ETV Bharat / business

PF డబ్బులు తీయాలా? - ఇలా చేయకపోతే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది!

PF Money Withdrawal : చాలా మంది అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్​ డబ్బులు విత్​డ్రా చేసుకోవాలనుకుంటారు. కానీ.. కొందరు పీఎఫ్ క్లెయిమ్ చేస్తే.. రిజెక్ట్ అవుతుంది. మరి.. క్లెయిమ్ రిజక్ట్​ కావడానికి కారణాలేంటి? వాటిని ఎలా సరిదిద్దుకోవాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

EPF Claim
PF Money Withdrawal
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2023, 10:43 AM IST

EPF Claim Reject Reasons : ఉద్యోగులు నిబంధనలు ఫాలో అవుతూ.. పీఎఫ్ అకౌంట్లో నుంచి డబ్బులు విత్​డ్రా చేసుకోవచ్చు. మీరు చూపే కారణాలను బట్టి ఎంత శాతం నగదు విత్​డ్రా చేసుకోవచ్చనేది ఉంటుంది. అయితే.. కొన్ని సార్లు చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మీ ఈపీఎఫ్​ క్లెయిమ్ రిజక్ట్ కావొచ్చు. ఆ మిస్టేక్స్ ఏంటి? వాటిని ఎలా సవరించుకోవాలి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సరైన KYC పత్రాలు సమర్పించకపోవడం : మీ EPF క్లెయిమ్ రిజక్ట్ అవ్వడానికి.. సరైన KYC పత్రాలను సమర్పించకపోవడం ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కేవైసీ వివరాలు అసంపూర్తిగా, ఇన్​కరెక్ట్​గా ఉన్నా మీ క్లెయిమ్​ను ఈపీఎఫ్​ఓ తిరస్కరిస్తుంది. కాబట్టి.. కేవైపీ ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉండాలి.

UANని ఆధార్‌కి లింక్ చేయకపోవడం : మీరు ఆధార్​తో ఈపీఎఫ్​ఓ UAN లింక్ చేయకపోతే కూడా మీ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ఈ ప్రక్రియను ముందుగానే పూర్తిచేయాలి.

విత్​డ్రాయల్​ నియమాలు : ఈపీఎఫ్​ఓ నుంచి పీఎఫ్​ మనీ క్లెయిమ్ చేయాలంటే మీరు కనీసం 6 నెలలపాటు ఉద్యోగం చేసి ఉండాలి. దీంతోపాటు సరైన విత్​డ్రాయల్ ఫారం ఎంచుకోనప్పుడు కూడా పీఎఫ్ క్లెయిమ్ రిజక్ట్​ అవుతుందనే విషయం గుర్తుంచుకోవాలి.

సరైన సమాచారం ఇవ్వకపోయినా : మీరు క్లెయిమ్ చేస్తున్నప్పుడు ఇచ్చిన సమాచారం.. EPF డేటాబేస్‌లో నమోదు చేసిన వివరాలతో మ్యాచ్ కావాలి. ఏ చిన్న తేడా వచ్చినా.. మీ క్లెయిమ్ రిజక్ట్ అవుతుంది. కాబట్టి.. మీరు డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాక.. ఓసారి క్రాస్ చెక్ చేసుకోవాలి.

How to Check PF Balance in UMANG App : మీ పీఎఫ్​ అకౌంట్లో ఎంత డబ్బుంది..? సింపుల్​గా చెక్ చేసుకోండి..!

  • పుట్టినతేదీ మిస్‌మ్యాచ్ అయితే కూడా ఈపీఎఫ్ఓ క్లెయిమ్ తిరస్కరిస్తుంది. కాబట్టి.. ఆధార్‌లో ఉన్న మాదిరిగా డేట్ ఆఫ్​ బర్త్​ను ముందే అప్‌డేట్ చేసుకోవాలి.
  • మీ బ్యాంక్ అకౌంట్ వివరాలూ సరిగా ఉండాలి. వీటిల్లో ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్, బ్యాంక్ పేరు, బ్రాంచ్ డీటెయిల్స్ సరిపోలాలి.
  • బ్యాంకుల విలీనం కారణంగా వాటి పేరు లేదా IFSCలో ఏదైనా మారితే.. క్లెయిమ్ చేయకముందే ఈపీఎఫ్ఓ రికార్డుల్లో వాటిని సవరించుకోవాలి.
  • చివరగా మీరు సంస్థలో చేరిన తేదీ.. సంస్థ నుంచి బయటికి వచ్చిన తేదీ వంటి వివరాలు కూడా సరిగా నమోదు చేయాలి. వీటిల్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే సదరు సంస్థను సంప్రదించి డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలి.
  • ఇలా.. వివరాలన్నీ పర్ఫెక్ట్​గా ఉంటే మాత్రమే.. పీఎఫ్ క్లెయిమ్​ యాక్సెప్ట్​ అవుతుంది. లేదంటే.. రిజెక్ట్ కావడం పక్కా.

How Much Money You Can Withdraw from PF : ఉద్యోగంలో ఉండగానే పీఎఫ్ విత్​డ్రా చేసుకోవచ్చు... ఎంత శాతమో తెలుసా?

How to Link Aadhaar with UAN in Online : మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? వెంటనే ఈ పని చేయండి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.