Bank Holidays In October 2023 : బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య గమనిక. అక్టోబర్ మాసంలో దాదాపు 16 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని.. ముందస్తుగా తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం మంచిది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతి నెలా.. బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా అక్టోబర్ నెలలోని సెలవుల జాబితాను కూడా విడుదల చేసింది.
ఇండియా ఎంతో వైవిధ్యమైన దేశం. అందువల్ల జాతీయ, ప్రాంతీయ పండుగలు అనేకం ఉంటాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ.. ఆయా పండుగులకు అనుగుణంగా సెలవులను ప్రకటిస్తూ ఉంటుంది. అందువల్ల ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు ప్రత్యేకంగా సెలవులు ఉంటాయి. అందుకే అక్టోబర్ మాసంలో ఉన్న బ్యాంకు సెలవులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Holidays In October 2023 India :
- అక్టోబర్ 2 (సోమవారం) : మహాత్మా గాంధీ జయంతి
- అక్టోబర్ 14 (రెండో శనివారం)
- అక్టోబర్ 15 (ఆదివారం)
- అక్టోబర్ 18 (బుధవారం) : కతి బిహు (అసోం)
- అక్టోబర్ 19 (గురువారం) : సంవత్సరి పండుగ (గుజరాత్)
- అక్టోబర్ 21 (శనివారం) : దుర్గా పూజ (మహా సప్తమి)
- అక్టోబర్ 22 (ఆదివారం)
- అక్టోబర్ 23 (సోమవారం) : మహానవమి/ ఆయుధ పూజ
- అక్టోబర్ 24 (మంగళవారం) : దసరా/ విజయదశమి/ దుర్గాపూజ
- అక్టోబర్ 25, 26, 27 : కొన్ని ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అక్టోబర్ 25, 26, 27 తేదీల్లో దుర్గా పూజ/ విజయ దశమి జరుపుకుంటారు. కనుక ఈ తేదీల్లో ఆయా రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
- అక్టోబర్ 28 (నాల్గో శనివారం) : లక్ష్మీ పూజ, ప్రగత్ దివస్
- అక్టోబర్ 31 (మంగళవారం) : సర్దార్ వల్లభ్ బాయి పటేల్ జయంతి
సెలవు దినాల్లో ఆర్థిక లావాదేవీలు ఎలా చేయాలి?
Are Banks Open On Bank Holidays : బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు నడుస్తూనే ఉంటాయి. అలాగే యూపీఐ సర్వీసులు, ఏటీఎం సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. వీటి ద్వారా ఆర్థిక లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు.