ETV Bharat / business

'ఇలా చేస్తే డబ్బులే డబ్బులు'.. వాటిపై దృష్టి పెట్టాలంటున్న ఇన్ఫోసిస్!

డిజిటల్‌ టూల్స్‌ ఆటోమేషన్‌తో పాటు ఉద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంచినట్లయితే కంపెనీలు భారీ స్థాయిలో లాభాన్ని పొందొచ్చని ప్రముఖ టెక్​ సంస్థ ఇన్ఫోసిస్‌ నిర్వహించిన ఒక పరిశోధన పేర్కొంది. అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో 12 పరిశ్రమల్లో ఈ సర్వే జరిపారు. ఇంకా ఆ సర్వేలో ఏముందంటే?

author img

By

Published : Feb 12, 2023, 7:00 AM IST

infosys report
infosys report

డిజిటల్‌ టూల్స్‌ ఆటోమేషన్‌తో పాటు ఉద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంచినట్లయితే కంపెనీలు భారీ ఆదాయాన్ని; భారీ స్థాయిలో లాభాన్ని పొందొచ్చని ఇన్ఫోసిస్‌ నిర్వహించిన ఒక పరిశోధన పేర్కొంది. 'ఫ్యూచర్‌ వర్క్‌ 2023' పేరిట నిర్వహించిన ఈ సర్వేలో ఆధునిక పని ప్రదేశాల్లో హైబ్రిడ్‌ పనితీరు మరింత పెరగడం, డిజిటల్‌ ధోరణులను అందిపుచ్చుకోవడం వల్ల వైవిధ్యమైన, సృజనాత్మకమైన బృందాలను ఎలా పెంచుకోవాలన్నదానిపై విశ్లేషించారు. 1 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న పెద్ద కంపెనీలకు చెందిన 2,500 మంది సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లతో ఈ సర్వేను నిర్వహించారు. అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో 12 పరిశ్రమల్లో ఈ సర్వే జరిపారు. ఆ సర్వేలో ఏమంటోందంటే..

  • ఒక సులువైన, వైవిధ్యమైన డిజిటల్‌ పని నమూనాకు మారడం వల్ల లాభాల్లో 7.7 శాతం మేర; ఆదాయాల్లో 6.7 శాతం మేర వృద్ధి కనిపించొచ్చు.
  • డిజిటల్‌ టూల్‌ ఆటోమేషన్‌, నైపుణ్య వైవిధ్యీకరణ, ఉద్యోగుల్లో నైపుణ్యాభివృద్ధి వల్ల 1.4 లక్షల కోట్ల డాలర్ల(రూ.115 లక్షల కోట్లు) ఆదాయాన్ని; 282 బిలియన్‌ డాలర్ల(రూ.23.12 లక్షల కోట్లు) నికర లాభాన్ని పొందొచ్చు.
  • ఉద్యోగులను అట్టేపెట్టి ఉంచుకోవడం కీలకం. కంపెనీలు 2020 నుంచి 2022 మధ్య ఉద్యోగులను అట్టేపెట్టిఉంచుకోగలిగిన కంపెనీలు.. ఇతర కంపెనీలతో పోలిస్తే తమ ఆదాయాల్లో, లాభాల్లో దాదాపు అయిదో వంతును పెంచుకోగలిగాయి.
  • భవిష్యత్‌లో ఆఫీసులో కూర్చుని పనిచేయడం కంటే ఇంటి నుంచి పనిచేయడమే పెరుగుతుందని మూడింట రెండొంతుల మంది సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడ్డారు.
  • రిమోట్‌ వర్క్‌ అనేది ఎల్లప్పటికీ ఉండిపోతుందని.. ఇక ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడం ద్వారానే వ్యాపార వృద్ధిని పెంచుకోవచ్చని కంపెనీలు గ్రహించాయి.
  • రిమోట్‌ వర్కింగ్‌కు అనుమతులిస్తేనే.. సిబ్బందిని అట్టేపెట్టిఉంచుకోగలమని 65% మంది సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఏకీభవించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.