Kalyan Jewellers MD Business Net worth : భారతదేశంలో బంగారానికి ఉండే డిమాండ్ ఎంతో ఎక్కువ. మన దేశంలో ఏ చిన్న శుభకార్యానికైనా బంగారం దుకాణాలకు జనాలు బారులు కడుతుంటారు. బంగారాన్ని ఇక్కడ హోదాను చూపించుకోవడానికి మాత్రమే కాకుండా ఆస్తిగా, భరోసాగా భావిస్తారు. అలాంటి బంగారాన్ని అమ్మే దుకాణదారులు కూడా భారతదేశంలో లెక్కలేనంత మంది ఉన్నారు. దేశంలో బంగారం వ్యాపారం అంతకంతకు విస్తరిస్తుండగా.. కొంతమంది బంగారు వ్యాపారవేత్తలు మాత్రం తమకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించారు. ఇలా ప్రత్యేక గుర్తింపు సాధించిన బంగారు వ్యాపార సంస్థల్లో కల్యాణ్ జువెలర్స్‌కు మంచి గుర్తింపు ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కల్యాణ్ జువెలర్స్‌కు స్టోర్స్ ఉన్నాయి.
వాస్తవానికి భారతదేశంలో అగ్రగామి బంగారు విక్రయ సంస్థల్లో కల్యాణ్ జువెలర్స్ ఒకటి. వాస్తవానికి ఈ కల్యాణ్ జువెలర్స్ పేరు వినని పసిడి ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు. మరి ఇంతటి పేరు ప్రఖ్యాతులు పొందిన ఈ సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఆయనే టీ.ఎస్. కల్యాణరామన్.
చిరుప్రాయంలోనే!
T S Kalyanaraman Business : 12 ఏళ్ల చిరుప్రాయంలోనే బంగారం వ్యాపారంలో ప్రవేశించిన కల్యాణరామన్.. అంచెలంచెలుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు. దశాబ్దాలపాటు కల్యాణ్ జువెలర్స్‌ను విజయపథంలో నడిపించిన ఆయన.. నేడు దానిని 1.35 బిలియన్ డాలర్ల విలువైన సంస్థగా తీర్చిదిద్దారు. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
దేశవ్యాప్తంగా విస్తరణ!
1993లో త్రిస్సూర్ పట్టణంలో చిన్న బంగారు దుకాణంగా ప్రారంభమైన కల్యాణ్ జువెలర్స్.. నేడు దేశవ్యాప్తంగా 150 స్టోర్స్‌ను కలిగి ఉంది. వార్బర్గ్ పింకాస్ లాంటి పెట్టుబడిదారులు కూడా దీనిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రస్తుతం ఈ సంస్థ రెవెన్యూ 1.35 బిలియన్ డాలర్లకు పెరిగింది.
కల్యాణ్ రామన్ నెట్‌వర్త్
T S Kalyanaraman Business Net worth : ప్రఖ్యాత ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఈ దిగ్గజ వ్యాపారవేత్త (కల్యాణరామన్) సంపద విలువ అక్షరాల 1.5 బిలియన్ డాలర్లుగా ఉంది.
రాజభోగాలు
T S Kalyanaraman Net worth : చిరుప్రాయంలోనే వ్యాపారాన్ని స్థాపించి, అంచెలంచెలుగా వ్యాపారాభివృద్ధి సాధించి, నేడు రాజభోగాలు అనుభవిస్తున్న ఈ కోటీశ్వరునికి సొంత హెలీకాప్టర్ ఉంది. అలాగే ఆయన ఎన్నో ఖరీదైన కార్లతో పాటు రూ.178 కోట్ల విలువ చేసే ఒక ప్రైవేట్ జెట్‌ను కూడా కలిగి ఉన్నారు.
రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా!
T S Kalyanaraman Real Estate Business : బంగారం వ్యాపారంలో తిరుగులేని బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న కల్యాణ్ జువెలర్స్‌ను కళ్యాణరామన్ మరింత విస్తరిస్తున్నారు. ఇటు బంగారు వ్యాపారం చేస్తూనే మరోపక్క రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి కూడా ఆయన అడుగేశారు. కల్యాణ్ డెవలపర్స్ పేరుతో దక్షిణ భారతదేశంలో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. దానిని కూడా విజయపథంలో నడిపిస్తున్నారు.
- ఇదీ చదవండి :
- Gold Rate Today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
- LIC Jeevan Kiran : ఎల్ఐసీ న్యూ పాలసీ.. ప్రీమియం డబ్బులు వెనక్కి వచ్చేస్తాయ్! మరెన్నో బెనిఫిట్స్ కూడా!
- గిరిజనుడి విజయగాథ.. తినడానికి తిండి లేని స్థాయి నుంచి అమెరికాలో టాప్ సైంటిస్ట్‌గా..
- 18 ఏళ్లకే డాక్టర్.. 22 ఏళ్లకే ఐఏఎస్ ఆఫీసర్.. 30 ఏళ్లకే రూ.2600 కోట్ల బిజినెస్!..అతను ఎవరో తెలుసా?