ETV Bharat / business

Freelancer Health Insurance : మీరు ఫ్రీలాన్సర్​గా పని​ చేస్తున్నారా?.. బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్​ ఎంచుకోండిలా! - ఫ్రీలాన్సర్ల కోసం ఆరోగ్య సంరక్షణ ప్రణాళికలు

Freelancer Health Insurance : ఉద్యోగం చేస్తూ రెగ్యులర్ ఆదాయం పొందేవాళ్లు, వ్యాపారవేత్తలు ఆరోగ్య బీమా చేయించుకుంటారు. మరి స్థిరమైన ఆదాయం లేని ఫ్రీలాన్సర్ల పరిస్థితి ఏమిటి? వీరు ఎలాంటి ఆరోగ్య బీమా తీసుకుంటే మంచిది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

freelancer-health-insurance-and-do-freelance-writers-need-insurance
ఫ్రీలాన్సర్ హెల్త్ ఇన్సూరెన్స్
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2023, 12:28 PM IST

Freelancer Health Insurance : కరోనా సంక్షోభం తర్వాత లైఫ్ ఇన్సూరెన్సులు చేయించుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఉద్యోగం చేసే వాళ్లు, వ్యాపార వేత్తలు తమ భవిష్యత్తు అవసరాల కోసం బీమా చేయించుకుంటారు. మరి స్థిరమైన ఆదాయం లేని ఫ్రీలాన్సర్ల సంగతి ఏంటి? "ఇండియాస్ గ్రోయింగ్ గిగ్ అండ్ ప్లాట్​ఫాం ఎకానమీ" పేరుతో నీతి ఆయోగ్ ఒక నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశ శ్రామిక శక్తిలో ఫ్రీలాన్సర్ల శాతం 4.1%కి పెరుగుతుందని అంచనా. ఇది 2018 ఆర్థిక సంవత్సరం లో 1.5%గా ఉంది.

ఫ్రీలాన్సింగ్ చేసేవారికి ఉద్యోగ భద్రత అనేది ఉండదు. కరోనా లాంటి పరిస్థితులు వస్తే వారి జీవితం ప్రశ్నార్థకమే. దీనికి తోడు ఏదైనా ఊహించని ఆర్థిక అత్యవసర పరస్థితి ఏర్పడితే ఏం చేయాలో తెలియని పరిస్థితి. అందుకే వీరు ఆరోగ్య బీమా తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

1. ఆరోగ్య ఖర్చుల నుంచి రక్షణ..

సాధారణంగా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే.. మన జేబులోని డబ్బులే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకవేళ సమయానికి చేతిలో డబ్బులు లేకపోతే.. పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అందుకే ఆరోగ్య బీమా కచ్చితంగా తీసుకోవాలి. అత్యవసర సమయాల్లో ఇది కచ్చితంగా అక్కరకు వస్తుంది.

2. వైద్య ఖర్చులకు భద్రతా వలయం..
అనుకోకుండా మనకు ప్రమాదాలు, తీవ్రమైన అనారోగ్యాలు సంభవించవచ్చు. ఇలాంటి సమయాల్లో ఆరోగ్య బీమా ఉంటే ఒక భద్రతా వలయంగా పనిచేస్తుంది. సమయానికి చేతిలో డబ్బులు లేకపోయినా వైద్య ఖర్చులు అన్నీ బీమా సంస్థ భరిస్తుంది. కొన్నిసార్లు మన సొంత డబ్బులు ఖర్చుపెట్టినా.. తరువాత పరిహారం లభిస్తుంది. అంటే కష్ట సమయంలో ఆర్థిక ఉపశమనం లభిస్తుంది.

3. నగదు రహిత క్లెయిమ్స్​
చాలా వరకు ఆరోగ్య బీమా పాలసీలు నగదు రహిత క్లెయిమ్​లను అందిస్తాయి. మనపై ఒకేసారి పెద్దమొత్తంలో ఆర్థిక భారం పడకుండా కాపాడతాయి.

