ETV Bharat / business

గుడ్​న్యూస్​.. 'చిన్న మొత్తాల' వడ్డీ రేట్లు పెంపు.. ఈ స్కీమ్​లపైనే.. - పబ్లిక్​ ప్రావిడెంట్ ఫండ్​ స్కీమ్​

2023 ఏప్రిల్‌-జూన్‌లో ప్రారంభమయ్యే తొలి త్రైమాసికానికి చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను కేంద్రం సవరించింది. పలు రకాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను 0.7 శాతం వరకూ పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

small savings interest rates
small savings interest rates
author img

By

Published : Apr 1, 2023, 7:17 AM IST

చిన్న మొత్తాల పథకాల్లో పొదుపు చేసుకునే వారికి కేంద్రం ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్​-జూన్​ తొలి త్రైమాసికానికి చిన్నమొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను సవరించింది. దీంతో సీనియర్‌ సిటిజన్ల పొదుపు పథకాలు, సుకన్య సమృద్ధి యోజన వంటి పలు పొదుపు పథకాల వడ్డీ రేట్లు మారనున్నాయి. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను 70 బేసిక్‌ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు తెలిపింది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరోవైపు పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, సాధారణ సేవింగ్స్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లలో ఎలాంటి సవరణలు చేయడంలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో విడుదల చేసింది.

మూడు నెలలకోసారి సవరణ
నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌, పబ్లిక్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌, కిసాన్‌ వికాస్‌ పత్ర, సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రతి మూడు నెలలకోసారి కేంద్రం వడ్డీ నిర్ణయిస్తుంది. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ ప్రస్తుతం ఏడు శాతం వడ్డీ ఇస్తుంది. తాజా సవరణల ద్వారా ఏప్రిల్‌ 1 నుంచి 7.7 శాతం వడ్డీ ఇవ్వనున్నారు. సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్ స్కీమ్‌ వడ్డీ రేటును 8 శాతం నుంచి 8.2 శాతానికి పెంచింది కేంద్రం.

దీంతో పాటుగా మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌పై వడ్డీని 0.3 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది ఆర్థిక శాఖ. కిసాన్‌ వికాస్‌ పత్ర వడ్డీ రేటును 7.2 శాతం నుంచి 7.5 శాతానికి పెంచింది. మెచ్యూరిటీ అయ్యే నెలల కాలపరిమితిని 120 నుంచి 115కి తగ్గించింది. ఏడాది కాలపరిమితితో డిపాజిట్‌ వడ్డీ రేటును 6.6 శాతం నుంచి 6.8 శాతానికి, రెండేళ్ల డిపాజిట్‌ వడ్డీ రేటును 6.8 శాతం నుంచి 6.9 శాతానికి, మూడేళ్లు డిపాజిట్‌కు 6.9 శాతం నుంచి 7 శాతానికి సవరించింది. ఐదేళ్ల కాలపరిమితి ఉన్న డిపాజిట్​ వడ్డీరేటును 7 శాతం నుంచి 7.5 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది ఆర్థిక శాఖ. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్‌పై 5.8 శాతం నుంచి 6.2 శాతానికి పెంచింది. సుకన్య సమృద్ధి యోజన పథకానికి ప్రస్తుతం 7.6శాతం వడ్డీ ఇస్తుండగా, ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 8.0శాతం ఇవ్వనున్నట్లు కేంద్ర వెల్లడించింది.

పథకం

ప్రస్తుత వడ్డీ రేట్లు

(01.01.2023 నుంచి 31.03.2023)

కొత్త వడ్డీ రేట్లు

(01.04.2023 నుంచి 30.06.2023)

సేవింగ్స్​ డిపాజిట్​ 4.0 4.0
ఏడాది కాలపరిమితి డిపాజిట్​ 6.6 6.8
మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్​ 6.8 6.9
ఐదేళ్ల కాలపరిమితి డిపాజిట్​ 6.9 7.0
ఐదేళ్ల రికరింగ్​ డిపాజిట్​ 5.8 6.2
సీనియర్ సిటిజన్​ సేవింగ్స్​ సర్టిఫికెట్​ 8.0 8.2
నెలవారీ ఇన్​కమ్​ అకౌంట్ స్కీమ్​ 7.1 7.4
నేషనల్​ సేవింగ్స్​ సర్టిఫికేట్​ 7.0 7.7
పబ్లిక్​ ప్రావిడెంట్ ఫండ్​ స్కీమ్​ 7.1 7.1
కిసాన్​ వికాస్​ పత్ర 7.2 7.5
సుకన్య సమృద్ధి యోజన 7.6 8.0

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.