ETV Bharat / business

డిసెంబర్ డెడ్​లైన్స్​ - గడువులోగా ఈ పనులన్నీ తప్పక పూర్తి చేయండి! - Indian Bank special FD deadline

Financial Deadlines In December 2023 In Telugu : డిసెంబర్​ నెలలో పలు ఫైనాన్సియల్​ డెడ్​లైన్స్ ఉన్నాయి. ముఖ్యంగా డిసెంబర్​ 31తో బ్యాంక్​ లాకర్ అగ్రిమెంట్, ఫ్రీ ఆధార్​ అప్​డేషన్​, ఎస్​బీఐ అమృత్​ కలశ్​, డీమ్యాట్​ నామినేషన్​ సహా పలు ఆర్థిక అంశాల గడువు ముగుస్తోంది. ఈ గడువులోగా ఈ పనులు పూర్తి చేసుకోకుంటే.. తరువాత ఇబ్బందిపడాల్సి వస్తుంది. కనుక వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

money deadlines in December 2023
Financial deadlines in December 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2023, 4:00 PM IST

Financial Deadlines In December 2023 : ఈ 2023 డిసెంబర్​ నెలలో కొన్ని కీలకమైన ఆర్థిక అంశాల గడువు ముగుస్తోంది. వాటిలో 8 అత్యంత ప్రధానమైన ఫైనాన్సియల్ డెడ్​లైన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. బ్యాంక్ లాకర్​ అగ్రిమెంట్ డెడ్​లైన్​ : రిజర్వ్​ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సవరించిన బ్యాంక్ లాకర్ ఒప్పందాలను దశలవారీగా అమలు చేయాలని ఆదేశించింది. ఇందుకు 2023 డిసెంబర్​ 31ని ఆఖరి గడువుగా నిర్ణయించింది. కనుక, ఎవరైతే 2022 డిసెంబర్​ 31 లేదా అంతకు ముందు బ్యాంక్​ లాకర్​ తీసుకున్నారో.. వారు కచ్చితంగా లేటెస్ట్ అగ్రిమెంట్​పై సంతకం చేసి, దానిని డిసెంబర్​ 31లోపు సమర్పించాల్సి ఉంటుంది.

2. ఆధార్ అప్​డేట్​కు చివరి తేదీ : గత పదేళ్లలో ఎవరైతే తమ ఆధార్​ వివరాలను అప్​డేట్ చేసుకోలేదో.. వారు డిసెంబర్​ 14 లోపు ఉచితంగా అప్​డేట్​ చేసుకోవడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) అవకాశం కల్పించింది. ఆధార్​ సంబంధిత మోసాలను నివారించడానికి ఇది తప్పనిసరి.

3. ఎస్​బీఐ అమృత్ కలశ్​ డెడ్​లైన్​ : భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్​ ఎస్​బీఐ.. అమృత్​ కలశ్​ స్పెషల్​ ఫిక్స్​డ్​ డిపాజిట్​ స్కీమ్​ గడువును డిసెంబర్​ 31 వరకు పొడిగించింది. ఈ ఫిక్స్​డ్​ డిపాజిట్​ స్కీమ్​లో 7.10 శాతానికి పైగా వడ్డీ రేటు అందిస్తారు. కనుక ఆశావహులు డిసెంబర్​ 31లోపు ఈ స్కీమ్​లో చేరాల్సి ఉంటుంది.

4. మ్యూచువల్ ఫండ్​, డీమ్యాట్​ నామినేషన్​ : డీమ్యాట్​, మ్యూచువల్ ఫండ్​ యూనిట్​ హోల్డర్లు కచ్చితంగా తమ ఖాతాలకు నామినీలను జత చేసుకోవాలి. ఇందుకోసం సెబీ 3 నెలల గడువు ఇచ్చింది. ఈ గడువు డిసెంబర్​ 31తో తీరిపోతుంది. ఒక వేళ ఈ చివరి తేదీలోపు ఎవరైనా తమ డీమ్యాట్, మ్యూచువల్ ఫండ్​లకు నామినీలను ఏర్పాటుచేసుకోకపోతే.. వారి ఖాతాలు స్తంభింపజేస్తారు.

5. ఇన్​యాక్టివ్​ యూపీఐ ఐడీస్​ : నేషనల్ పేమెంట్స్​ కార్పొరేషన్​ ఆఫ్ ఇండియా (NPCI) ఒక సంవత్సరంపాటు ఇన్​యాక్టివ్​గా ఉన్న యూపీఐ ఐడీలను, నంబర్​ను డీయాక్టివేట్ చేయాలని.. పేటీఎం, గూగుల్​ పే, ఫోన్​ పే లాంటి పేమెంట్​ యాప్​లను ఆదేశించింది. థర్డ్​ పార్టీ యాప్ ప్రొవైడర్లు, పేమెంట్​ సర్వీస్​ ప్రొవైడర్లు.. దీన్ని అమలు చేసేందుకు డిసెంబర్​ 31 వరకు గడువు విధించింది. కనుక యూజర్లు ఈ గడువులోపు తమ యూపీఐ ఐడీ ద్వారా పేమెంట్స్​ చేసి, వాటిని యాక్టివ్​గా ఉంచుకోవడం మంచిది.​

6. ఎస్​బీఐ హోమ్ లోన్ ఆఫర్​ : స్టేట్ బ్యాంక్​ ఆఫ్ ఇండియా ప్రస్తుతం గృహ రుణాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ముఖ్యంగా డిసెంబర్​ 31లోపు ఎవరైతే హోమ్ లోన్​ తీసుకుంటారో వారికి 65 బేసిస్ పాయింట్లు వరకు రాయితీ అందిస్తుంది. ఈ ప్రత్యేక రాయితీ వివిధ రకాల గృహ రుణాలకు వర్తిస్తుంది. కనుక ఆశావహులు ఎవరైనా ఉంటే.. వారు ఈ 2023 డిసెంబర్ 31లోపు ఎస్​బీఐ హోమ్​లోన్ కోసం అప్లై చేసుకోవడం మంచిది.

7. ఐడీబీఐ స్పెషల్ ఎఫ్​డీ : ఐడీబీఐ బ్యాంక్ రూ.2 కోట్లలోపు ఫిక్స్​డ్​ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించింది. అలాగే అమృత్ మహోత్సవ్ అనే ప్రత్యేక ఫిక్స్​డ్​ డిపాజిట్​ కాలవ్యవధిని 375 రోజులు నుంచి 444 రోజులకు పొడిగించింది. ఈ స్పెషల్ ఫిక్స్​డ్ డిపాజిట్లలో చేరడానికి ఆఖరు తేదీ డిసెంబర్ 31.

8. ఇండియన్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్​డీ : ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్​ అయిన ఇండియన్ బ్యాంక్​.. 'ఇండ్​ సూపర్​ 400', 'ఇండ్​ సుప్రీం 300' అనే రెండు స్పెషల్ ఫిక్స్​డ్ డిపాజిట్ స్కీమ్​ల గడువును డిసెంబర్​ 31 వరకు పొడిగించింది. కనుక ఆసక్తి ఉన్నవారు ఈ డిసెంబర్​ నెలాఖరులోగా ఈ స్కీమ్​ల్లో చేరాల్సి ఉంటుంది.

డిసెంబర్​ 1 నుంచి న్యూ సిమ్​ కార్డ్ రూల్స్ - ఉల్లంఘిస్తే రూ.10 లక్షలు పెనాల్టీ/ జైలు శిక్ష!

LIC నయా పాలసీ - జీవితాంతం ఆదాయం గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.