ETV Bharat / business

'బైజూస్​ వల్ల భారత్​కు భారీగా ఎఫ్​డీఐలు.. వారందరికీ ఉద్యోగాలు!' - బైజూస్​ కార్యాలయంపై ఈడి దాడులు

Byjus ED Raid : దేశంలో మిగతా కంపెనీలు, స్టార్టప్​ల కంటే ఎక్కువ ఎఫ్​డీఐలను బైజూస్​ తీసుకువచ్చిందని సంస్థ సీఈఓ రవీంద్రన్​ తెలిపారు. అనేక మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. చట్టపరంగా అన్ని నింబంధనలను సంస్థ పాటించిందని స్పష్టం చేశారు. బైజూస్​ కార్యాలయాల్లో, తన నివాసంలో ఈడీ సోదాల నేపథ్యంలో రవీంద్రన్​ ఈమేరకు స్పందించారు.

byjus-ed-raid-byjus-ceo-ravindran-responce-ofter-ed-rids
బైజూస్ సీఈవో రవీంద్రన్
author img

By

Published : Apr 30, 2023, 4:05 PM IST

Byjus ED Raid : ప్రముఖ ఎడ్యూటెక్​ సంస్థ బైజూస్ కార్యాలయాలు, సీఈఓ నివాసంలో ఈడీ సోదాల నేపథ్యంలో ఆ సంస్థ అధిపతి రవీంద్రన్ స్పందించారు. ఇతర స్టార్టప్‌లు, కంపెనీల కంటే​ ఎక్కువ ఎఫ్​డీఐలను.. బైజూస్ దేశానికి తీసుకువచ్చిందని రవీంద్రన్​ చెప్పారు. అందుకు సంబంధించిన అన్ని నిబంధనలను సంస్థ పాటిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సంస్థ ఉద్యోగులకు రవీంద్రన్​ లేఖలు రాశారు.

భారత దేశంలో అత్యంత విలువ అయిన అంకుర సంస్థ బైజూస్ అని రవీంద్రన్ చెప్పారు. ఒకప్పుడు 22 బిలియన్​ డాలర్లు విలువైన స్టార్టప్​గా గ్లోబల్​ ఇన్వెస్టర్స్​ అయిన జనరల్ అట్లాంటిక్, బ్లాక్‌రాక్, సీక్వోయా క్యాపిటల్ వంటి వాటిని తమ సంస్థ ఆకర్షించిందని గుర్తు చేశారు. "70 కంటే ఎక్కువ ఇంపాక్ట్ ఇన్వెస్టర్లు మాకు నిధులు సమకూరుస్తున్నారు. వారంతా ఎంతో సంతృప్తికరంగా సంస్థలో పెట్టుబడులు పెడుతున్నారు. ఫెమా (ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్) నిబంధనలకు లోబడే ఈ కార్యకలపాలన్నీ జరుగుతున్నాయి. అధికారులు కూడా అదే నిర్ణయానికి వస్తారని ఆశిస్తున్నాను." అని రవీంద్రన్​ తెలిపారు. కంపెనీ అంతర్జాతీయ కొనుగోళ్లకు సంబంధించి నిధులు సమకూర్చేందుకు.. కొంత సొమ్మును విదేశాలకు పంపినట్లు రవీంద్రన్ తెలిపారు.

అనేక విదేశీ కొనుగోళ్లను సంస్థ చేపట్టిందని.. దాని వృద్ధి ప్రణాళికలో భాగంగా కొన్నేళ్లుగా రూ.9వేల కోట్లు పెట్టుబడి పెట్టిందని రవీంద్రన్​ వివరించారు. ఈ కొనుగోళ్లు తమ పరిధిని, ప్రభావాన్ని విస్తరించడంలో కీలకపాత్ర పోషించాయన్నారు. ఆ సమయంలో చట్టపరంగా.. సంస్థ అన్ని నిబంధనలు పాటించిందని ఆయన సృష్టం చేశారు. సంస్థ ద్వారా దేశంలో 55వేల మందికి ఉద్యోగాలు కల్పించామని ఉద్యోగులకు రాసిన లేఖలో రవీంద్రన్ పేర్కొన్నారు. దీంతో దేశంలోనే అతి ఎక్కవ మంది ఉద్యోగులు కలిగిన స్టాపర్​గా బైజూస్​ నిలిచిందని గుర్తు చేశారు. విచారణలో అధికారులకు పూర్తి సహకారం అందిస్తామని ఆయన​ స్పష్టం చేశారు.

సోదాలతో కలకలం.. బైజూస్‌ సీఈఓ రవీంద్రన్​ కార్యాలయంతో పాటు ఆయన నివాసంలో శనివారం ఉదయం ఈడీ సోదాలు జరిపింది. ఫెమా నిబంధనల ప్రకారం.. సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలతో పాటు డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకుంది. బెంగళూరులో ఉన్న రవీంద్రన్​ రెండు కార్యాలయాలతో పాటు ఇంట్లోనూ ఈ సోదాలు నిర్వహించింది.

కొందరు బయట వ్యక్తుల ద్వారా వచ్చిన వివిధ ఫిర్యాదుల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నామని ఈడీ తెలిపింది. రవీంద్రన్​కు పలుమార్లు సమన్లు జారీ చేశామని.. కానీ ఆయన ఈడీ ముందు హాజరు కాలేదని వెల్లడించింది. 2011-2023లో బైజూస్​.. దాదాపు రూ.28,000 కోట్ల మేరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అందుకుందని తనిఖీల అనంతరం ఈడీ తెలిపింది. అదే సమయంలో రూ.9,754 కోట్లను వివిధ దేశాలకు బైజూస్​ బదిలీ చేసినట్లు పేర్కొంది. ఇందులో అవకతవకలు జరిగాయని, ఫెమా చట్టాన్ని ఉల్లంఘించి ఈ నిధులను స్వీకరించినట్లు ఫిర్యాదులు అందాయని సంస్థ వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి బైజూస్​ కంపెనీ ఆర్థిక లావాదేవీలను వెల్లడించలేదని.. ఖాతాలను ఆడిటింగ్‌ చేయించలేదని ఈడీ వివరించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.