Gold Rate Today : దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.52,200గా ఉంది. కేజీ వెండి ధర రూ.300 తగ్గి.. రూ.59,000 వద్ద కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.52,200గా ఉంది. కిలో వెండి ధర రూ.59,000 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.52,200 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.59,000గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.52,200గా ఉంది. కేజీ వెండి ధర రూ.59,000 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.52,200 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.59,000 వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1,669 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 19.40 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు.. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.15,67,904 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.15,67,904 |
ఇథీరియం | రూ.1,05,592 |
టెథర్ | రూ.82.31 |
బినాన్స్ కాయిన్ | రూ.22,333 |
యూఎస్డీ కాయిన్ | రూ.82.31 |
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 235 పాయింట్లకు పైగా లాభపడి ప్రస్తుతం 57,381 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ 62 పాయింట్లకు పైగా పెరిగి 17,045 దగ్గర కదలాడుతోంది. సెన్సెక్స్ టాప్ 30 సూచీల్లో ఐసీఐసీఐ, డా.రెడ్డి, ఎల్టీ, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్ నష్టాల్లో కొనసాగుతుండగా.. మిగతా యాక్సిక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాన్ ఫిన్జర్వ్, పవర్ గ్రిడ్ తదితర షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి: అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ బుధవారం తగ్గింది. ట్రేడింగ్ ప్రారంభంలో 14.35 పైసలు నష్టపోయి.. ప్రస్తుతం 82.35కు చేరింది.
ఇవీ చదవండి: దసరాకు జోరుగా అమ్మకాలు.. 5.4 లక్షల వాహనాలు విక్రయం!
క్యూ2లో టీసీఎస్ అదుర్స్.. భారీగా పెరిగిన ఆదాయం.. లాభం 8శాతం జంప్