ETV Bharat / business

అమెరికాలో మరో బ్యాంకు మూత.. జేపీ మోర్గాన్​కు విక్రయం - us bank crash

అమెరికా బ్యాంకింగ్ రంగంలో మరో కుదుపు. ఆ దేశానికి చెందిన 14వ అతిపెద్ద బ్యాంకు మూతపడింది. ఆర్థికంగా పతనమైన ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకును.. జేపీ మోర్గాన్ ఛేస్ బ్యాంకుకు విక్రయిస్తున్నట్లు అమెరికా నియంత్రణ సంస్థలు వెల్లడించాయి.

first republic bank crisis
first republic bank crisis
author img

By

Published : May 1, 2023, 3:27 PM IST

అమెరికాలో మరో బ్యాంకు మూతపడింది. శాన్​ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసే 'ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకు' జేపీ మోర్గాన్ ఛేస్ బ్యాంకులో విలీనమైంది. ఫస్ట్ సిటిజన్ బ్యాంకు డిపాజిట్లు, ఆస్తులను జేపీ మోర్గాన్​కు విక్రయిస్తున్నట్లు అమెరికా నియంత్రణ సంస్థలు ప్రకటించాయి. అమెరికాలో రెండు నెలల వ్యవధిలో మూతపడిన మూడో బ్యాంకు ఇది. ఇప్పటికే సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంకులు పతనమై.. మూతపడ్డాయి. తొలి రెండు బ్యాంకుల ప్రభావం వల్లే ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకుపై తీవ్ర ఒత్తిడి పడింది. ఇన్వెస్టర్లు, ఖాతాదారుల్లో డిపాజిట్లకు భరోసా ఉండదన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. బ్యాంకు వడ్డీ రేట్లు సైతం అత్యంత తక్కువగా ఉండటం సైతం ఆందోళనకు కారణమైంది.

ఈ నేపథ్యంలోనే అమెరికా నియంత్రణ సంస్థలు ఆగమేఘాల మీద దిద్దుబాటు చర్యలు చేపట్టాయి. సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు ప్రారంభం కావడానికి ముందే పరిష్కారం కనుగొనేందుకు వారాంతం నుంచే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. చివరకు ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకును.. జేపీ మోర్గాన్ ఛేస్ బ్యాంకులో విలీనం చేయాలని నిర్ణయించాయి. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకుకు ఎనిమిది రాష్ట్రాల్లో 84 బ్రాంచీలు ఉన్నాయి. సోమవారం నుంచి ఇవన్నీ జేపీ మోర్గాన్ ఛేస్ బ్యాంకు శాఖలుగా పనిచేస్తాయని అమెరికా ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రకటించింది.

ఫెడరల్ రిజర్వ్ గణాంకాల ప్రకారం అమెరికాలోని అతిపెద్ద వాణిజ్య బ్యాంకుల్లో ఇది 14వ స్థానం సంపాదించింది. ఏప్రిల్ 13 నాటికి ఫస్ట్ రిపబ్లిక్​కు 229 బిలియన్ డాలర్ల ఆస్తులు, 104 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. సాధారణంగా ఈ బ్యాంకు.. సంపన్న వర్గాలకు, శక్తిమంతమైన వ్యక్తులకు లోన్లు ఇచ్చేది. ఫలితంగా ఈ బ్యాంకుకు రుణాల ఎగవేత సమస్య కూడా పెద్దగా ఉండేది కాదు. కానీ, సిలికాన్ వ్యాలీ, సిగ్నేచర్ బ్యాంకుల పతనం.. ఫస్ట్ రిపబ్లిక్​పై తీవ్ర ప్రభావం చూపింది. పతనమైన ఆ రెండు బ్యాంకుల్లోని డిపాజిట్లకు సైతం రక్షణ లేదు. ఫస్ట్ రిపబ్లిక్ సైతం తమ బ్యాంకులోని డిపాజిట్లకు బీమా కల్పించలేదు. దీంతో సిలికాన్ వ్యాలీ, సిగ్నేచర్ తరహాలోనే ఫస్ట్ రిపబ్లిక్ సైతం పతనమవుతుందేమోనన్న భయాలు మొదలయ్యాయి. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకు త్రైమాసిక ఫలితాలు ఈ భయాలను మరింత పెంచాయి. మూడు నెలల కాలంలో 100 బిలియన్ డాలర్లను డిపాజిటర్లు తమ బ్యాంకు నుంచి ఉపసంహరించుకున్నారని త్రైమాసిక ఫలితాల్లో ఫస్ట్ రిపబ్లిక్ వెల్లడించింది.

ఫలించని దిద్దుబాటు చర్యలు
అయితే, అమెరికాలోని 11 పెద్ద బ్యాంకులు కలిసి ఫస్ట్ రిపబ్లిక్​ను ఆదుకునేందుకు ప్రయత్నాలు చేశాయి. 30 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ఆ బ్యాంకు కోసం ప్రకటించాయి. తర్వాత కాస్త కోలుకున్నట్లే కనిపించినా.. పరిస్థితి క్రమంగా దిగజారింది. వెంటనే పరిస్థితిని మెరుగుపర్చేందుకు లాభాల్లోలేని ఆస్తులను విక్రయించింది ఫస్ట్ రిపబ్లిక్. సంపన్నులకు ఇచ్చే తక్కువ వడ్డీ రేట్ల లోన్లను నిలిపివేసింది. నాలుగోవంతు ఉద్యోగులను తొలగించుకుంటున్నట్లు 2022 చివర్లో ప్రకటించింది.

అయితే, ఈ చర్యలేవీ ఇన్వెస్టర్లలో భరోసా నింపలేకపోయాయి. త్రైమాసిక ఫలితాల తర్వాత బ్యాంకు ఉన్నతాధికారులెవరూ పెట్టుబడిదారులను, విశ్లేషకులను సంప్రదించలేదని సమాచారం. దీంతో బ్యాంకు షేర్ల విలువ పతనమవుతూ వచ్చింది. ఆస్తులు విక్రయించడం, కార్యకలాపాల నిర్వహణ కష్టం కావడం వల్ల.. బ్యాంకు తిరిగి లాభాల్లోకి వెళ్లడం కష్టమనే భావన ఇన్వెస్టర్లలో మొదలైంది. ఈ నేపథ్యంలోనే అమెరికా నియంత్రణ సంస్థలు ఫస్ట్ రిపబ్లిక్​ను.. జేపీ మోర్గాన్​కు విక్రయించాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.