4. ముందస్తు పరీక్షలు చేయించుకునే వెసులుబాటు..
అనేక ఆరోగ్య బీమా పాలసీలు ముందస్తు వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేయించుకోవడానికి అనుమతిస్తాయి. దీని వల్ల భవిష్యత్తులో వచ్చే వ్యాధుల ముప్పు నుంచి తప్పించుకోవడానికి, దాంతోపాటు సదరు ఆరోగ్య సమస్యలను నివారించుకోవడానికి వీలవుతుంది.

ఆరోగ్య బీమా తీసుకునే ముందు.. ఫ్రీలాన్సర్లు గమనించాల్సిన విషయాలు!

1. అవసరాలకు తగ్గ పాలసీ ఎంపిక..
మీ బడ్జెట్, అవసరాలను అంచనా వేసి అందుకు తగ్గ పాలసీ కొనుగోలు చేయాలి. ఇందుకోసం వివిధ పాలసీలను బాగా స్టడీ చేయండి. మీ స్థాయిలో తక్కువ ప్రీమియం, మంచి ప్రయోజనాలు అందించే పాలసీని ఎంచుకోండి.

2. నెట్​వర్క్ ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయా, లేదా అనేది చూసుకోండి.
మీ బీమా సంస్థ కవరేజీ నెట్​వర్క్ గురించి తెలుసుకోండి. ముఖ్యంగా నెట్​వర్క్​ ఆసుపత్రుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయా, మీకు అందుబాటులో ఉన్నాయా అనేది చూసుకోండి. ఇది అత్యవసర సమయంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సులభంగా వైద్య సహాయం పొందడానికి వీలు కల్పిస్తుంది.

3. ఖర్చులపై అవగాహన పెంచుకోండి..
పాలసీ ప్రీమియం, తగ్గింపులు, సహ చెల్లింపులు, పరిమితులు, కవరేజ్ పరిమితులతో సహా, ప్లాన్ ఖర్చుల గురించి పూర్తిగా తెలుసుకోండి. వాటిపై అవగాహన పెంచుకుంటే బాగుంటుంది.

4. మినహాయింపులు.. వెయిటింగ్ పీరియడ్లు..
పాలసీ మినహాయింపులు, వ్యాధి సంబంధిత నిబంధనలు, కవరేజీ వెయిటింగ్ పీరియడ్​ల గురించి తెలుసుకోండి. లేకుండా క్లెయిమ్ చేసుకునే సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

5. బీమా సంస్థ విశ్వసనీయత తెలుసుకోండి..
క్లెయిమ్స్ సెటిల్మెంట్ నిష్పత్తి (ఆమోదించిన క్లెయిమ్​ల శాతం), ఇన్స్యూర్డ్​ క్లెయిమ్స్​ నిష్పత్తి (క్లెయిమ్​లను సెటిల్ చేయడానికి ఉపయోగించే ప్రీమియంల నిష్పత్తి) లాంటి కీలక అంశాలను చూసుకోవాలి. దీని ద్వారా సదరు బీమా సంస్థ విశ్వసనీయత మీకు తెలుస్తుంది.

వాస్తవానికి ఫ్రీలాన్సర్లు తమ ఆరోగ్యంపైన మాత్రమే కాకుండా.. తమ కుటుంబ సభ్యల ఆరోగ్య విషయాలపైనా దృష్టి సారించాలి. ఇందుకోసం కచ్చితంగా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్​ను ఎంచుకోవాలి. దీని వల్ల ఫ్రీలాన్సర్లు కుటుంబాలకు ఆరోగ్య బీమా లభిస్తుంది. పైగా భవిష్యత్తులో మరింత బీమా కవరేజీ కావాలనుకుంటే.. సూపర్ టాప్-అప్ కవర్​ను కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది.

SBI General Insurance New Health Policy : సూపర్ హెల్త్ ఇన్సూరెన్స్​ పాలసీ.. అన్​లిమిటెడ్ రీఫిల్స్​.. 3X బెనిఫిట్స్​!

Best Post Office Insurance Schemes : 299 రూపాయలకే.. రూ.10లక్షల జీవిత బీమా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.