EPF Advance For Marriage : మనకు ఎప్పుడు ఎలాంటి అవసరం ఏర్పడుతుందో చెప్పలేం. ఇలాంటి సందర్భంలో అక్కరకు వచ్చేదే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF). అనుకోని, అత్యవసర ఆర్థిక పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈపీఎఫ్ఓ.. నిబంధనలను అనుసరించి కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా ఇస్తుంది. అయితే ఇక్కడ గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఈ అడ్వాన్స్‌లు నాన్-రిఫండబుల్. కనుక ఈపీఎఫ్ మెంబర్లు తమ అవసరాలకు అనుగుణంగా.. చాలా జాగ్రత్తగా ఈపీఎఫ్ అడ్వాన్స్‌ల కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లై చేయండిలా!
How To Apply For EPF Advance : ఉద్యోగులు ఈపీఎఫ్ అడ్వాన్స్ కోసం.. ఫారమ్ 31ని తమ యజమానికి (కంపెనీ యాజమాన్యానికి) సమర్పించాలి. అప్పుడు మీ కంపెనీ లేదా యాజమాన్యం మీ దరఖాస్తును ధ్రువీకరించి.. ఆమోదం కోసం 'ఈపీఎఫ్ఓ'కు సమర్పించడం జరుగుతుంది. ఈపీఎఫ్ఓ కనుక మీ అభ్యర్థనను ఆమోదిస్తే.. అడ్వాన్స్ సొమ్ము మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
ఏయే అవసరాలకు ఈపీఎఫ్ అడ్వాన్స్ ఇస్తారు?
EPF Advance Reasons :
- ఆరోగ్య అత్యవసర పరిస్థితి (మెడికల్ ఎమర్జెన్సీ)
- విద్య
- వివాహం
- భూమి కొనుగోలు
- గృహాన్ని పునరుద్ధరించడం
- నిరుద్యోగిత
ఉద్యోగుల ఆరోగ్యం బాగాలేనప్పుడు చికిత్స కోసం, విద్య, వివాహం, భూమి కొనుగోలు, గృహ నిర్మాణం లేదా పునరుద్ధరణ కోసం ఈపీఎఫ్ అడ్వాన్స్ ఇస్తారు. ప్రైవేట్ ఉద్యోగులు కొన్ని సార్లు జాబ్ నుంచి తొలగించబడతారు. లేదా వారే స్వయంగా ఉద్యోగాన్ని వదిలేస్తారు. ఇలాంటి సందర్భాల్లో.. సదరు వ్యక్తులు ఈపీఎఫ్ అడ్వాన్స్ పొందడానికి అర్హులు అవుతారు.
వివాహం కోసం ఈపీఎఫ్ అడ్వాన్స్!
EPF Advance Eligibility : ఉద్యోగులకు ఈపీఎఫ్ మ్యారేజ్ (పెళ్లి) అడ్వాన్స్ కావాలంటే.. సదరు వ్యక్తి ఈపీఎఫ్ఓ మెంబర్‌గా 7 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి.
ఎవరి పెళ్లికి అడ్వాన్స్ ఇస్తారు?
- స్వయంగా ఉద్యోగి వివాహం చేసుకుంటే ఈపీఎఫ్ అడ్వాన్స్ ఇస్తారు.
- ఉద్యోగి కొడుకు లేదా కూతురు పెళ్లి కోసం ఈపీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు.
- ఉద్యోగి సోదరుడు లేదా సోదరి మ్యారేజ్ కోసం కూడా అడ్వాన్స్ అడగవచ్చు.
ఎంత ఇస్తారు?
EPF Advance Upper Limit : ఈపీఎఫ్ అకౌంట్లో ఉద్యోగి కొంత మొత్తం, యాజమాని కొంత మొత్తం సొమ్మును జమ చేస్తారు. దీనిలో ఉద్యోగి చెల్లించిన మొత్తం సహా, దానిపై అప్పటి వరకు వచ్చిన వడ్డీలో 50% సొమ్మును.. పెళ్లి కోసం అడ్వాన్స్‌గా పొందవచ్చు.
కండిషన్స్ అప్లై!
EPF Withdrawal Conditions :
- ఉద్యోగి ఈపీఎఫ్ఓ మెంబర్‌గా కనీసం 7 సంవత్సరాలు పూర్తిచేసుకుని ఉండాలి.
- వివాహం కోసమైనా లేదా విద్య కోసమైనా 3 సార్లు కంటే మించి ఈపీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవడానికి వీలుపడదు.
రూల్స్ మారుతాయి!
EPF Withdrawal Rules 2023 : ఈపీఎఫ్ విత్డ్రావెల్ ప్రాసెస్ అనేది నిర్దిష్ట నియమాలకు, షరతులకు లోబడి ఉంటుంది. అదే విధంగా ఈపీఎఫ్ అడ్వాన్స్ అమౌంట్ కూడా.. ఆయా ఆర్థిక అవసరాలకు అనుగుణంగా మారుతుంది. సాధారణంగా ఈపీఎఫ్ఓ రూల్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కనుక సరైన సమాచారం కోసం EPFO అధికారిక వెబ్సైట్లో చూడాలి. లేదంటే మీ ఎంప్లాయిర్ను అడిగి తెలుసుకోవాలి.
సోషల్ సెక్యూరిటీ!
వ్యవస్థీకృత రంగంలో పనిచేసే ఉద్యోగులకు ఆర్థిక భద్రతను, స్థిరత్వాన్ని అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ అనే సామాజిక భద్రతా పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిని ఉద్యోగుల భవిష్యత నిధి సంస్థ (EPFO) నిర్వహిస్తుంది. వాస్తవానికి ఈపీఎఫ్ఓ అనేది భారత కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన చట్టబద్ధమైన సంస్థ. కనుక ఉద్యోగుల సొమ్ముకు గ్యారెంటీ ఉంటుంది. వాస్తవానికి ఈపీఎఫ్ పథకం ద్వారా ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా నెలనెలా పెన్షన్ లభిస్తుంది. అలాగే అవసరమైతే ఒకేసారి మొత్తం సొమ్మును విత్‌డ్రా చేసుకోవడానికి కూడా వీలుంటుంది.
Bank Account OTP fraud : బ్యాంకింగ్ అలర్ట్.. ఓటీపీ కూడా కొట్టేస్తున్నారు! ఇలా చేస్తేనే సేఫ్