ETV Bharat / business

ఎయిర్​ ఇండియాలో ఉద్యోగాల జాతర.. 5100 మందికి జాబ్స్ - ఎయిర్​ ఇండియా 5100 జాబ్స్

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్​ ఇండియా నిరుద్యోగులకు గుడ్​న్యూస్​ చెప్పింది. తమ కంపెనీలో ఈ ఏడాది అత్యధికంగా 5100 మందిని కొత్తగా విధుల్లోకి తీసుకోనున్నట్లు ప్రకటించింది.

Job Mela In Air India
ఎయిర్​ ఇండియాలో ఉద్యోగాలు
author img

By

Published : Feb 24, 2023, 6:17 PM IST

Updated : Feb 24, 2023, 7:19 PM IST

ఎయిర్‌లైన్స్​ దిగ్గజం ఎయిర్​ ఇండియా ఉద్యోగార్థులకు శుభవార్త వినిపించింది. ఈ సంవత్సరం ఏకంగా 5100 మందిని నూతనంగా విధుల్లోకి తీసుకోనున్నట్లు తెలిపింది. దేశంలోని అనేక నగరాలతో పాటు అంతర్జాతీయంగా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్న వేళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారందరికీ ఈ రిక్రూట్​మెంట్​లో అవకాశం కల్పిస్తామని సంస్థ తెలిపింది. ఎంపికైన వారిలో సేవా నైపుణ్యాలను పెంపొందించేందుకు 15 వారాల ప్రత్యేక శిక్షణను కూడా ఇవ్వనున్నట్లు చెప్పింది. ఈ శిక్షణను పొందే అభ్యర్థుల కోసం ముంబయిలో ప్రత్యేకంగా తరగతి గదులతో పాటు పలు ఫ్లైట్లలో ట్రైనింగ్​కు ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించింది.
"కొత్తగా తీసుకునే ప్రతిభావంతుల ద్వారా ఎయిర్​ ఇండియా సేవలు మరింత వేగం పుంజుకుంటాయని ఆశిస్తున్నాం. వీటితో పాటు భవిష్యత్తులో మరి కొంతమంది పైలట్లు సహా ఇంజనీర్లను కూడా నియమించుకునే యోచనలో ఉన్నాం." అని ఎయిర్​ ఇండియా సర్వీసెస్ అధినేత సందీప్ వర్మ చెప్పారు.

విమాన సేవల విస్తరణలో భాగంగా ఇటీవల పలు విమానాలను కొనుగోలు చేస్తున్న ఎయిర్​ ఇండియా.. ఇందుకు అవసరమయ్యే సిబ్బందిని నియమించుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ నియామక ప్రక్రియను ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని నిర్దేశించుకుంది. అయితే ఈ 5100 మంది మొత్తంలో 4200 మందిని క్యాబిన్​ క్రూ ట్రైనీలుగా, విమానంలో ఇతర విభాగాలకు అవసమయ్యే సిబ్బందిని రిక్రూట్​ చేసుకోవాలని.. మరో 900 మందిని పైలట్లుగా నియమించుకోవాలని యోచిస్తోంది.
గత 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి మధ్య 1900 మంది క్యాబిన్​ క్రూ సిబ్బందిని నియమించుకున్నట్లు ఎయిర్​ ఇండియా తెలిపింది. గత ఏడు నెలల్లో 1100 మందికి పైగా క్యాబిన్ క్రూకు శిక్షణ ఇవ్వగా.. గత మూడు నెలల్లో సుమారు 500 మంది విధుల్లో చేరారని చెప్పింది.

ఎయిర్ ఇండియా తన విమాన సేవలను విస్తరించేందుకు ఈ నెల ఆరంభంలో బోయింగ్​, ఎయిర్​బస్​ కంపెనీల నుంచి 470 విమానాలను కొనుగోలు చేసేందుకు ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలిపింది. సంస్థ ఇప్పటికే 36 విమానాలను లీజుకు తీసుకునేందుకు ప్రణాళికలను రూపొందించుకోగా.. ఇందులో రెండు బీ 777-200 LR ఫ్లైట్లు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated : Feb 24, 2023, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.