Gold Rate Today : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.570 మేర పడిపోయింది. ప్రస్తుతం బంగారం రూ.52,440 పలుకుతోంది. వెండి ధర సైతం పడిపోయింది. కేజీ వెండి ధర రూ.900 పతనమై.. ప్రస్తుతం రూ.54,000 వద్ద ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.51,870గా ఉంది. కిలో వెండి ధర రూ.54,000 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.51,870 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.54,000గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,870గా ఉంది. కేజీ వెండి ధర రూ.54,000 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.51,870 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.54,000వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే?.. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1692.75 డాలర్లు పలుకుతోంది. ఔన్సు వెండి ధర 17.88 డాలర్ల వద్ద ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.
స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 362 పాయింట్ల నష్టంతో 58,834 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 98 పాయింట్లు నష్టపోయి 17,557 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.88 వద్ద ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
కాగా, అమెరికా సూచీలు మంగళవారం నష్టపోయాయి. ఆసియా-పసిఫిక్ సూచీలు ఈరోజు నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అమెరికా ఫ్యూచర్స్ సైతం ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలోనే సూచీలు అప్రమత్తంగా చలిస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ముడిచమురు ఉత్పత్తిలో కోత ఉంటుందని ఒపెక్+ కూటమి చెప్పినప్పటికీ.. ఆర్థిక మందగమన భయాలు ఆ ఆందోళనల్ని అధిగమించాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కిందకు దిగొచ్చాయి.
క్రిప్టోకరెన్సీల ధరలు.. బిట్‌కాయిన్ విలువ పడిపోయింది. ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ రూ.16,00,000 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.16,00,000 |
ఇథీరియం | రూ.1,30,500 |
టెథర్ | రూ.84.89 |
బినాన్స్ కాయిన్ | రూ.22,011 |