Gold Rate Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.240కిపైగా దిగొచ్చింది. మరోవైపు పసిడి దారిలోనే.. వెండి ధర సైతం రూ.488 వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.63,640గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.53,040గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.53,040 గా ఉంది. కిలో వెండి ధర రూ.63,640 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.53,040వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.63,640గా ఉంది.
- Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,040గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,640 వద్ద కొనసాగుతోంది.
- Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.53,040గా ఉంది. కేజీ వెండి ధర రూ.63,640వద్ద కొనసాగుతోంది.
స్పాట్ గోల్డ్ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగానూ ఔన్సు బంగారం 1,864 డాలర్లు పలుకుతోంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.27 డాలర్లుగా ఉంది.
ఇంధన ధరలు ఇలా.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.105.45, లీటర్ రూ. 96.71గా ఉంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.50, లీటర్ డీజిల్ రూ.104.75. వైజాగ్‌లో లీటర్ పెట్రోల్ రూ. 119.98గా ఉండగా, లీటర్ డీజిల్ రూ.105.63 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్ ధర రూ. 105.47గా ఉంది.
Cryptocurrency Price in India: క్రిప్టో కరెన్సీల్లో బిట్‌కాయిన్, ఇథీరియం, బినాన్స్ కాయిన్ విలువ క్రితం రోజుతో పోల్చితే భారీగా తగ్గింది. ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల ధరలు ఎలా ఉన్నాయంటే..
క్రిప్టోకరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.23,70,701.80 |
ఇథీరియం | రూ.1,78,238.68 |
టెథర్ | రూ.77.23 |
బినాన్స్ కాయిన్ | రూ.23,850.16 |
యూఎస్డీ కాయిన్ | రూ.81.57 |
ఇదీ చదవండి: రోజువారీ ఖర్చులు భారం.. 'బిట్‌కాయిన్' భారీ పతనం.. 6 నెలల్లో 50% డౌన్!