EPFO Extends Deadline For Higher Pension Option To Employers : అధిక పింఛనుకు సంబంధించి వివరాల అప్లోడ్ చేసేందుకు వేతన జీవులకు ఇచ్చిన గడువును మరికొద్ది రోజుల పాటు పొడగించింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO). మరో మూడు నెలల గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఉద్యోగులకు సూచించింది.
వాస్తవానికి సెప్టెంబర్ 30తో ఈ గడువు ముగియాల్సి ఉంది. కాకపోతే గడువు పెంచాల్సిందిగా ఎంప్లాయర్స్ అసోసియేషన్ నుంచి ఈఫీఎఫ్ఓకు వినతులు వచ్చాయి. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర కార్మిక శాఖ.. గడువు పెంపు నిర్ణయం తీసుకుంది. దీంతో వేతన వివరాలను ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేసేందుకు ఉద్యోగులకు మరింత సమయం లభించింది.
"అధిక పింఛను ఆప్షన్‌కు సంబంధించి పెన్షన్లు/ మెంబర్లకు వేతన వివరాలు అప్లోడ్ చేసేందుకు గడువు ఇవ్వాలని ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయర్స్ అసోసియేషన్ నుంచి మాకు వినతి అందింది. సెప్టెంబర్ 29 నాటికి వ్యాలిడేషన్ ఆఫ్ ఆప్షన్/ జాయింట్ ఆప్షన్‌కు సంబంధించి ఇప్పటికీ 5.52 లక్షల దరఖాస్తులు ఎంప్లాయర్స్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నాం" అని కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది.
గడువు తేదీని పలుమర్లు పొడగించిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ..
2022 నవంబర్ 4న అధిక పింఛనుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తొలుత ఉద్యోగులకు అధిక పింఛను దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఇందుకోసం ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి ఫిబ్రవరి 26-మే 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించారు. అనంతరం ఆ గడువును జూన్ 26 వరకు పొడిగించారు. తర్వాత మరో 15 రోజులు చివరి అవకాశంగా గడువు ఇచ్చారు. జులై 11 వరకు దరఖాస్తులను స్వీకరించారు. అప్పటి వరకు వ్యాలిడేషన్ ఆఫ్ ఆప్షన్/ జాయింట్ ఆప్షన్ కోసం మొత్తం 17.49 లక్షల దరఖాస్తులు అందినట్లు కేంద్ర కార్మిక శాఖ పేర్కొంది.
What Is Top Up Health Insurance Policy : హెల్త్ ఇన్సూరెన్స్ టాపప్‌తో మరింత ధీమా.. ఈ లాభాలు తెలుసా?