Common Reasons to Reject the Health Insurance Claim: ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకుని.. చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నారు. అయితే.. పాలసీ తీసుకునే సమయంలో కొందరు కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. దీంతో.. పాలసీ యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. పూర్తి స్థాయిలో బెనిఫిట్స్ పొందలేకపోతున్నారు. మరికొందరికి రూపాయి కూడా రావట్లేదు. మరి.. ఆ తప్పులు ఏంటి? బీమా క్లెయిమ్ రిజెక్ట్ కావడానికి కారణాలేంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
పాలసీ నిబంధనలు : జనాల్లో చాలా మందికి పాలసీ పేరు.. దానివల్ల ఒనగూరే ప్రయోజనం మాత్రమే తెలుసు. కానీ.. టర్మ్స్ అండ్ కండీషన్స్ గురించి మాత్రం తెలియదు. కొందరికి నిబంధనలను సరిగా చదవరు.. మరికొందరు మధ్యవర్తులు చెప్పిన సగం సగం విషయాలు తెలుసుకొని పాలసీ తీసుకుంటారు. చివరలో.. బీమా సంస్థ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తే లబోదిబోమంటారు. ఈ పరిస్థితి రావొద్దంటే ముందుగా రూల్స్ క్లియర్‌గా చదవాలి.
దాచకూడదు : మరికొందరు ముందు నుంచి ఉన్న వ్యాధిని దాచిపెట్టి పాలసీ తీసుకుంటారు. ఆ తర్వాత అసలు విషయం బయటపడి ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయితే బాధపడతారు. అందుకే.. అప్పటికే ఆరోగ్య సమస్యలు ఉంటే.. ముందుగానే ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పాలి. అప్పుడు మీరు ఎలాంటి పాలసీ తీసుకుంటే బాగుంటుందో వారు సలహా ఇస్తారు. పాలసీ క్లెయిమ్ సమయంలోనూ ఎలాంటి సమస్యా ఉండదు. ఇలా కాకుండా.. మీ సమస్యను దాచిపెట్టి పాలసీ తీసుకుంటే.. క్లెయిమ్ రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. దీనిపై లీగల్‌గానూ పోరాడలేరు.
బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలా? ఈ సింపుల్ టిప్స్ పాటించండి!
వెయిటింగ్ పీరియడ్ : మీరు ఒక పాలసీ తీసుకున్న తర్వాత వెంటనే అమల్లోకి రాకపోవచ్చు. కొన్ని పాలసీలు ఒకటి నుంచి 4 సంవత్సరాలు గడిచిన తర్వాత గానీ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. దీనినే "వెయిటింగ్ పీరియడ్" అంటారు. ఈ సమయం పూర్తయ్యే వరకూ.. ఆయా అనారోగ్యాలకు ట్రీట్మెంట్ కోసం మీరు క్లెయిమ్ చేసుకోలేరు. కిడ్నీ, పార్కిన్సన్స్, అల్జీమర్స్, HIV వంటివి రోగాలు ఇందులో ఉంటాయి. అందువల్ల వెయిటింగ్ పీరియడ్ గురించి ముందుగానే తెలుసుకుని.. ఓకే అనుకుంటేనే పాలసీ తీసుకోండి.
బిల్లులు జాగ్రత్త : మీ పాలసీలో క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం ఉండేలా చూసుకుంటే మంచిది. అదే సమయంలో చికిత్స సమయంలో ట్రీట్మెంట్కు సంబంధించిన అన్ని బిల్లులనూ జాగ్రత్త చేయండి. వాటిని బీమా కంపెనీ ఎప్పుడైనా అడగొచ్చు. క్లెయిమ్ సమయంలో హాస్పిటల్ బిల్స్, డిశ్చార్జ్ ఫారమ్, పేషెంట్ రికార్డ్‌లను సక్రమంగా జతచేస్తే మీ క్లెయిమ్‌ను ఎవరూ తిరస్కరించలేరు.
కస్టమర్ కేర్‌తో మాట్లాడండి: కొన్నిసార్లు మనం తీసుకోవడానికి.. ఏజెంట్లు కొన్ని విషయాలు దాచి పెడతారు. ఆ తర్వాతగానీ మోసపోయామనే విషయం అర్థం కాదు. అందుకే.. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కస్టమర్ కేర్‌తో మాట్లాడాలి. సందేహాలన్నీ పూర్తిగా తీరిన తర్వాతనే పాలసీ తీసుకోండి.
హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ - ఈ విషయాలు తెలుసా?
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారా?.. ఈ విషయాలు మస్ట్‌గా తెలుసుకోండి!
iShield insurance : ఒకే పాలసీతో జీవిత, ఆరోగ్య బీమాలకు గ్యారెంటీ.. ఆ పథకం ఏమిటో తెలుసా?