ETV Bharat / business

Car Loan Precautions : కార్​ లోన్ కావాలా?.. ఈ టిప్స్​ పాటిస్తే తక్కువ వడ్డీతో.. లోన్ గ్యారెంటీ! - లోన్​ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Car Loan Precautions : పండుగ వేళ కొత్త కారు కొందామని అనుకుంటున్నారా? బ్యాంక్​ లోన్​ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ఈ ఆర్టికల్​లో తెలిపిన అంశాలను జాగ్రత్తగా ఆచరణలో పెడితే.. తక్కువ వడ్డీకే వెహికల్​ లోన్ వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాలు మీ కోసం.

car-loan-tips-and-tricks
car-loan-precautions
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 4:49 PM IST

Car Loan Precautions : పండగల వేళ కొత్త కారు కొనాలని చాలా మంది అనుకుంటారు. వాహన సంస్థలు కూడా ఈ సమయంలోనే ఎన్నో కొత్త మోడళ్లను తీసుకువస్తాయి. బ్యాంకులు కూడా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో లోన్స్ అందిస్తూ.. కొనుగోలుదారులను ప్రోత్సహిస్తుంటాయి. ఇలాంటప్పుడే.. కొత్త కారు కొనేందుకు రుణం తీసుకునేవారు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అవేమిటో చూద్దాం..

వాస్తవానికి నేటి కాలంలో కారు రుణం తీసుకోవడానికి పెద్దగా ఇబ్బందులేమీ ఉండటం లేదు. నచ్చిన కారు కొనడానికి వెళ్తే చాలు.. అక్కడున్న సిబ్బందే అన్ని విషయాలు చూసుకుంటున్నారు. అయినప్పటికీ మనకు కూడా కారు లోను విషయంలో కొంత అవగాహన ఉండితీరాలి.

మీ బ్యాంకును అడగండి..
కారులోను తీసుకునే ముందు.. మీ శాలరీ అకౌంట్ ఉన్న బ్యాంకును సంప్రదించండి. మీ ఆదాయం, క్రెడిట్‌ స్కోరు ఆధారంగా సదరు బ్యాంక్ మీకు రుణం మంజూరు చేసే అవకాశం ఉంటుంది. అంతకంటే ముందు ఒకసారి నెట్‌బ్యాంకింగ్‌, బ్యాంక్‌ యాప్‌ను సైతం చెక్​ చేసుకోండి. అవసరమైతే బ్యాంకు శాఖకు వెళ్లేందుకు ప్రయత్నించండి. మీకు ముందే రుణం మంజూరైతే కారు కొనడం తేలికవుతుంది. కేవలం ఒకటి రెండు ఓటీపీలతో లోన్​ ప్రక్రియ పూర్తయిపోతుంది. అనంతరం కారు డీలర్‌ వివరాలను బ్యాంకు అధికారులకు అందిస్తే సరిపోతుంది. ఈ మధ్యకాలంలో చాలా షోరూంల్లో బ్యాంకు ప్రతినిధులు ఉంటున్నారు. కనుక, వారిని సంప్రదించినా పని తేలికగా పూర్తవుతుంది.

రాయితీలను చూడండి..
మీకు ఖాతా ఉన్న బ్యాంకులో.. వాహన రుణాలపై అధిక వడ్డీ రేటు ఉంటే.. మీరు మరో బ్యాంకు లోన్​ కోసం ప్రయత్నించండి. పండగల వేళ చాలా బ్యాంకులు ప్రత్యేక రాయితీలను అందిస్తున్నాయి. పరిశీలనా రుసుము లేకుండానే, తక్కువ వడ్డీ రేటుతో రుణాలు మంజూరు చేస్తున్నాయి. కనుక ఇలాంటి ఆఫర్లను ఒకసారి చెక్​ చేయండి. బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడండి. పూర్తి వివరాలు తెలుసుకున్నాకే వారితో ఓ ఒప్పందానికి రండి.

ఇప్పటికే రుణాలు ఉంటే..
వెహికల్​ లోన్​ తీసుకున్న తరువాత.. చెల్లించాల్సిన వడ్డీకి ఎలాంటి ప్రత్యేక రాయితీలు ఇవ్వడం జరగదు. అయితే ఇప్పటికే మీకు హోమ్​లోన్ లాంటివి ఉంటే, వాటిపై టాపప్‌ తీసుకునే వీలుందా, లేదా అనే విషయాన్ని పరిశీలించండి. వెహికల్ లోన్​తో పోలిస్తే వీటికి తక్కువ వడ్డీ రేటు ఉంటుంది. ఈ రుణాలు మీ ఆర్థిక భారాన్ని కాస్త తగ్గిస్తాయి. కనుక లోన్​ అమౌంట్​ త్వరగా తీర్చేసేందుకూ వీలు ఏర్పడుతుంది.

క్రెడిట్​ స్కోరు మాటేమిటి?
కారు లోన్​ కోసం వెళ్లే ముందు ఒకసారి మీ క్రెడిట్‌ స్కోరును తెలుసుకోండి. 750 పాయింట్లు లేదా అంతకంటే ఎక్కువ స్కోరున్న వారికి రుణాలు సులభంగా లభిస్తాయి. స్కోరు తగ్గితే వడ్డీ రేటు ఎక్కవగా ఉండే అవకాశం ఉంది. ముందుగానే క్రెడిట్‌ స్కోరును తెలుసుకున్నట్లయితే.. చివరి నిమిషంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. మీ స్కోరు మరీ తక్కువగా ఉంటే మాత్రం లోన్​ వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది.

చిన్న అప్పులను తీర్చేయండి..
కారు లోన్​ తీసుకున్న వెంటనే ఈఎంఐ స్టార్ట్​ అవుతుంది. కనుక కార్డు బిల్లులు, పర్సనల్​ లోన్ లాంటివి ఉంటే వీలైనంత వరకు తీర్చేయడం మేలు. లేకపోతే మీ నెలవారీ బడ్జెట్‌పై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. చిన్న రుణాలు అధికంగా ఉంటే.. అనుకున్నంత లోన్​ బ్యాంకులు మంజూరు చేయకపోవచ్చు. కనుక సాధ్యమైనంత వరకూ వీటిని వదిలించుకోవడమే ఉత్తమం.

అన్ని పత్రాలూ సిద్ధంగా..
బ్యాంకు నుంచి రుణం పొందేందుకు కొన్ని పత్రాలు అవసరం అవుతాయి. ముఖ్యంగా ఆదాయం, వ్యక్తిగత వివరాలు, చిరునామా, ఇతర ధ్రువీకరణ పత్రాలను రెడీగా ఉంచుకోవాలి. రెండేళ్ల ఐటీ రిటర్నులు, 3-6 నెలల వేతనం వివరాలను బ్యాంకు అధికారులు అడగవచ్చు. వ్యాపారులైతే చెల్లించిన జీఎస్‌టీ వివరాలను అడగవచ్చు. అయితే మీరు కచ్చితంగా.. అవసరమైనంత మేరకే రుణాన్ని తీసుకోవడం ఉత్తమం. అప్పుడే మీపై వడ్డీ భారం తగ్గుతుంది.

Post Office Vs SBI Vs HDFC Interest Rates : పోస్టాఫీస్/ఎస్​బీఐ/హెచ్​డీఎఫ్​సీ.. రికరింగ్ డిపాజిట్​కు ఏది బెటర్..?

Facts About No Cost EMI : పండగ సీజన్​.. ​నో-కాస్ట్‌ EMIతో ఐటమ్స్ కొంటారా?.. ఈ '7' విషయాలు పక్కాగా తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.