ETV Bharat / business

ముదురుతున్న వివాదం.. ట్విట్టర్​పై ఎలాన్​ మస్క్​ కౌంటర్ దావా - ఎలాన్ మస్క్ న్యూస్

Elon musk twitter deal: టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ట్విట్టర్​ మధ్య వివాదం ముదురింది. ట్విట్టర్​తో కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల ఆ సంస్థ కోర్టును ఆశ్రయించి ఎలాన్​ మస్క్​పై కొన్ని రోజుల క్రితం దావా వేసింది. తాజాగా ట్విట్టర్ దావాను సవాలు చేస్తూ మస్క్ కూడా కౌంటర్ దావా వేశారు.

elon musk twitter deal
ఎలాన్ మస్క్
author img

By

Published : Jul 30, 2022, 2:08 PM IST

Elon musk twitter deal: అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌, మైక్రో బ్లాగింగ్‌ సైట్ ట్విట్టర్ మధ్య లీగల్‌ వార్‌ మరింత ముదురుతోంది. ట్విట్టర్​తో కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ఆ సంస్థ కోర్టును ఆశ్రయించి టెస్లా అధినేతపై దావా వేశారు. తాజాగా ట్విట్టర్ దావాను సవాల్‌ చేస్తూ మస్క్ కూడా కౌంటర్‌ దావా వేశారు. ట్విట్టర్ దావాపై ఈ ఏడాది అక్టోబరులో విచారణ జరపనున్నట్లు డెలావర్‌ కోర్టు ఆదేశాలు వెలువరించిన కొద్ది గంటలకే మస్క్‌ ఈ దావా వేయడం గమనార్హం.

ట్విట్టర్​ను 44 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ.3.50 లక్షల కోట్లు) కొనుగోలు చేసేందుకు ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోనున్నట్లు ఎలాన్‌ మస్క్‌ ఇటీవల ప్రకటించారు. నకిలీ ఖాతాల సంఖ్యకు సంబంధించి తాను అడిగిన సమాచారాన్ని ఇవ్వడంలో ట్విట్టర్ విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ కోర్టును ఆశ్రయించింది. ఎలాన్‌ మస్క్‌ షరతులకు లోబడి ఒప్పందాన్ని అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డెలావర్‌లోని ఓ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఒప్పందంలో అంగీకరించినట్లుగా ఒక్కో షేరును 54.20 డాలర్ల వద్ద కొనుగోలు చేసేలా ఆదేశించాలని కోరింది.

ఈ పిటిషన్‌ను నిన్న స్వీకరించిన డెలావర్‌ కోర్టు.. అక్టోబరు 17 నుంచి 21 వరకు ఐదు రోజుల పాటు దీనిపై విచారణ జరపనున్నట్లు వెల్లడించింది. దీంతో మస్క్‌.. సామాజిక మాధ్యమంపై కౌంటర్‌ దావా వేశారు. అయితే ఈ దావాపై ట్విట్టర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో శుక్రవారం ట్విట్టర్ షేరు విలువ 41.61 డాలర్ల వద్ద ట్రేడ్‌ అయ్యింది. మస్క్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత ట్విట్టర్ షేర్లు భారీగా పతనమవ్వగా.. ఇప్పుడిప్పుడే మళ్లీ కోలుకుంటున్నాయి.

ఇవీ చదవండి: ఫారం 16 లేకున్నా ఐటీ రిటర్న్స్ దాఖలు​.. గడువు పొడిగిస్తారా?

ఆ చమురు సంస్థకు భారీ నష్టం.. మళ్లీ పెట్రో బాదుడు తప్పదా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.