కిలో వెండి ధర రూ.71,000 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.57,500 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.71,000గా ఉంది.
- Gold price in Visakhapatnam: వైజాగ్‌లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,500గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,000 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.57,500 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.71,000గా కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1845.45 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 24.10 డాలర్ల వద్ద ఉంది.
పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.13,93,933 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.13,93,933 |
ఇథీరియం | రూ.1,03,405 |
టెథర్ | రూ.82.81 |
బైనాన్స్ కాయిన్ | రూ.21,136 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.84 |
మార్కెట్లు డీలా...
అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. 22 పాయింట్ల లాభంతో 61,316 వద్ద ట్రేడింగ్ ఆరంభించిన సెన్సెక్స్... కాసేపటికే నష్టాల్లోకి జారిపోయింది. ప్రస్తుతం 350 పాయింట్లు నష్టపోయి.. 60,944 వద్ద ట్రేడవుతోంది. అటు నిఫ్టీ సైతం నష్టాల్లో ఉంది. 101 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ.. 18,136 వద్ద కొనసాగుతోంది.
- సెన్సెక్స్ 30 సూచీలో సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
- టాటా స్టీల్, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, విప్రో, ఇన్ఫోసిస్, ఎంఅండ్‌ఎం, భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి మారకం..
డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.81 వద్ద ట్రేడవుతోంది.