ETV Bharat / business

'నోట్ల రద్దు వల్ల చాలా ప్రయోజనాలు.. అందుకే పన్ను వసూళ్లు పెరిగాయి' - ట్యాక్స్ కలెక్షన్​ ఇండియా

పన్ను వసూళ్లలో పెరుగుదల నోట్ల రద్దు ఫలితమేనని ఆర్‌బీఐ ఎంపీసీ సభ్యురాలు ఆశిమా గోయల్‌ తెలిపారు. నోట్ల రద్దు వల్ల తాత్కాలిక సమస్యలు ఎదుర్కొన్నా.. దీర్ఘకాలంలో చాలా ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు.

tax collection in india
tax collection in india
author img

By

Published : Oct 23, 2022, 9:53 PM IST

నోట్ల రద్దు వల్లే పన్ను వసూళ్లు పెరుగుతున్నాయని ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ సభ్యురాలు ఆషిమా గోయల్‌ తెలిపారు. దీనివల్ల రానున్న రోజుల్లో 'ఎక్కువ మందిపై తక్కువ పన్ను' అనే ఆదర్శవంతమైన విధానానికి చేరుకుంటామని పేర్కొన్నారు. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడం, నల్లధనాన్ని అరికట్టడమే లక్ష్యంగా 2016, నవంబరు 8న కేంద్ర ప్రభుత్వం రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.

నోట్ల రద్దు వల్ల తాత్కాలిక సమస్యలు ఎదుర్కొన్నా.. దీర్ఘకాలంలో చాలా ప్రయోజనాలు ఉంటాయని గోయల్‌ తెలిపారు. ఆర్థిక వ్యవస్థలో డిజిటలైజేషన్‌ పెరిగిందన్నారు. పన్ను ఎగవేతలు తగ్గాయన్నారు. ఇవి ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు పన్ను వసూళ్లు 24 శాతం వృద్ధి చెంది రూ.8.98 లక్షల కోట్లకు పెరిగిన విషయం తెలిసిందే. మరోవైపు జీఎస్టీ వసూళ్లు వరుసగా ఏడు నెలలుగా రూ.1.40 లక్షల కోట్లకు పైగా నమోదవుతున్నాయి. సెప్టెంబరులో వార్షిక ప్రాతిపదికన 26 శాతం పెరిగి రూ.1.47 లక్షల కోట్లు వసూలయ్యాయి.

సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీపై మాట్లాడుతూ.. నగదు వినియోగాన్ని తగ్గించడం కోసమే సీబీడీసీని తీసుకొస్తున్నామని గోయల్‌ తెలిపారు. మరోవైపు ప్రస్తుత చెల్లింపుల వ్యవస్థకు ఇది అదనం మాత్రమేనని.. వాటి స్థానంలో ప్రత్యామ్నాయం మాత్రం కాదని స్పష్టం చేశారు. త్వరలోనే డిజిటల్‌ రూపాయి (ఇ-రూపీ/e₹)ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తేనున్నట్లు ఆర్‌బీఐ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇస్తూ.. చెల్లింపుల వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించేందుకు, అక్రమ నగదు చెలామణీని అరికట్టేందుకు 'డిజిటల్‌ రూపాయి' ప్రతిపాదనను ఆర్‌బీఐ చేసింది. 'సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)'గా వ్యవహరించే ఇ-రూపీపై కాన్సెప్ట్‌ నోట్‌(నమూనా పత్రం)ను ఆర్‌బీఐ ఇటీవల విడుదల చేసింది.

వాణిజ్య లోటు పెరుగుతుండడంపై స్పందిస్తూ.. ఎక్స్ఛేంజ్‌ రేటు తగ్గింపు, మొత్తంగా గిరాకీని తగ్గేలా చర్యలు తీసుకోవడం.. లోటును అదుపులోకి తీసుకురావడానికి ఉన్న స్వల్పకాలిక మార్గాలని గోయల్‌ సూచించారు. దీర్ఘకాలంలో వంటనూనెలు, చమురు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలన్నారు. అలాగే ఎగుమతుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సెప్టెంబరులో వాణిజ్య లోటు 26.72 బిలియన్‌ డాలర్లకు పెరిగిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఎగుమతులు 3.52 శాతం తగ్గి 32.62 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

ఇవీ చదవండి: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. లాభాల చిచ్చుబుడ్లు ఇవే!

పండగ వేళ.. సిరులు నిండుగా.. దీపావళి ఆర్థిక పాఠాలు నేర్చుకుందామా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.